
సాక్షి, హైదరాబాద్ : కదులుతున్న రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య చిక్కుకున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసు కానిస్టేబుల్ రక్షించారు. రైలుతో పాటు ఈడ్చుకుపోతున్న అతడిని సురక్షితంగా బయటికి లాగి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషనులో గురువారం చోటుచేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన 12 సెకన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ప్రయాణికుడిని చాకచక్యంగా బయటికి లాగిన కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే విధంగా..‘క్షణం ఆలస్యం అయి ఉంటే అతడు శవమయ్యేవాడు. కాబట్టి రైలు ఎక్కేపుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ’అని సూచిస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనలు జరిగినపుడు విలువైన ప్రాణాలు కాపాడేందుకు రైల్వే పోలీసులు వెంటనే స్టేషన్ మాస్టర్ లేదా డ్రైవర్‌ను వెనువెంటనే అప్రమత్తం చేసేలా అలెర్ట్ డివైజ్‌లు తెచ్చే ఆలోచన చేయాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ట్వీట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment