సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్ విధానంపై కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. ఈ విధానానికి సంబంధించి న çపూర్తి సమాచారం అందిస్తే దానిపై అధ్యయనం చేస్తామన్నారు. గురువారం రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో ‘వన్ డిస్ట్రిక్–వన్ ప్రొడక్ట్’ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని సైతం కేంద్ర మంత్రి అభినందించారు. మనదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిజమైన ‘ఆత్మ నిర్బర్ భారత్’ కావాలంటే భారీ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనే మార్గమని ఈ సందర్భంగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ దిశగా తమ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న భారీ పారిశ్రామిక పార్కులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని కోరారు.
ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్..
ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ నగరం ఉందని, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో మరింత అ భివృద్ధికి ఇక్కడ అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఆరేళ్లలో టీఎస్ ఐపాస్ ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నామన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడు లు వస్తున్న నేపథ్యంలో స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా కార్యాచరణ చేపట్టినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment