ఘరానా ఆటో దొంగ అరెస్ట్ | auto theft arrested in hyderabad | Sakshi
Sakshi News home page

ఘరానా ఆటో దొంగ అరెస్ట్

Published Fri, Apr 29 2016 2:13 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

auto theft arrested in hyderabad

హైదరాబాద్: పార్క్ చేసి ఉన్న ఆటోలను మాయం చేస్తున్న ఘరానా దొంగ పోలీసులకు చిక్కాడు. ఫలక్‌నుమా పోలీసులు గురువారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆటోలో వెళుతూ అనుమానాస్పదంగా కనిపించిన అజీజ్‌ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. పత్రాలు చూపించకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆటోల చోరీ వ్యవహారం వెలుగు చూసింది. విచారణ అనంతరం అతడు కొట్టేసిన 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కొట్టేసిన ఆటోల ఇంజన్ నంబర్లను మార్చి గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 నుంచి రూ. 20 వేలకు విక్రయించేవాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫా నగర్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్, కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతాల్లో ఇతడు చోరీలకు పాల్పడినట్టు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement