పాతబస్తీ ఫలక్ నుమా పీఎస్ పరిథిలోని ప్రెసిడెన్సీ కాలేజీలో గురువారం ర్యాగింగ్ కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. ప్రెసిడెన్సీ జూనియర్ కాలేజీలో ఓ యువతిని సీనియర్స్ ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేశారు. తన చెల్లెల్ని ఎందుకు ర్యాగింగ్ చేస్తున్నారని యువతి సోదరుడు ప్రశ్నించగా.. అతడి మీద దాడికి దిగారు. దీంతో బాధిత విద్యార్థిని కుటుంబం ఫలక్ నుమా పోలీసులను ఆశ్రయించారు. ఘనటకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.