ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయిని వేధించిన ఘటన పాతబస్తీలో కలకలం రేపింది.
హైదరాబాద్: ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయిని వేధించిన ఘటన పాతబస్తీలో కలకలం రేపింది. ఫలక్ నుమాలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని... అమీర్ అనే సహ విద్యార్ధి వేధించాడు. పేపర్ పై తన ఫోన్ నంబర్ రాసి ఆమెకు ఇచ్చాడు. రోజూ తనకు ఫోన్ చేయాలని ఆమెను వేధించసాగాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన సోదరుడితో చెప్పింది. అతడు స్నేహితులతో కలిసి అమీర్ పై దాడి చేశాడు.
అమీర్ తరపు కూడా వారితో కలబడంతో ఇరు వర్గాలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరుపక్షాలపై కేసు నమోదు చేశామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ 'సాక్షి' టీవీకి తెలిపారు. అమీర్ పై నిర్భయ కేసు కూడా పెట్టామని చెప్పారు. సాయంత్రంలోపు రెండు గ్రూపులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతామన్నారు.