oldcity
-
హైదరాబాద్ : మొగల్ పురలో రెచ్చిపోయిన పోలీసులు
-
హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం
-
MJ మార్కెట్, పాతబస్తీలో హైఅలర్ట్
-
పాతబస్తీలో కొనసాగుతున్న పోలీసుల గస్తీ
-
పాతబస్తీలో హైటెన్షన్
-
పాతబస్తీలో అర్థరాత్రి ఆందోళనలు
-
పాతబస్తీలో హల్చల్ చేసిన మరో కార్పొరేటర్
-
హైదరాబాద్: పాతబస్తీలో ఓ మహిళా ఆత్మహత్యాయత్నం
-
పాతబస్తీలో వరద ప్రవాహంలో వ్యక్తి గల్లంతు
-
హైదరాబాద్: పాతబస్తీలో గ్యాంగ్ వార్
-
భార్య పిల్లలను అమ్మేసిన కసయి భర్త
-
ఓల్డ్‌సిటీలో 'మోదీ' హల్చల్
చార్మినార్ : ఓల్డ్‌సిటీలో 'మోదీ' హల్చల్ చేస్తున్నారు. ఆయన ఫోటోతో ఉన్న పంతగులు పాతబస్తీ వాసులను, పర్యాటకులను అలరిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కొందరు ప్రధాని మోదీ ఫోటోతో కూడిన పతంగులను పంచిపెట్టారు. వారిలో ముస్లింలే అధికులు కావడం విశేషం. ''అన్ని పండుగలు హిందూ, ముస్లింలు కలిసి జరుపుకోవడం ఇక్కడే కాదు, దేశమంతటా ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి పండుగ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. హిందూ-ముస్లిం ఐక్యతను చాటే ఈ పండుగలో మేము పాలుపంచుకున్నాం'' అని బీజేపీ అధికార ప్రతినిధి మిర్ ఫిరసత్ అలీ చెప్పారు. సంక్రాంతి, పతంగుల పండుగల సందర్భంగా బీజేపీ తెలంగాణ మైనారిటీ మోర్చ వైస్ ప్రెసిడెంట్ కవి అబ్బాసితో కలిసి, ఫిరసత్ అలీ, ప్రధాని నరేంద్రమోదీ ఫోటోతో కూడిన 300 పతంగులను చార్మినార్ వద్ద పర్యాటకులకు, స్థానికులకు పంచారు. పాత బస్తీ ప్రజల సంక్షేమాన్ని బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుందనే సందేశాన్ని ప్రజలకి అందిస్తున్నామని ఫిరసత్ అలీ చెప్పారు. -
మంచినీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
– మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ కన్నబాబు కర్నూలు (టౌన్): మంచినీటి ఎద్దడిని తలెత్తనీయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ కన్నబాబు ఆదేశించారు. శనివారం సాయంత్రం కర్నూలు నగరానికి వచ్చిన ఆయన ..స్థానిక ప్రభుత్వ ఆతిథి గృహంలో నగర పాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే నగరంలోని పాత బస్తీ ప్రాంతంలో పర్యటించారు. వీధుల్లో పారిశుద్ధ్యం మెరుగుపడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్సుకోవాలని మున్సిపల్ ఆరోగ్యశాఖ సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్, ఆరోగ్యశాఖ, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు ప్రజలకు మంచినీటి ఇక్కట్లు రాకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీరింగ్ విభాగంపై ఉందన్నారు. సుంకేసులలో, అలాగే సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్‌లోనూ నీరు అడుగంటిందన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, నీటి పన్నులను వంద శాతం వసూలు చేయాలన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం, మున్సిపల్ ఇంజనీరు రాజశేఖర్, మేనేజర్ చిన్నరాముడు, నగరపాలక ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు మల్లిఖార్జున, వీరస్వామి పాల్గొన్నారు. -
పాతబస్తీలో సీఎం పర్యటన
-
‘మక్కా’ నిందితుడికి ‘సంఝౌతా’ కేసులో బెయిల్
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉన్న నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానందకు హర్యానాలోని పంచకుల న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులోనూ ఇతడు నిందితుడిగా ఉండటంతో ఆ కేసులో బెయిల్ లభించింది. భారత్–పాక్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 2007 ఫిబ్రవరి 18న భారీ పేలుడు జరిగింది. ఢిల్లీకి 80 కిమీ దూరంలో ఉన్న పానిపట్ సమీపంలోని దివానా వద్ద జరిగిన ఈ ఘటనలో మొత్తం 68 మంది పాక్ పౌరులు మరణించారు. ఈ కేసును తొలుత స్థానిక పోలీసులు దర్యాప్తు చేసిప్పటికీ ఆపై కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. ‘సంఝౌతా’లో వినియోగించిన బాంబులు హైదరాబాద్‌లోని మక్కా మసీదు, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాల్లో వినియోగించిన వాటిని పోలి ఉన్నాయి. దీంతో దర్యాప్తు సంస్థలు ఇవన్నీ ఒకే మాడ్యుల్ పనిగా నిర్థారించాయి. ‘మక్కా’, ‘అజ్మీర్’ కేసుల్లో అసిమానంద కీలక నిందితుడిగా తేలడంతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడులోనూ నిందితుడిగా చేర్చింది. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న అసిమానందను అధికారులు 2010లో అరెస్టు చేసింది. అప్పట్లోనే ‘మక్కా’ కేసుకు సంబంధించి పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకువచ్చి విచారించింది. తాను చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగానే కలీమ్ అనే వ్యక్తి పరిచయంతో పరివర్తన చెందానంటూ ఎన్ఐఏ విచారణలో బయటపెట్టిన విషయం విదితమే. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ చెందిన సర్కార్ బోటనీలో పోస్టుగ్యాడ్యూషన్ పూర్తి చేశారు. కమ్యూనిస్ట్ భావాలను వ్యతిరేకించి తన మకాంను గుజరాత్‌కు మార్చాడు. బెంగాల్‌ను వదిలే ముందు కొంత కాలం పాటు రామకృష్ణ మిషన్‌లో పని చేశాడు. గుజరాత్‌లోని దాంగ్స్ జిల్లాలో ఆశ్రమాన్ని నెలకొల్పిన సర్కార్ తన పేరును స్వామి అసిమానందగా మార్చుకున్నాడు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా మారి ఓ వర్గానికి చెందిన వారితో సభలు, సమావేశాలు నిర్వహించేవాడు. తరచూ ఉగ్రవాదంపై చర్చిస్తూ దీనికి ప్రతీకారంగా దాడులకు దిగాలంటూ అను^è రులను రెచ్చగొట్టేవాడు. ‘మక్కా’ కేసుల్లో నిందితులుగా ఉండి పట్టుబడిన దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మల విచారణలో అసిమానందకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. అశిమానందకు ఇప్పటికే ‘అజ్మీర్’ కేసులో బెయిల్ లభించింది. ఇప్పుడు ‘సంఝౌతా’లోనూ బెయిల్ మంజూరైంది. ‘మక్కా’ కేసులో బెయిల్ రాకపోవడంతో నగరానికి తరలించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
పాతబస్తీలో యువకుడు హత్య.?
విజయవాడ(వన్‌టౌన్): పాతబస్తీ మల్లికార్జునపేటలో సోమవారం ఒక యువకుడు హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. కార్పొరేషన్ పాఠశాల సమీపంలో జిమ్ నిర్మిస్తున్నారు. అక్కడ పనులు జరగకపోవటంతో ఆ ప్రాంతం నిర్మానుషంగా ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్థానికులు ఆ ప్రాంతంలో ఒక యువకుడి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు 35 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. చిత్తుకాగితాలు సేకరించే వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి మెడపై తాడుతో బిగించిన ఆనవాలు ఉన్నాయి. శరీరంపై చిన్నచిన్న దెబ్బలు కనిపిస్తున్నాయి. మిత్రుల మధ్య విబేధాలు హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు నల్ల ప్యాంట్, నల్ల చారల గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
పాతబస్తీలో దారుణం..
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి చంపిన ఘటన చత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కందికల్లోని ఫ్లైఓవర్ కింద బుధవారం అర్ధరాత్రి పది నెలల చిన్నారి చంపి పడేశారు. గురువారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
'నా కూతుర్ని బంధించి హింసించి చంపారు'
యాకుత్‌పురా (హైదరాబాద్‌సిటీ): ఉపాధి కోసం రియాద్ దేశానికి వెళ్లిన తన కూతురు తోటి పని వారి చేతిలో చిత్రహింసలకు గురై మృతి చెందిందని, మృతదేహాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని మృతురాలు ఆసిమా ఖతూన్ తల్లి గౌసియా ఖతూన్ కోరారు. చంచల్గూడలోని తన నివాసంలో గురువారం ఎంబీటీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ అంజదుల్లా ఖాన్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడుతూ... నాలుగు నెలల క్రితం హౌస్ మెయిడ్ (ఇంట్లో పని) వీసాపై తమ కూతురు ఆసిమా ఖతూన్ (25) రియాద్ వెళ్లిందన్నారు. అక్కడ తన కూతుర్ని తోటి పని వారు ఓ గదిలో వేసి బంధించి, హింసించారని చెప్పింది. తీవ్ర అనారోగ్యానికి గురైన తన కూతురు ఆసియాఖతూన్‌కు ఛాతీలో నొప్పి రావడంతో ఇంటికి తీసుకెళ్లమని తనకు ఫోన్ చేసి పలుమార్లు కోరిందన్నారు. 20 రోజుల తనకు ఫోన్ చేయకపోవడంతో ఆరా తీయగా.. రియాద్‌లోని కింగ్ సౌద్ చెస్ట్ డిసీస్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందినట్లు తెలిసిందన్నారు. దీనిపై తాము ఎంబాసీ, ఎన్నారై కార్యాలయాలతో పాటు పోలీసులకు సమాచారం అందించామన్నారు. తమ కూతురి మృతదేహాన్ని నగరానికి త్వరగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకరించాలని ఆమె కోరారు. -
పాతబస్తీ పోలీసులు ఓవరాక్షన్
హైదరాబాద్: పాతబస్తీ పోలీసుల ఓవరాక్షన్ మరోసారి విమర్శలకు దారితీసింది. డబిర్పుర పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డారు. సివిల్ కేసు సెటిల్మెంట్లో భాగంగా స్థానిక రౌడీషీటర్లతో కలసి పోలీసులు ఓ ఇంటిపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న మీడియా అక్కడకు చేరుకోవడంతో పోలీసులు జారుకున్నారు. పోలీసుల తీరుపై స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయికి వేధింపులు
హైదరాబాద్: ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయిని వేధించిన ఘటన పాతబస్తీలో కలకలం రేపింది. ఫలక్ నుమాలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని... అమీర్ అనే సహ విద్యార్ధి వేధించాడు. పేపర్ పై తన ఫోన్ నంబర్ రాసి ఆమెకు ఇచ్చాడు. రోజూ తనకు ఫోన్ చేయాలని ఆమెను వేధించసాగాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన సోదరుడితో చెప్పింది. అతడు స్నేహితులతో కలిసి అమీర్ పై దాడి చేశాడు. అమీర్ తరపు కూడా వారితో కలబడంతో ఇరు వర్గాలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరుపక్షాలపై కేసు నమోదు చేశామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ 'సాక్షి' టీవీకి తెలిపారు. అమీర్ పై నిర్భయ కేసు కూడా పెట్టామని చెప్పారు. సాయంత్రంలోపు రెండు గ్రూపులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతామన్నారు. -
ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయికి వేధింపులు
-
పాతబస్తీలో పోలీసుల తనిఖీలు..150 మంది అరెస్ట్
హైదరాబాద్: ఆకతాయుల అగడాలు ఆరికట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. నగరంలోని పాతబస్తీ, మీర్‌చౌక్, మొఘల్‌పురాలో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 150 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
కళ్లు చెదిరే సెట్టింగ్‌లతో... ఆర్ట్ డైరెక్టర్
అప్‌కమింగ్ కెరీర్: ‘ఒక్కడు’ సినిమాలో చార్మినార్‌ను చూసి ఆశ్చర్యపోనివారు ఉండరు. పాతబస్తీలోని నిజమైన చార్మినార్‌ను తలపించేలా దాన్ని కృత్రిమంగా నిర్మించారు. ఆ క్రెడిటంతా ఆర్ట్ డెరైక్టర్కే దక్కుతుంది. అలాగే మగధీర, యమదొంగ వంటి సినిమాల్లోని సెట్టింగ్‌లు ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లాయి, తమ సృజనాత్మకతతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఆర్ట్ డెరైక్టర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. చేతినిండా పని: సినిమాలు, టీవీ కార్యక్రమాలు, యాడ్ ఫిల్మ్‌ల చిత్రీకరణకు, రంగ స్థలంపై నాటకాలకు సందర్భానికి తగిన సెట్టింగ్‌లు వేయడం తప్పనిసరి. వీటివల్లే దృశ్యానికి నిండుతనం వస్తుంది. వీక్షకులను మెప్పిస్తుం ది. సినిమాల చిత్రీకరణతోపాటు టీవీ ఛానళ్ల సంఖ్య పెరగడంతో ఆర్ట్ డెరైక్టర్లకు చేతినిండా పని దొరుకుతోంది. స్డూడియోల్లో వీరికి అవకాశాలు లభిస్తున్నాయి. నైపుణ్యాలు పెంచుకోవాలి: ఆర్ట్ డెరైక్టర్‌గా వృత్తిలో పైకి ఎదగాలంటే ప్రధానంగా శ్రమకు వెనుకాడని లక్షణం ఉండాలి. విసృ్తతంగా చదివే అలవాటుతో ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. పరిశీలనా శక్తి అవసరం. ఎప్పటికప్పుడు టైమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, ప్లానింగ్, నెట్వర్కింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలు ఉన్నప్పటికీ మంచి పనితీరుతో గుర్తింపును తెచ్చుకుంటే అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. ఆర్ట్ డెరైక్షన్ కోర్సు పూర్తిచేసిన తర్వాత మొదట సీనియర్ డెరైక్టర్ వద్ద సహాయకుడిగా పనిచేసి వృత్తిలో అనుభవం సంపాదించాలి. తర్వాత సొంతంగా ప్రాజెక్ట్‌లు చేపట్టవచ్చు. అర్హతలు: ఫైన్ ఆర్ట్స్‌లో భాగంగా ఆర్ట్ డెరైక్షన్ కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీయెట్ పూర్తయిన తర్వాత ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయొచ్చు. ఇంటీరియర్ డిజైన్, ఆర్కిటెక్చర్ విభాగాల్లోనూ నైపుణ్యం, తగిన అనుభవం సంపాదించినవారు ఆర్ట్ డెరైక్షన్లోకి ప్రవేశించొచ్చు. వేతనాలు: అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌కు ప్రారంభంలో నెలకు రూ.7 వేల వేతనం ఉంటుంది. తర్వాత హోదాను బట్టి పెరుగుతుంది. కనీసం మూడేళ్లపాటు పనిచేసి, నైపుణ్యాలు పెంచుకుంటే నెలకు రూ.30 వేలకు పైగానే సంపాదించుకోవచ్చు. సొంత ప్రాజెక్టులతో రూ.లక్షల్లో ఆర్జించవచ్చు. ఆర్ట్ డెరైక్షన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణె వెబ్సైట్: www.ftiindia.com ఆసియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టీవీ వెబ్సైట్: www.aaft.com బనారస్ హిందూ యూనివర్సిటీ; వెబ్సైట్: www.bhu.ac.in మహారాజా శాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా వెబ్సైట్: www.msubaroda.ac.in సృజనాత్మకత ఉండాలి! శ్రీసినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలతోపాటు అడ్వర్టైజ్మెంట్ చిత్రీకరణకు సెట్స్ నిర్మాణం తప్పనిసరి అవుతోంది. ఈ నేప థ్యంలో చిత్ర రంగంలో ఆర్ట్ డెరైక్టర్స్‌కు మంచి అవకాశా లున్నాయి. ఒక్కో సెట్‌కు దీర్ఘకాలం పాటు కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఓర్పు, సహనం, కష్టపడే తత్వం ఉండాలి. ఉదాహరణకు ‘ఒక్కడు’ సినిమా సెట్ వేయడానికి 300 మంది మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది. దానికి ప్రతిఫలంగానే సెట్‌కు మంచి గుర్తింపు లభించింది. ఈ రంగంలో డిమాండ్‌ను బట్టి వేతనాలు/పారితోషకాలు లభిస్తాయి. పరిశ్రమలో రూ. 30 వేలు తీసుకునేవారితోపాటు రూ. 40లక్షలు పారితోషకం పొందేవారూ ఉన్నారు.్ణ - కె. అశోక్ కుమార్, ప్రముఖ సినీ ఆర్ట్ డెరైక్టర్ . -
స్కిల్ ఉండాలి గురూ
మీ.. ప్రదీప్ పక్కా లోకల్ కుర్రోడు. పుట్టింది.. పెరిగిందీ ఇక్కడే. ఉదయం పూర్ణా టిఫిన్ సెంటర్లో ఉపహారం.. రాత్రి గోషామహల్లో దోశ తినడం మనోడి టేస్ట్. రద్దీగా ఉండే పాతబస్తీ అంటే మరీ ఇష్టం. ఊర్లెన్ని తిరిగినా.. సిటీకొస్తేనే ఊపిరాడుతుంది. ఇప్పుడు బుల్లితెరపై యాంకరింగ్‌తో రచ్చ చేస్తూ ఇంట గెలిచిన ప్రదీప్, స్కిల్స్ ఉంటే సక్సెస్ వస్తుందని చెబుతున్నాడు. నాన్న రియల్ ఎస్టేట్. అమ్మ గృహిణి. వాళ్లకు అక్క, నేను ఇద్దరం. నా ఫ్రెండ్స్ ఇక్కడి వాళ్లే. ఇప్పటికీ వాళ్లతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాను. హైటెక్ సిటీ ఉన్న ఏరియా అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్నట్టు కాదు.., 20 ఏళ్ల కిందట కాలుష్యం సోకని స్వచ్ఛమైన ప్రాంతం అది. ఇప్పుడు అటుగా వెళ్తుంటేనే బాధనిపిస్తుంది. చిన్నతనంలో మా ఫేవరేట్ స్పాట్ దుర్గం చెరువు. వారంలో మూడుసార్లు వెళ్లే వాళ్లం. అప్పుడెటూ చూసినా పచ్చదనం.. ఇప్పుడెటు చూసినా కాంక్రీట్ వనం. మిస్సింగ్ స్టోరీ అప్పుడు నాకు నాలుగైదేళ్లు అనుకుంటా. కూరగాయల బండి దగ్గర మా అమ్మ బేరమాడుతోంది. నేను బండి కింద బుట్టలోకి దూరిపోయా. కట్ చేస్తే.. కూరగాయలమ్మి బండిని తోసుకుంటూ వెళ్లి పోయింది. నేను ఏడ్చే దాకా ఆమె నన్ను చూడలేదు. అడ్రస్ చెబుదామంటే మాటలు సరిగ్గా రావు. ఆమె నన్ను పోలీస్ స్టేషన్లో అప్పగించింది. నేను తప్పిపోయాననుకుని అమ్మానాన్నలు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అలా నా మిస్సింగ్ స్టోరీ సుఖాంతమైంది. మొదట్నుంచీ లాస్ట్ బెంచే ఆరో తరగతి వరకు నా సీటు లాస్ట్ బెంచే. చదువులోనూ లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంకే. ఏడో తరగతిలో మా మాస్టార్ ఓ క్లాస్ పీకారు. అంతే మ్యాథ్స్ అంటే భయంతో స్కూల్‌కు డుమ్మా కొట్టాలనుకునే నేను.. లెక్కల కోసమే క్లాస్‌కు వెళ్లేది. చదువులో ముందుకొచ్చినా.. లాస్ట్ బెంచీని వదల్లేదు. కాలేజ్ డేస్‌లో సినిమాలే సినిమాలు. సినిమాల్లో హీరో రోల్ చూసి అలా అవ్వాలనుకునే వాణ్ని. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో తమ్ముడు సినిమా తొమ్మిది సార్లు చూశా. ఆ సినిమా చూసి ఏ లక్ష్యం పెట్టుకోవద్దని డిసైడ్ అయ్యాను. కమిట్మెంట్ ఉండాలి.. ఇంజనీరింగ్ అయిపోగానే విదేశాలకు పంపి మాస్టర్స్ చేయించాలనుకున్నారు మా పేరెంట్స్. నాకేమో వెళ్లాలని లేదు. మొదట పోస్టర్స్, పాంప్లెట్స్ అంటించే ఉద్యోగం చేశాను. ఈ ఉద్యోగమేంటని అడిగితే.. పనిలో కమిట్మెంట్ ఉండాలి.. స్కిల్స్ ఉండాలి. సక్సెస్ ఆటోమేటిగ్గా వస్తుందన్నాను. రెండో రోజే రూ.20 వేల జీతంతో ఓ జాబ్ ఆఫర్ వచ్చింది. తర్వాత ఆర్జేగా చాన్స్ వచ్చింది. సుమ, ఝాన్సీ నాకు స్ఫూర్తి. యాంకరింగ్‌లో నిలబడగలిగానంటే నా జీల్‌తో పాటు పేరెంట్స్ సపోర్ట్ చేశారు. హైదరాబాద్ అద్దం లాంటిది ‘గడసరి అత్త సొగసరి కోడలు’ షూటింగ్లో భాగంగా 150 ప్రదేశాలు తిరిగాను. విదేశాలకూ వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా.. మళ్లీ హైదరాబాద్ చేరుకుంటేనే హాయిగా ఉంటుంది. నాకు జీవితమంటే ఏంటో నేర్పించింది ఈ నగరమే. హైదరాబాద్ అద్దం లాంటిది. మనం ఏమిస్తే తిరిగి అది మనకిస్తుంది. మనం ప్రేమిస్తే, ప్రేమించే వ్యక్తులు ఎదురవుతారు. కోపంగా ఉంటే అవతలి వ్యక్తి కూడా మనపై కోపం ప్రదర్శిస్తాడు. పూర్ణ టిఫిన్ సెంటర్... కృష్ణానగర్‌లోని పూర్ణ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చాలా ఇష్టం. ఇప్పుడు తెప్పించుకోవడం కూడా అక్కడినుంచే. పానీపూరి ఎక్కడ కనిపించినా ఓ పట్టు పట్టేస్తాను. లేట్‌నైట్‌లో ఓల్డ్ సిటీ గోషామహల్లో బండి మీద దోశ తినడం ఇంకా ఇష్టం. ఓల్డ్ సిటీ ఎంత రద్దీగా ఉంటుందో అంతే లైవ్లీగా ఉంటుంది. - శిరీష చల్లపల్లి -
రూ.90లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్ : పాతబస్తీలోని కాలాపత్తర్‌లో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.90 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీతో తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ పిల్ల రాక్షసులను గుర్తించారు
హైదరాబాద్: పాతబస్తీలో మైనర్ బాలికపై రాక్షసంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. తలాబ్‌కట్టకు చెందిన 14 ఏళ్ల బాలికను ఓ స్నేహితుడు నమ్మించి బయటకు తీసుకువెళ్లాడు. ఆ తరువాత ఆ బాలికను ఓ వాహనంలో తిప్పుతూ అత్యాచారం చేశాడు. అతనే కాకుండా అతని స్నేహితులు మరో ముగ్గురు కూడా మానవ మృగాల్లాగా ఆ బాలికపై అత్యాచారం చేశారు. నలుగురు కలిసి సామూహికంగా అత్యాచారం చేసి ఆ బాలికను హింసించారు. వివిధ ప్రాంతాలలో తిప్పుతూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితులు ఆటో డ్రైవర్ సల్మాన్, షేక్ ఇమ్రాన్, అజహర్, ఎండీ ఇమ్రాన్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై నిర్భయ చట్టం, ఐపీసీ 366 సెక్షన్ల కింద భవానీపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. దేశంలో అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామాంధులు స్వైర విహారం చేస్తున్నారు. ప్రతిరోజూ ఎన్నో చోట్ల మహిళలు, బాలికలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. కామాంధులకు భయంలేదు. పసిమొగ్గలను కూడా ఈ కామపిశాచులు వదలడంలేదు. నిర్భయ చట్టం కాగితాలకే పరిమితమైపోయింది. ఈ చట్టానికి కూడా ఎవరూ భయపడటంలేదు.