పాతబస్తీలో యువకుడు హత్య.?
పాతబస్తీలో యువకుడు హత్య.?
Published Mon, Aug 15 2016 10:39 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
విజయవాడ(వన్‌టౌన్):
పాతబస్తీ మల్లికార్జునపేటలో సోమవారం ఒక యువకుడు హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. కార్పొరేషన్ పాఠశాల సమీపంలో జిమ్ నిర్మిస్తున్నారు. అక్కడ పనులు జరగకపోవటంతో ఆ ప్రాంతం నిర్మానుషంగా ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్థానికులు ఆ ప్రాంతంలో ఒక యువకుడి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు 35 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. చిత్తుకాగితాలు సేకరించే వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి మెడపై తాడుతో బిగించిన ఆనవాలు ఉన్నాయి. శరీరంపై చిన్నచిన్న దెబ్బలు కనిపిస్తున్నాయి. మిత్రుల మధ్య విబేధాలు హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు నల్ల ప్యాంట్, నల్ల చారల గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Advertisement
Advertisement