సాక్షి, చెన్నై: వివాహాన్ని నిలిపేందుకు వధువును హతమార్చిన వరుడిని, అతని స్నేహితున్ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వివరాలు.. వాణియం పాళయం గ్రామానికి చెందిన కోదండపాణి కుమార్తె రమ్య (23). ఈమెకు నల్లూరు పాళయానికి చెందిన విజయకుమార్ (25)తో ఈనెల 20న నడువదిగై వీరట్టానేశ్వరర్ ఆలయంలో వివాహం జరుగనుంది. ఆదివారం విజయకుమార్, రమ్యను బయటికి తీసుకువెళ్లాడు. తర్వాత ఇరువురూ ఇంటికి చేరుకోలేదు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మాయమైన విజయకుమార్, రమ్య కోసం గాలించారు.
ఈ క్రమంలో తిరునావలూరు సమీపంలోని ఇరుందై గ్రామం వ్యవసాయ బావిలో రమ్య శవంగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి విజయకుమార్, అతని స్నేహితుడు పాండియన్‌ను సోమవారం అరెస్టు చేసి విచారించారు. విచారణలో విజయకుమార్ తనకు రమ్యకు మరో నాలుగు రోజుల్లో వివాహం జరుగనుందని, తనకు రమ్య నచ్చలేదని, ఎలాగైనా ఈ వివాహాన్ని నిలిపేందుకు నిర్ణయించానన్నారు. అయితే సాధ్యం కాలేదని, దీంతో బయటికి వెళ్దామని తెలిపి రమ్యను మోటార్ సైకిల్‌లో ఎక్కించుకుని తీసుకువెళ్లానన్నాడు. తనతోపాటు మరో బైకుపై పాండియన్‌ను తీసుకువెళ్లినట్లు చెప్పాడు. అక్కడ రమ్యతో తనకు వివాహం నచ్చలేదని ఎలాగైనా నిలిపివేయమని రమ్యను కోరగా ఆమె నిరాకరించినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహించిన తాను స్నేహితుని సాయంతో ఆమె గొంతు నులిమి చంపి పక్కన ఉన్న బావిలో పాడేశామని ఒప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment