marriage issue
-
వివాహం కావడంలేదని ఆత్మహత్యాయత్నం
జైపూర్(చెన్నూర్): వివాహం కావడంలేదని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రౌతు మొండక్క–పాపయ్య దంపతుల కుమారుడు రౌతు సంతోష్ (27) సింగాపూర్ ఓపెన్‌కాస్టులో డైవర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం కావడంలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం నర్సింగాపూర్ సమీపంలోని కుందారం వైపు వెళ్లే దారిలో పురుగుల మందుతాగి అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ముందుగా మంచిర్యాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు. సంతోష్ నేత్రాలతో ఇద్దరికి చూపు.. కాగా సంతోష్ నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేసి మృతుని కుటుంబ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. అతని మృతి చెందినా మరో ఇద్దరికి చూపునిచ్చాడని మృతుని కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. -
ఎమ్మెల్యే గారూ.. పెళ్లికి అమ్మాయిని వెతకండి..
ఔరంగాబాద్: దాదాపు పది ఎకరాల భూమి ఉన్నా పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెగ వాపోయాడు ఓ పెళ్లికాని ప్రసాద్. తెలిసిన వారందరినీ వధువు కోసం ఆరాతీసి విసిగిపోయిన ఆ అవివాహితుడు చివరకు ఏకంగా తమ నియోజకవర్గం ఎమ్మెల్యేకే ఫోన్ చేసి బాధపడిపోయాడు. మీరైనా పెళ్లికి సరిజోడీని వెతికిపెట్టండి సారూ అంటూ ఫోన్లోనే విన్నపాలు వినిపించాడు. అతని బాధను అర్థ్ధంచేసుకున్న ఆ ఎమ్మెల్యే పెళ్లిళ్ల పేరయ్యగా మారేందుకూ సిద్ధమయ్యాడు. వెంటనే బయోడేటా పంపించు.. పెళ్లికి అమ్మాయిని వెతికిపెట్టే పూచీ నాదీ అంటూ హామీ ఇచ్చాడు. ఎమ్మెల్యే, నియోజకవర్గ ఓటరుకు మధ్య జరిగిన ఈ ఆసక్తికర సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. మహారాష్ట్రలోని కన్నాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్‌కు అక్కడి ఖుల్తాబాద్ వాస్తవ్యుడికి మధ్య ఈ సంభాషణ జరిగింది. ఉదయ్‌సింగ్.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన చీలికవర్గానికి మద్దతు ఇస్తున్నారు. పెళ్లికాని ఓటరు ఫోన్‌కాల్‌పై మీడియా ప్రశ్నించగా ఎమ్మెల్యే సమాధాన మిచ్చారు. ‘ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాస్తవిక సమస్య ఇది. ఓ 2,000 మంది జనాభా ఉన్న గ్రామాన్ని తీసుకుంటే అందులో ఖచ్చితంగా 150 మంది యుక్తవయసు అబ్బాయిలు పెళ్లిళ్లుకాక ఇబ్బందులు పడుతున్నారు. 100 ఎకరాల భూస్వామి అయినా సరే వధువు కోసం తిప్పలు పడాల్సిందే. పట్టణప్రాంతాల్లో స్ధిరపడిన అబ్బాయిలవైపు అమ్మాయిల తల్లిదండ్రులు మొగ్గుచూపడమే ఇక్కడ అసలు సమస్య. పెళ్లి కావట్లేదు బాబోయ్ అంటూ నాకు ఇలాగే చాలా మంది ఫోన్లు చేశారు’ అని ఎమ్మెల్యే చెప్పారు. -
తాజా సర్వే: ఈ యువతకు ఏమైంది? పెళ్లి వద్దంటున్నారు!
ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలని పెద్దలు అంటారు. ఉద్యోగం వచ్చి కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి అనే భావన మన దగ్గర పెరిగి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు పెళ్లే వద్దనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం గమనించాల్సిన సంగతి. ‘జాతీయ గణాంకాల సంస్థ’ తాజా నివేదిక ప్రకారం మన దేశంలో 15– 29 ఏళ్ల మధ్య ఉండే యువత పెళ్లి తలంపునే చేయడం లేదు. అంటే 29 వరకూ పెళ్లి మాట ఎత్తడం లేదు. ఉద్యోగాలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా ‘చేసుకోవచ్చులే’ అనో మనసులో మాట చెప్పకుండా దాటవేయడమో చేస్తూ... తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నారు. ‘గుండెల మీద కుంపటి’ అనేది చాలా చెడ్డ పోలిక. గతంలో ఈ పోలికను పెళ్లి కాని ఆడపిల్లల విషయంలో తెచ్చేవారు. దానికి కారణం 1980ల ముందు వరకూ కట్నాలు తీవ్ర ప్రాధాన్యం వహించడం. ఆడపిల్లల్లో చదువు తక్కువగా ఉండి మధ్యతరగతి దగ్గర తగినంత డబ్బు లేకపోవడం. ఈ పరిస్థితి మెల్లగా మారింది. చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ ప్రాధాన్యంలోకి వచ్చాయి. ‘కట్నాలు’ క్రమంగా ‘లాంఛనాలు’గా మారాయి. మంచి సంబంధం కుదిరితే ఇచ్చిపుచ్చుకోవడాలు రెండో ప్రాధాన్యంలోకి వస్తున్నాయి. కనుక ఈ మాట మెల్లగా కనుమరుగైంది. అయితే ఈ మాట మళ్లీ ఉనికిలోకి వస్తుందా అనిపిస్తోంది– కాకుంటే ఈసారి ఆడపిల్లలు మగపిల్లల విషయంలో. గతంలో ‘పెళ్లి చేయలేక’ ఈ మాట అనేవారు. ఇప్పుడు పిల్లలు ‘పెళ్లి చేసుకోక’ ఈ మాట అనాల్సి రావచ్చు. ఏ మాటా చెప్పరు! ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఏదో ఒక ఉపాధి, ఉద్యోగం దొరుకుతున్నది. సంపాదనలో పడుతున్నారు. అయినా సరే పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. అసలు చేసుకుంటారో లేదో చెప్పడం లేదు. దాంతో తల్లిదండ్రులు అయోమయంలో ఉంటున్నారు. తీవ్ర ఆందోళన కూడా చెందుతున్నారు. ‘బాగా స్థిరపడి చేసుకోవడం’ అనే భావన గతంలో ఉన్నా ఈ ‘స్థిరపడటం’ అనే మాటకు అంతుపొంతు లేకుండా ఉంది. అబ్బాయిలు ‘ఏదో ఒక ఉద్యోగం వస్తే చేసుకుంటాను’ అనేది పోయి ‘ఈ స్థాయి వరకూ వచ్చాక చేసుకుంటాను’ అనుకుంటున్నారు. అమ్మాయిలు ‘మంచి సంబంధం ఏదో ఒకటి’ అనుకోవడం లేదు. చాలా ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు. దాంతోపాటు అసలు సమాజంలో ‘పెళ్లి’కి సంబంధించిన సకారాత్మక (పాజిటివ్) దృష్టి వ్యాప్తి చెందుతోందా నెగెటివ్ దృష్టి వ్యాప్తి చెందుతోందా కూడా గమనించాలి. ‘పెళ్లి ఒక జంజాటం’, ‘గొడవలు ఉంటాయి’, ‘తల్లిదండ్రులతో అత్తామామలతో సమస్యలు’, ‘అడ్జస్ట్మెంట్ సమస్యలు’, ‘విడాకుల భయం’, ‘చేసుకున్న భాగస్వామితో కంపాటబులిటీ ఉండకపోతే అన్న సందేహం’ ఇవన్నీ యువతలో పెళ్లి గురించి వైముఖ్యం పెంచుతున్నాయేమో గమనించాలి. రోజు రోజుకూ పెరిగిపోతున్న ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’... ధరలు... ఇంటి అద్దెలు... ఫ్లాట్ల విలువలు... వీటిని చూసి సంసారాన్ని ఈదగలమా అని అనిపిస్తూ ఉంటే గనక ఆ దడుపుకు మంత్రం పాలనా, పౌర వ్యవస్థలు కనిపెట్టాల్సిందే. నూటికి 23 శాతం జాతీయ గణాంకాల సంస్థ తాజా అధ్యయనం ప్రకారం నేటి యువతలో (15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వరకు) పెళ్లి మాట ఎత్తనివారి సంఖ్య 2019 నాటికి 23 శాతం ఉంది. 2011లో వీరి శాతం 17 మాత్రమే. బాల్య వివాహాలు తగ్గడం ఈ అధ్యయనంలో కనిపించినా తరుణ వయసు వచ్చాక కూడా పెళ్లి మాట ఎత్తకపోవడం పట్టించుకోవలసిన విషయంగా అర్థమవుతోంది. అబ్బాయిల్లో 2011లో నూటికి 20 మంది పెళ్లి మాట ఎత్తకపోతే 2019లో 26 మంది పెళ్లి ప్రస్తావన తేవడం లేదు. అమ్మాయిల్లో 2011లో నూటికి 11 మంది పెళ్లి చేసుకోకపోతే 2019లో నూటికి 20 మంది పెళ్లి పట్ల నిరాసక్తిగా ఉన్నారు. సగటున చూస్తే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి నూటికి 23 మంది 29 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్ల్‌లోనో ఒక వీధిలోనో 100 మంది యువతీ యువకులు ఉంటే వారిలో 23 మంది అవివాహితులుగా కనిపిస్తూ ఉంటారు. ఆ ఇళ్ల తల్లిదండ్రులు, ఆ అవివాహితులు నిత్యం ‘పెళ్లెప్పుడు’ అనే మాటను ఎదుర్కొనాల్సిందే. కశ్మీర్ మొదటి స్థానంలో దేశం మొత్తం గమనిస్తే పెళ్లి కాని యువతీ యువకులు అత్యధికంగా ఉన్న ప్రాంతం జమ్ము అండ్ కశ్మీర్. దీని తర్వాత ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబు రాష్ట్రాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ దాదాపు 30 ఏళ్ల వరకూ పెళ్లిళ్లు జాప్యం అవుతున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో ఈ శాతం తక్కువగా ఉంది. అంటే కొంచెం ఆలస్యమైనా చేసుకుంటూ ఉన్నారు. అయితే మొత్తంగా దేశంలో చూసినప్పుడు 25 నుంచి 29 మధ్య చేసుకునేవారి సంఖ్య గతంలో బాగున్నా ఇప్పుడు బాగా తగ్గింది. అంటే అమ్మాయిలలో 50 శాతం మంది, అబ్బాయిల్లో 80 శాతం మంది 25 దాటి 29 సమీపిస్తున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు. నిపుణులు కారణాలు శోధించి పరిష్కారాలు వెతక్క తప్పని స్థితి ఇది. అవసరం ఏముంది అనేవారే ఎక్కువ పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలే కాదు, అమ్మాయిల మైండ్ సెట్లోనూ మార్పులు వచ్చాయి. నిన్నటి తరం ‘డిగ్రీ చేస్తే చాలు’ అనుకునేవారు. ఇప్పుడు అలా కాదు పై చదువులకు విదేశాలకు వెళుతున్నారు. ‘ముందు సెటిల్ అవాలి, తర్వాతనే పెళ్లి’ అంటున్నారు. గతంలో పిల్లలకు వయసు వచ్చింది త్వరగా పెళ్లి చేయాలని అనుకునేవారు పేరెంట్స్. పిల్లలు కూడా పెద్దల నిర్ణయానికి తలవంచేవారు. ఇప్పుడు పెళ్లి నిర్ణయాన్ని పిల్లలకే వదిలేస్తున్నారు పెద్దలు. దీంతో తమకు సెట్ అయ్యే మ్యాచ్ దొరకాలని పిల్లలు చూస్తున్నారు. దాదాపు ఇప్పుడంతా మప్పై ఏళ్ల వరకు పెళ్లి ఆలోచనలు చేయడంలేదు. పెళ్లి అంటే ‘ఇప్పుడే అవసరం ఏముంది’ అంటున్నారు. అంత తొందర పడి మరొకరి మాట వినాలనేం ఉంది అనుకుంటున్నారు. ఈ ధోరణి ముందు ముందు ఇంకా పెరుగుతుంది. అంతేకాదు, డిస్టర్బ్డ్గా ఉన్న జంటలను చూసి, అంత కష్టం ఎందుకులే అనుకుంటున్నవారిని ఎక్కువ చూస్తున్నాం. ఇలా చాలా కారణాల వల్ల పెళ్లి వయసుకు పెద్ద గ్యాప్ వచ్చేసింది. – ప్రొ. పి.జ్యోతి రాజా, సైకాలజిస్ట్, లైఫ్‌స్కిల్స్ ట్రెయినర్ -
ఇక్కడ పెళ్లి.. అక్కడికి వెళ్లాక లొల్లి
సాక్షి, హైదరాబాద్: చట్టాలను ఎంత కఠినతరం చేసినా... ఎన్ఆర్ఐ వివాహాలు కొందరు అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వధువుకు ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటవుతోంది. పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లగానే వరుడు ముఖం చాటేయడంతో అమ్మాయి జీవితం ప్రశ్నార్ధకం అవుతోంది. భర్త విదేశాల్లో, భార్య ఇండియాలో పుట్టింట్లో ఉండటంతో కేసులు ఎటూ తేలడంలేదు. ఇటు తల్లిదండ్రులు, అటు అమ్మాయిలు ఏళ్ల కొద్ది వేచి చూడాల్సొస్తుంది. ఇలాంటి ఎన్ఆర్ఐ వివాహ కేసులను త్వరిగతిన కొలిక్కి తెచ్చేందుకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఎన్ఆర్ఐ సెల్ కృషి చేస్తోంది. అందులో భాగంగా పోలీసులకు ఇటీవల ప్రత్యేకశిక్షణ ఇచ్చిన మహిళా భద్రతా విభాగం కేసుల పరిష్కారంపై పలు విషయాలను వెల్లడించింది. రెండేళ్లలో 222 ఫిర్యాదులు... రాష్ట్ర మహిళా భద్రతా విభాగంలో ఎన్ఆర్ఐ వివాహాల కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ సెల్‌ను జూలై 2019లో పోలీస్ శాఖ ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 222 ఫిర్యాదులపై కేసులు నమోదుచేసినట్టు మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. అయితే వీటిలో 38 కేసుల్లో భార్యాభర్తలు కాంప్రమైజ్ కాగా, 174 కేసులు పెండింగ్ దశలో ఉన్నాయన్నారు. 35 కేసులు దర్యాçప్తు దశలో ఉండగా, మిగిలిన 139 కేసులు పెండింగ్ ట్రయల్స్ దశలో ఉన్నాయని స్వాతిలక్రా తెలిపారు. 8 కేసుల్లో సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు చెప్పారు. మరో 23 మందిపై లుక్ ఔట్ నోటీసులు జారీచేసి ఎన్ఆర్ఐ భర్తను కోర్టుకు హాజరయ్యేలా చేశామని తెలిపారు. పోలీసులకు ప్రత్యేక శిక్షణ... ఎన్ఆర్ఐ కేసుల్లో త్వరితగతిన న్యాయం అందించడం కోసం విదేశాల్లోని స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు స్వాతిలక్రా తెలిపారు. బాధితులు తమకు కేసులను పర్యవేక్షణ చేసుకునేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులు, నారీ గ్లోబల్ ఫౌండేషన్ అమెరికా లాంటి స్వచ్ఛంద సంస్థలతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లోని భారత రాయభార కార్యాలయాల్లో ఎలా ఫిర్యాదు చేయాలి, కేంద్ర విదేశాంగ శాఖతో పాటు మహిళా కమిషన్ల నుంచి సహాయం ఎలా పొందాలన్న అంశాలపై ఇన్వెస్టిగేషన్ అధికారుల ద్వారా బాధితులకు సూచనలు, సలహాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఎన్ఆర్ఐ వివాహాలపై వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, కేసుల నమోదు, దర్యాప్తు వ్యవహారాల్లో అధికారులకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు స్వాతిలక్రా వెల్లడించారు. కేసు నమోదు సమయంలో ఎలాంటి అంశాలను బాధితుల నుంచి తీసుకోవాలి, ఆ వివరాలను ఎలా పొందుపర్చాలన్న విషయాల్లోనూ దర్యాప్తు అధికారులకు తర్ఫీదునిస్తున్నామన్నారు. ఇక్కడ ఫిర్యాదు చేయొచ్చు... విదేశాల్లో భర్తలు మోసం చేసిన సందర్భాల్లో ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా కింది సంస్థలకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం సూచిస్తోంది. - కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటు, జాతీయ మహిళా కమిషన్‌కు గృహ హింసపై ఫిర్యాదు చేయవచ్చు. - విచారణకు రాకపోతే విదేశాల్లోని భారత రాయభార కార్యాలయానికి కేసు వివరాలతో ఫిర్యాదు చేయవచ్చు. - విదేశాల్లో భర్త పనిచేస్తున్న కంపెనీకి కేసు వివరాలను పంపించి విచారణకు హాజరయ్యేలా చేయొచ్చు. - సహాయం కోసం విదేశాల్లోని స్వచ్ఛంద సంస్థలను సంప్రదించవచ్చు. -
వధువును హతమార్చిన వరుడు
సాక్షి, చెన్నై: వివాహాన్ని నిలిపేందుకు వధువును హతమార్చిన వరుడిని, అతని స్నేహితున్ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వివరాలు.. వాణియం పాళయం గ్రామానికి చెందిన కోదండపాణి కుమార్తె రమ్య (23). ఈమెకు నల్లూరు పాళయానికి చెందిన విజయకుమార్ (25)తో ఈనెల 20న నడువదిగై వీరట్టానేశ్వరర్ ఆలయంలో వివాహం జరుగనుంది. ఆదివారం విజయకుమార్, రమ్యను బయటికి తీసుకువెళ్లాడు. తర్వాత ఇరువురూ ఇంటికి చేరుకోలేదు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మాయమైన విజయకుమార్, రమ్య కోసం గాలించారు. ఈ క్రమంలో తిరునావలూరు సమీపంలోని ఇరుందై గ్రామం వ్యవసాయ బావిలో రమ్య శవంగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి విజయకుమార్, అతని స్నేహితుడు పాండియన్‌ను సోమవారం అరెస్టు చేసి విచారించారు. విచారణలో విజయకుమార్ తనకు రమ్యకు మరో నాలుగు రోజుల్లో వివాహం జరుగనుందని, తనకు రమ్య నచ్చలేదని, ఎలాగైనా ఈ వివాహాన్ని నిలిపేందుకు నిర్ణయించానన్నారు. అయితే సాధ్యం కాలేదని, దీంతో బయటికి వెళ్దామని తెలిపి రమ్యను మోటార్ సైకిల్లో ఎక్కించుకుని తీసుకువెళ్లానన్నాడు. తనతోపాటు మరో బైకుపై పాండియన్‌ను తీసుకువెళ్లినట్లు చెప్పాడు. అక్కడ రమ్యతో తనకు వివాహం నచ్చలేదని ఎలాగైనా నిలిపివేయమని రమ్యను కోరగా ఆమె నిరాకరించినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహించిన తాను స్నేహితుని సాయంతో ఆమె గొంతు నులిమి చంపి పక్కన ఉన్న బావిలో పాడేశామని ఒప్పుకున్నారు. -
ఆ ఎంపీ కుమారుడితో పెళ్లి జరిపించాలి: యువతి
సాక్షి, చెన్నై: ఎంపీ అన్వర్ రాజా కుమారుడితో పెళ్లి జరిపించాలని ఓ యువతి ఆందోళన చేస్తోంది. దీని కోసం గవర్నర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్టు రొబినా చెన్నైలో శనివారం పేర్కొన్నారు. చెన్నై సైదాపేటకు చెందిన ప్రపల్వా సుభాష్ అనే రొబినా పారిశ్రామిక వేత్త. ఈమెకు అన్వర్ రాజా ఎంపీ కుమారుడు నాజర్ అలీకి పరిచయం ఉన్నట్టు తెలిసిందే. ఇద్దరూ వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుని ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. ఈ క్రమంలో నాజర్ అలీకి మరో యువతితో గత నెల వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. విషయం తెలుసుకున్న రొబినా ఆ వివాహాన్ని నిలుపుదల చేయమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రొబినా శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. నాజర్ అలీ తనను మోసం చేసి తనతో గడిపాడు. అతని తండ్రి అన్వర్ రాజా బెదిరింపులు వలన తనను వివాహం చేసుకోవడానికి తిరస్కరించాడని తెలిపారు. తనకు న్యాయం జరగాలని గవర్నర్, ముఖ్యమంత్రిని కలిసి పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తనకు, నాజర్ అలీకి ఇస్లాం మత సంప్రదాయంలో వివాహం జరిపించాలని, ఆధార పూర్వకంగా తనను భార్యను చేసుకున్న తరువాత ఒక రోజు అతనితో జీవించి మరుసటి దినమే విడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
ఇప్పట్లో ఆ ఆలోచన లేదు..
రాంగోపాల్‌పేట్: తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనే ఆలోచన లేదని సినీ నటుడు నిఖిల్ అన్నాడు. పార్క్‌లేన్‌లో ఏర్పాటు చేసిన ‘జçహాపనా మెన్స్‌వేర్’ సెంటర్‌ను ఆదివారం అతడు ప్రారంభించాడు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘నా పెళ్లి విషయంలో ఇప్పటికే కొంత వివాదం వచ్చిందం’టూనే.. ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాలపైనేనన్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నానని, ఇందులో ఒకటి మాస్ కళాశాల వాతావరణంలో సాగుతుందన్నాడు. మెన్స్ కోసంమే ప్రత్యేకంగా జహాపనా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నాని పేర్కొన్నాడు. తన తల్లితో కలిసి షాపింగ్ వెళ్లినపుడు ఆడవారి చీరలు ఎన్నో డిజైన్లు, రంగులు చూసి ఆశ్చర్యపోతుంటానని, ఇప్పుడు జహపనా మగవారికీ ఆ లోటును తీర్చిందన్నాడు. సంస్థ డైరెక్టర్లు ఇషాక్ బుకారి, ఇబ్రహీం బుకారీ మాట్లాడుతూ వెడ్డింగ్, పార్టీవేర్ కోసం అద్భుతమైన డిజైన్లు ప్రత్యేకంగా రూపొందించి అందిస్తున్నట్టు చెప్పారు. -
ప్రేయసిని.. ఆమె మాజీ భర్తను తుపాకీతో కాల్చి!
దేశ రాజధాని ఢిల్లీ సిరి కోట సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో మరో ట్విస్ట్ తెలిసింది. నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సీయూఐ)లో శనివారం రాత్రి ఇద్దరు ప్రేమికులపై ఎవరో దుండగుడు కాల్పులు జరిపాడని ప్రచారం జరిగింది. వాస్తవానికి అక్కడ జరిగింది వేరే. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్‌సీయూఐ విద్యార్థి మూడేళ్ల కిందట రాజేంద్ర అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరి మధ్య గొడవలు రావడంతో కొన్ని నెలల కిందట విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ యువతి తన ఫొటోను ఓ వివాహ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. కాజల్ జతిన్ సర్కార్ అనే వ్యక్తి ఎన్‌సీయూఐ విద్యార్థిని సమాచారం తెలుసుకుని ఆమెను సంప్రదించాడు. గతంలో పెళ్లి విషయాలను జతిన్‌కు చెప్పింది. కొంతకాలం నుంచి ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సముఖంగా ఉంది. సోషల్‌మీడియాతో ఈ వివరాలు తెలుసుకున్న యువతి మాజీ భర్త రాజేంద్రన్ క్యాంపస్ వద్దకు వచ్చి గొడవపడ్డాడు. దీంతో యువతి తన కాబోయే భర్త జతిన్‌కు ఫోన్ చేసింది. అక్కడికి వచ్చిన జతిన్, రాజేంద్రన్‌కు ఎంత నచ్చజెప్పినా వినకుండా గొడవ పడుతూనే ఉన్నాడు. ఓపిక నశించిన జతిన్ రాజేంద్రన్‌పై తనవెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అదే ఆవేశంలో లవర్(కాబోయే భార్య) పై కాల్పులు జరిపి.. చివరికి తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఆ ముగ్గురు ఎయిమ్స్ ట్రౌమా సెంటర్లో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుమారుడు జతిన్ సర్కార్. తండ్రి రివాల్వర్‌తో కాల్పులు జరిపిన జతిన్‌పై కేసు నమోదైంది. -
'ఇక పెళ్లయ్యే ఛాన్స్ లేదు'
న్యూఢిల్లీ: తాను పెళ్లి చేసుకోలేదని, తన జీవితంలో వివాహానికి చోటు లేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. లోక్ సభ స్పీకర సుమిత్రా మహాజన్ పొరపాటుగా శ్రీమతి' అని సంబోధించడంతో ఆమె ఈ విధంగా స్పందించారు. సభలో ప్రకటన చేయడాలని కోరుతూ ఉమాభారతిని శ్రీమతిగా పేర్కొన్నారు. దీనిపై ఉమాభారతి వెంటనే స్పందించారు. 'నేను ఇప్పటికి వరకు పెళ్లి చేసుకోలేదు. భవిష్యత్ లో కూడా ఆ అవకాశం లేదు. అక్కడ వేకెన్సీ బోర్డు లేదని' ఉమాభారతి అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. స్పీకర్ పొరపాటుకు క్షమాపణ చెప్పి తమ మాటను సవరించుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన 56 ఏళ్ల ఉమాభారతిని ' సాధ్వి'గా పేర్కొంటారు. -
నేతల పెళ్లిళ్ల గోల... ఆపరేల?
సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలో అగ్రనేతల నడుమ మాటల తూటాలు పేలాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు శిఖరస్థాయికి చేరాయి. విమర్శలు, ప్రతివిమర్శలు పతాక శీర్షికలకెక్కాయి. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసేందుకు సైతం నాయకులు వెనుకాడలేదు. అగ్రనాయకులు సైతం ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయడం విస్తుగెల్పుతోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతల వైవాహిక జీవితాలు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వైవాహిక జీవితంపై విమర్శలు ఎక్కువగా వినిపించాయి. కట్టుకున్న భార్యనే ఆదరించని మోడీ దేశానికి ఏం చేస్తారని ప్రత్యర్థులు ఘాటుగా ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలపై మోడీ ఎక్కడా స్పందించలేదు. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతా రాయ్ ప్రేమాయణం కూడా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. డిగ్గీ రాజా-అమృత ప్రేమ వ్యవహారాన్ని ప్రత్యర్థి పార్టీలు అస్త్రంగా మలుచుకున్నాయి. దీంతో దిగ్విజయ్ ఎదురుదాడికి దిగారు. మోడీలా 30 ఏళ్లు పెళ్లి సంబంధాన్ని తాను దాచలేదంటూ బదులిచ్చారు. కాగా చిరకాల ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌పై బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యక్తిగత విమర్శలు ఎక్కుపెట్టారు. తన రెండో భార్య కోసమే ములాయంసింగ్ యాదవ్ ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ములాయం కుటుంబంలో వివాదం నడుస్తోందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో తన రెండో భార్యను ఆనందపరిచేందుకు, తద్వారా వారి కుమారుడు ప్రతీక్ యాదవ్‌కు మార్గం సుగమం చేసేందుకు ములాయం అజంగఢ్ స్థానం నుంచి పోటీకి దిగారని మాయావతి తీవ్ర ఆరోపణ చేశారు. జాతీయ స్థాయి నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. వాహిక జీవితాలపై ప్రజావేదికల మీద చర్చ పెట్టడం సమంజసం కాదన్నది ప్రజల అభిప్రాయం. ఇంక ఎందరి నాయకుల వైవాహిక జీవితాలు వీధికెక్కుతాయోనని భయపడుతున్నారు.