రాంగోపాల్‌పేట్: తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనే ఆలోచన లేదని సినీ నటుడు నిఖిల్ అన్నాడు. పార్క్‌లేన్‌లో ఏర్పాటు చేసిన ‘జçహాపనా మెన్స్‌వేర్’ సెంటర్‌ను ఆదివారం అతడు ప్రారంభించాడు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘నా పెళ్లి విషయంలో ఇప్పటికే కొంత వివాదం వచ్చిందం’టూనే.. ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాలపైనేనన్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నానని, ఇందులో ఒకటి మాస్ కళాశాల వాతావరణంలో సాగుతుందన్నాడు.
మెన్స్ కోసంమే ప్రత్యేకంగా జహాపనా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నాని పేర్కొన్నాడు. తన తల్లితో కలిసి షాపింగ్ వెళ్లినపుడు ఆడవారి చీరలు ఎన్నో డిజైన్లు, రంగులు చూసి ఆశ్చర్యపోతుంటానని, ఇప్పుడు జహపనా మగవారికీ ఆ లోటును తీర్చిందన్నాడు. సంస్థ డైరెక్టర్లు ఇషాక్ బుకారి, ఇబ్రహీం బుకారీ మాట్లాడుతూ వెడ్డింగ్, పార్టీవేర్ కోసం అద్భుతమైన డిజైన్లు ప్రత్యేకంగా రూపొందించి అందిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment