![Women Fight For Marry With AIADMK MP Anwar Raja son - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/21/young-girl2.jpg.webp?itok=xueXuidS)
సాక్షి, చెన్నై: ఎంపీ అన్వర్ రాజా కుమారుడితో పెళ్లి జరిపించాలని ఓ యువతి ఆందోళన చేస్తోంది. దీని కోసం గవర్నర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్టు రొబినా చెన్నైలో శనివారం పేర్కొన్నారు. చెన్నై సైదాపేటకు చెందిన ప్రపల్వా సుభాష్ అనే రొబినా పారిశ్రామిక వేత్త. ఈమెకు అన్వర్ రాజా ఎంపీ కుమారుడు నాజర్ అలీకి పరిచయం ఉన్నట్టు తెలిసిందే. ఇద్దరూ వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుని ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. ఈ క్రమంలో నాజర్ అలీకి మరో యువతితో గత నెల వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. విషయం తెలుసుకున్న రొబినా ఆ వివాహాన్ని నిలుపుదల చేయమని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో రొబినా శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. నాజర్ అలీ తనను మోసం చేసి తనతో గడిపాడు. అతని తండ్రి అన్వర్ రాజా బెదిరింపులు వలన తనను వివాహం చేసుకోవడానికి తిరస్కరించాడని తెలిపారు. తనకు న్యాయం జరగాలని గవర్నర్, ముఖ్యమంత్రిని కలిసి పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తనకు, నాజర్ అలీకి ఇస్లాం మత సంప్రదాయంలో వివాహం జరిపించాలని, ఆధార పూర్వకంగా తనను భార్యను చేసుకున్న తరువాత ఒక రోజు అతనితో జీవించి మరుసటి దినమే విడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment