లక్నో: పెళ్లి ఇంట దారుణం చోటు చేసుకుంది. పెళ్లి విందు విషయంలో మొదలైన గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో రక్తపాతం జరిగింది. ఈ దారుణ ఘటన సోమవారం ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఫరూఖాబాద్‌లోని అట్సైని పహర్‌పూర్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు మనోజ్ కుమార్‌కు గోవింద్‌పూర్ అదుల్లాపూర్‌కు చెందిన యువతికి సోమవారం సాయంత్రం వివాహం జరిగింది. పెళ్లి అనంతరం రాత్రి బరాత్ కార్యక్రమం నిర్వహించారు. అప్పటికే చిత్తుగా తాగి ఉన్న వరుడు అతడి స్నేహితులు పెళ్లి భోజనాలు సరిగా లేవంటూ వధువు తరపు బంధువులతో గొడవకు దిగారు. ఓమారు కాల్పులు కూడా జరపగా పెళ్లి కూతురి బంధువు తృటిలో తప్పించుకున్నారు. (కొద్ది నిమిషాల్లో పెళ్లి.. మేకప్‌తో ఊరేగుతుండగా..)
వారికి నీళ్లు ఇవ్వడానికి వెళ్లిన వధువు సోదరుడి(9)ని కూడా కొట్టి బలవంతంగా ఎస్‌యూవీ కారులో తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎదుట ఉన్న మనుషులను పట్టించుకోకుండా వారిపైనే కారుపోనివ్వడంతో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని లోహియా జిల్లా ఆసుపత్రికి తరలించారు. "తమ్ముడిని తీసుకుని తిరిగి వచ్చేయమంటూ పెళ్లి కొడుకు మనోజ్ కుమార్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాభం లేకపోయింది. తర్వాతి రోజు ఉదయం మూడు గంటలకు నా తమ్ముడి శవాన్ని పంపించారు. అతని గొంతు పిసికి చంపినట్లుగా మెడపై ఆధారాలు ఉండటమే కాక ముఖం గుర్తు పట్టరాకుండా ఉందని" అని వధువు సోదరుడు పునీత్ కన్నీరుమున్నీరవుతున్నాడు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. (కాళ్ల పారాణి ఆరకముందే...)
Comments
Please login to add a commentAdd a comment