
తల్లిదండ్రులు పిల్లల అభిరుచి ఏంటో తెలుసకోవడమే కాకుండా వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. లేదంటే వారు చెడ్డపనుల వైపు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రతీది అందుబాటులో ఉండటంతో చిన్నారులు పెడదోవ పట్టే అవాకాశాలే పొంచి ఉన్నాయి. ఇక్కడొక విద్యార్థి కూడా అలానే చెడు మార్గంలో పయనించి స్నేహితుడినే హతమార్చి జైలు పాలయ్యాడు.
వివరాల్లోకెళ్తే....పోలీసులు కథనం ప్రకారం...ఢిల్లీలోని ఒక 16 ఏళ్ల మైనర్ 13 ఏళ్ల తన స్నేహితుడి గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఢిల్లీలోని మసూరి నివాసి. ఏడవ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు సదరు బాధితుడుని తన మైనర్ స్నేహితుడే ఇంటికి వచ్చి తీసుకువెళ్లినట్లు బాధితుడి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో పోలీసులు సదరు మైనర్ ఇంటిని విచారించగా....అతను ఆ సమయానికి ఇంట్లో లేడు. పైగా అతని తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలేమి తెలియవు.
ఐతే పోలీసులు సదరు మైనర్‌ని ఒక టీ దుకాణం వద్ద గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ఆ మైనర్ చెప్పిన విషాయలు విని ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. విచారణలో....సదరు మైనర్‌కి చదవుకోవడం ఇష్టం లేదని తన తల్లిదండ్రుల పోరు భరించలేక చదువుతున్నట్లు చెప్పాడు. ఈ చదువు నుంచి ఎలాగైన తప్పించుకుని ఏదైన శరణాలయానికి వెళ్లిపోవాలని గత ఐదేళ్లుగా ట్రై చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
కొన్ని సినిమాలు చూసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు చెప్పాడు. తన స్నేహితుడిని సరదాగా కారులో వెళ్దామని పిలిచి ఒక గాజు ముక్కతో గొంతు కోసి హతమార్చినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు మరోక స్నేహితుడిని చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులు తనను వెతుక్కుంటూ రాకపోతే తానే లొంగిపోదామని అనుకున్నట్లు వెల్లడించాడని పోలీసులు తెలిపారు.
(చదవండి: సోదరుడి లైంగిక వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి)
Comments
Please login to add a commentAdd a comment