లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు సహా 14 మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా టెనిపై హత్య కేసు నమోదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: లఖీమ్‌పూర్ ఖేరీలో ఉద్రిక్తత: ప్రియంక గాంధీని అడ్డుకున్న పోలీసులు
ఆదివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ అయిన అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు బన్బీర్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. మంత్రి అజయ్ మిశ్రా వెంట ఆయన కొడుకు ఆశిష్ సైతం కాన్వాయ్‌లో ఉన్నారు. మంత్రులు పాల్గొనబోయే కార్యక్రమంలో నిరసన తెలిపేందుకు భారతీయ కిసాన్ యూనియన్‌కి చెందిన పలువురు రైతులు నల్ల జెండాలతో బయల్దేరారు.
మార్గమధ్యంలో టికోనియా-బన్బీర్‌పూర్ రోడ్డులో కాన్వాయ్ వెంట నినాదాలు ఇచ్చారు. అదే సమయంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అక్కడి రైతుల మీదుగా దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మంత్రి కుమారుడే వాహనాన్ని నడుపుతున్నాడని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment