విలేకరులతో మాట్లాడుతున్న ఎస్సై వేణు, చిత్రంలో అరెస్ట్ అయిన వీఆర్వోలు
సంగం: హత్యాయత్నం కేసులో ఇద్దరు వీఆర్వోలపై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై వేణు తెలిపారు. ఆయన వెల్లడించిన సమాచారం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన సుష్మ, సంగం మండలం తరుణవాయి పంచాయతీ మజరా ఉడ్‌హౌస్‌పేటకు చెందిన తిరుపతిరావు ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. సుష్మ ప్రస్తుతం జెండాదిబ్బలో వీఆర్‌ఓగా పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్య నాలుగు నెలల క్రితం విభేదాలు రావడంతో భర్త తిరుపతిరావు తనను వేధిస్తున్నట్లు సుష్మ బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతడిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తలు ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారరు.
ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీ సాయంత్రం తిరుపతిరావు తన స్నేహితుడి మురళీతో కలిసి బుచ్చిరెడ్డిపాళెంకు మోటార్‌బైక్‌లో వెళ్లి తిరిగి ఉడ్‌హౌస్‌పేటకు వెళ్తుండగా దువ్వూరు వద్ద తరుణవాయి వీఆర్‌ఓ రామకృష్ణారెడ్డితో కలిసి సుష్మ కారులో వెళ్తుండడాన్ని గమనించాడు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న తిరుపతిరావు కారును వెంబడిండించి ఆపి ఎక్కడ నుంచి వస్తున్నావని తన భార్య సుష్మను ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన సుష్మ రామకృష్ణారెడ్డిని కారుతో తిరుపతిరావు ఢీకొట్టమని చెప్పడంతో అతను తన కారుతో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో గాయపడిన తిరుపతిరావు సంగం పోలీసులకు ఇద్దరు తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వీఆర్‌ఓలిద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment