కళ్లు చెదిరే సెట్టింగ్‌లతో... ఆర్ట్ డైరెక్టర్
అప్‌కమింగ్ కెరీర్: ‘ఒక్కడు’ సినిమాలో చార్మినార్‌ను చూసి ఆశ్చర్యపోనివారు ఉండరు. పాతబస్తీలోని నిజమైన చార్మినార్‌ను తలపించేలా దాన్ని కృత్రిమంగా నిర్మించారు. ఆ క్రెడిటంతా ఆర్ట్ డెరైక్టర్‌కే దక్కుతుంది. అలాగే మగధీర, యమదొంగ వంటి సినిమాల్లోని సెట్టింగ్‌లు ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లాయి, తమ సృజనాత్మకతతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఆర్ట్ డెరైక్టర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది.
చేతినిండా పని: సినిమాలు, టీవీ కార్యక్రమాలు, యాడ్ ఫిల్మ్‌ల చిత్రీకరణకు, రంగ స్థలంపై నాటకాలకు సందర్భానికి తగిన సెట్టింగ్‌లు వేయడం తప్పనిసరి. వీటివల్లే దృశ్యానికి నిండుతనం వస్తుంది. వీక్షకులను మెప్పిస్తుం ది. సినిమాల చిత్రీకరణతోపాటు టీవీ ఛానళ్ల సంఖ్య పెరగడంతో ఆర్ట్ డెరైక్టర్లకు చేతినిండా పని దొరుకుతోంది. స్డూడియోల్లో వీరికి అవకాశాలు లభిస్తున్నాయి.
నైపుణ్యాలు పెంచుకోవాలి: ఆర్ట్ డెరైక్టర్‌గా వృత్తిలో పైకి ఎదగాలంటే ప్రధానంగా శ్రమకు వెనుకాడని లక్షణం ఉండాలి. విసృ్తతంగా చదివే అలవాటుతో ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. పరిశీలనా శక్తి అవసరం. ఎప్పటికప్పుడు టైమ్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, ప్లానింగ్, నెట్‌వర్కింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలు ఉన్నప్పటికీ మంచి పనితీరుతో గుర్తింపును తెచ్చుకుంటే అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. ఆర్ట్ డెరైక్షన్ కోర్సు పూర్తిచేసిన తర్వాత మొదట సీనియర్ డెరైక్టర్ వద్ద సహాయకుడిగా పనిచేసి వృత్తిలో అనుభవం సంపాదించాలి. తర్వాత సొంతంగా ప్రాజెక్ట్‌లు చేపట్టవచ్చు.
అర్హతలు: ఫైన్ ఆర్ట్స్‌లో భాగంగా ఆర్ట్ డెరైక్షన్ కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీయెట్ పూర్తయిన తర్వాత ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయొచ్చు. ఇంటీరియర్ డిజైన్, ఆర్కిటెక్చర్ విభాగాల్లోనూ నైపుణ్యం, తగిన అనుభవం సంపాదించినవారు ఆర్ట్ డెరైక్షన్‌లోకి ప్రవేశించొచ్చు.
వేతనాలు: అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌కు ప్రారంభంలో నెలకు రూ.7 వేల వేతనం ఉంటుంది. తర్వాత హోదాను బట్టి పెరుగుతుంది. కనీసం మూడేళ్లపాటు పనిచేసి, నైపుణ్యాలు పెంచుకుంటే నెలకు రూ.30 వేలకు పైగానే సంపాదించుకోవచ్చు. సొంత ప్రాజెక్టులతో రూ.లక్షల్లో ఆర్జించవచ్చు.
ఆర్ట్ డెరైక్షన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణె
వెబ్‌సైట్: www.ftiindia.com
ఆసియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టీవీ
వెబ్‌సైట్: www.aaft.com
బనారస్ హిందూ యూనివర్సిటీ; వెబ్‌సైట్: www.bhu.ac.in
మహారాజా శాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా
వెబ్‌సైట్: www.msubaroda.ac.in
సృజనాత్మకత ఉండాలి!
శ్రీసినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలతోపాటు అడ్వర్‌టైజ్‌మెంట్ చిత్రీకరణకు సెట్స్ నిర్మాణం తప్పనిసరి అవుతోంది. ఈ నేప థ్యంలో చిత్ర రంగంలో ఆర్ట్ డెరైక్టర్స్‌కు మంచి అవకాశా లున్నాయి. ఒక్కో సెట్‌కు దీర్ఘకాలం పాటు కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఓర్పు, సహనం, కష్టపడే తత్వం ఉండాలి. ఉదాహరణకు ‘ఒక్కడు’ సినిమా సెట్ వేయడానికి 300 మంది మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది. దానికి ప్రతిఫలంగానే సెట్‌కు మంచి గుర్తింపు లభించింది. ఈ రంగంలో డిమాండ్‌ను బట్టి వేతనాలు/పారితోషకాలు లభిస్తాయి. పరిశ్రమలో రూ. 30 వేలు తీసుకునేవారితోపాటు రూ. 40లక్షలు పారితోషకం పొందేవారూ ఉన్నారు.్ణ
- కె. అశోక్ కుమార్, ప్రముఖ సినీ ఆర్ట్ డెరైక్టర్ .