![Police Chase Orchestra Troupe Dancer Suspicious Death In Falaknuma - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/9/dancer.jpg.webp?itok=gYiiMenm)
సాక్షి, హైదరాబాద్: ఫలక్‌నుమా ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. క్యాబ్ డ్రైవర్ మహ్మద్ అప్సర్‌తోపాటు రేస్ కోర్స్ బుకీ నహీద్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం ఫాతిమా భర్త మృతిచెందడంతో క్యాబ్ డ్రైవర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు విచారణలో తేలింది, ఇటీవల పెళ్లి చేసుకోవాలంటూ డ్రైవర్‌పై ఫాతిమా ఒత్తిడి తీసుకొచ్చింది. డ్యాన్స్‌లు ఆపేస్తే పెళ్లి చేసుకుంటానని డ్రైవర్ ఫాతిమాకు షరతు పెట్టాడు.
చదవండి: బీరు బాటిల్, అర్థనగ్నంగా.. మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి
కాగా దీంతో వివాహ విషయంలో క్యాబ్ డ్రైవర్, ఫాతిమాకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఫాతిమాకు మద్యం తాగించి క్యాబ్ డ్రైవర్ ఉరి వేసి హత్య చేశాడు. ముస్తఫానగర్‌కు చెందిన 30 ఏళ్ల షరీన్ ఫాతిమాకు ఏడుగురు సంతానం. ఫాతిమా భర్త నదీమ్ ఏడాది కిందట మృతి చెందాడు. ఏడుగురు సంతానాన్ని ఆర్కెస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా పనిచేస్తూ తల్లి ఫాతిమానే పోషించుకునేది. ప్రస్తుతం ఫాతిమా మరణంతో పిల్లలు అనాథలుగా మారారు.
చదవండి: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి కిరాతకంగా...
Comments
Please login to add a commentAdd a comment