Orchestral music
-
వైరల్ జయహే!
గ్రామీ అవార్డ్ విజేత రికీ కేజ్ లండన్‌లోని ప్రసిద్ధ అబేరోడ్ స్టూడియోస్‌లో మన జాతీయ గీతానికి సంబంధించి 100 మందితో లార్జెస్ట్ ఆర్కెస్ట్రాను నిర్వహించి రికార్డ్ సృష్టించాడు. ఈ వీడియోకు నెటిజనులు ఫిదా అవుతున్నారు. ‘చారిత్రాత్మకమైన 100 పీస్ బ్రిటిష్ ఆర్కెస్ట్రాను నిర్వహించినందుకు మ్యూజిక్ కంపోజర్‌గా గర్విస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఈ వీడియోను ఎంతోమందికి షేర్ చేశాను. యూజ్ ఇట్, షేర్ ఇట్, వాచ్ ఇట్... బట్ విత్ రెస్పెక్ట్’ అంటూ ట్విట్టర్లో రాశాడు రికీ కేజ్. ‘వండర్ఫుల్’ అంటూ ఈ వీడియోను రీషేర్ చేశారు ప్రధాని మోదీ. -
వైరల్ వీడియో: సంగీతం అంటే ఈ పిల్లి చెవి కోసుకుంటుంది
-
వివాహేతర సంబంధం: పెళ్లి చేసుకోవాలని డ్యాన్సర్ బలవంతం చేయడంతో
సాక్షి, హైదరాబాద్: ఫలక్‌నుమా ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. క్యాబ్ డ్రైవర్ మహ్మద్ అప్సర్‌తోపాటు రేస్ కోర్స్ బుకీ నహీద్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం ఫాతిమా భర్త మృతిచెందడంతో క్యాబ్ డ్రైవర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు విచారణలో తేలింది, ఇటీవల పెళ్లి చేసుకోవాలంటూ డ్రైవర్‌పై ఫాతిమా ఒత్తిడి తీసుకొచ్చింది. డ్యాన్స్‌లు ఆపేస్తే పెళ్లి చేసుకుంటానని డ్రైవర్ ఫాతిమాకు షరతు పెట్టాడు. చదవండి: బీరు బాటిల్, అర్థనగ్నంగా.. మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి కాగా దీంతో వివాహ విషయంలో క్యాబ్ డ్రైవర్, ఫాతిమాకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఫాతిమాకు మద్యం తాగించి క్యాబ్ డ్రైవర్ ఉరి వేసి హత్య చేశాడు. ముస్తఫానగర్‌కు చెందిన 30 ఏళ్ల షరీన్ ఫాతిమాకు ఏడుగురు సంతానం. ఫాతిమా భర్త నదీమ్ ఏడాది కిందట మృతి చెందాడు. ఏడుగురు సంతానాన్ని ఆర్కెస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా పనిచేస్తూ తల్లి ఫాతిమానే పోషించుకునేది. ప్రస్తుతం ఫాతిమా మరణంతో పిల్లలు అనాథలుగా మారారు. చదవండి: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి కిరాతకంగా... -
అలోన్ ఎట్ హోమ్.. బట్ టుగెదర్ ఇన్ ఆన్లైన్
-
వైరల్: కిచెన్‌లోని వస్తువులతోనే సంగీతం
పారిస్: కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో ఫ్రాన్స్ ప్రభుత్వం దేశంలో లాక్డౌన్ విధించింది. దీంతో ఎప్పుడూ తమ సంగీతంతో ప్రేక్షకులను అలరించే నేషనల్ ఆర్కెస్ట్రా ఆఫ్ ఫ్రెంచ్ సభ్యులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని రోజులు మాములుగానే గడిపినా.. మళ్లీ తమ సంగీతంతో ప్రజలకు ఓ సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. దాదాపు 50 మంది ఆర్కెస్ట్రా సభ్యులు ఎవరి ఇంట్లో వాళ్లే ఉంటూ ఆన్లైన్లో తమ సంగీతాన్ని టుగెదర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం సమయానికి సంగీత వాయిద్యం అందుబాటులో లేకపోవడంతో కిచెన్‌లోని వస్తువులనుపయోగించి అబ్బురపరిచారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కుర్చీని డ్రమ్గా వాడుతూ దానిపై గరిటెలతో వాయిస్తున్నాడు. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో వారు సామాజిక ఎడంతోపాటు, హోమ్ క్వారంటైన్‌ను పాటిస్తూనే మ్యూజిక్ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు లేనిదే తాము లేమని, అంతేకాక ఇలాంటి సమయంలో ఒకరికొకరం ఎంతో అవసరం అనేది అర్థమవుతోందన్నారు. అందుకే తాము సంగీతాన్ని పంచుకుంటున్నామని ఓ సంగీతకారుడు పేర్కొన్నారు. ఈ వీడియోను చిత్రీకరించడానికి నాలుగు రోజులు పట్టిందని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో అక్కడి జనాల మనసులను కదిలిస్తోంది. ఆడియో అండ్ వీడియో టెక్నాలజీతో అలోన్ ఎట్ హోమ్.. బట్ టుగెదర్ ఇన్ ఆన్లైన్ అంటూ ప్రేక్షకులకు వీనులవిందు చేస్తోంది. (లాక్డౌన్: తండ్రి చివరి చూపు దక్కినా చాలు) -
సమ్మోహన వీణ
ప్రసిద్ధ వాద్య సంగీతకారుడు పండిట్ విశ్వమోహన్ భట్.. వాద్యసంగీతంలో తియ్యని స్వరం! మోహనవీణతో శ్రోతలను సమ్మోహనపరచడం ఆయన నైజం!. అందుకే వరల్డ్ మ్యూజిక్ గ్రామీతో గ్రాండ్‌గా సత్కరించింది!. ‘పంచతత్వ’ సంగీత కచేరిలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆయన సిటీప్లస్‌తో పంచుకున్న మాటలు.. నిజానికి హవాయిన్ గిటార్ పాశ్చాత్య సంగీత పరికరం. దానికి అదనంగా 14 తీగలను చేర్చి మొత్తం ఇరవై తీగలతో ‘మోహనవీణ’గా ఇండియనైజ్ చేశాను. 1967 నుంచి మోహనవీణ సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు 81 దేశాల్లో ఈ వీణ మోగింది. నా ఇద్దరు కొడుకులు సలీల్ భట్, సౌరభ్ భట్.. సంగీతకారులే. సలీల్.. ‘సాత్విక్వీణ’ను కనిపెట్టి నా వారసత్వాన్ని నిలబెట్టాడు. సంగీత ప్రస్థానం.. 300 ఏళ్లుగా సంగీత నేపథ్యం వారసత్వంగా కొనసాగుతున్న కుటుంబం మాది. ఇంకో విషయం.. మేము తెలంగాణవాళ్లం. మా ఇంటిపేరు తెలంగ్. మా పూర్వీకులు జైపూర్ మహారాజా ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి ఆయన ఆస్థానంలో సంగీత విద్వాంసులుగా చేరారు. నాన్న మన్మోహన్ భట్, అమ్మ చంద్రకళా భట్.. ఇద్దరూ సంగీత విద్వాంసులే. 1983లో పండిట్ రవిశంకర్ శిష్యుడినయ్యాను. ఆయన దగ్గర ఒక్క సంగీతాన్నే కాదు క్రమశిక్షణ, నిబద్ధత, పంక్చువాలిటీ, డెడికేషన్.. ఇలా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఆయన చక్కటి హాస్యచతురుడు. గురూజీ పండిట్ రవిశంకర్ తర్వాత గ్రామీ అవార్డ్ అందుకున్న ఇండియన్ మ్యూజీషియన్‌ని నేనే. ఈ విషయంలో గురువు గారి పరంపరను నిలబెట్టినందుకు ఆనందంగా ఉంటుంది. హిందుస్థానీ సంగీతంపైనే ఏకాగ్రత.. నా ఏకాగ్రత అంతా హిందుస్థానీ సంగీతం మీదే అయినా.. 39 ఫ్యూజన్ ఆల్బమ్స్ అమెరికాలో, 60 వరకు ఇక్కడా చేశాను. ఎక్కువగా వాయిద్య సంగీత కచేరీలే ఇస్తున్నా..మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తున్నా. మ్యూజిక్ ఫర్ రిలాక్సేషన్, మ్యూజిక్ ఫర్ సోల్, సెలబ్రేషన్స్ ఆఫ్ లవ్.. ఈ మూడు నా కంపోజిషన్సే! కాళిదాసు రచించిన ‘మేఘధూతం’ కావ్యానికి స్వరకల్పన చేశాను. హరిహరన్, కవితా కృష్ణమూర్తి వాటిని ఆలపించారు. దీనికన్నా ముందే జయదేవుని గీతగోవిందాన్నీ స్వరబద్ధం చేశాను. ఇటీవలే ‘ఖామోషియా’ అనే గజల్ ఆల్బమ్ చేశాను. ఆదరణ తగ్గలేదు.. మన సంస్కృతికి చిహ్నం మన శాస్త్రీయ సంగీతం. ఎన్ని ఆధునిక ఒరవడులు వచ్చినా శాస్త్రీయ సంగీతాన్ని కదల్చలేవు. కాకపోతే సినిమా సంగీతం వంటివి సామాన్యులను త్వరగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే.. పాటలోని స్వరాల కన్నా ఆ నేపథ్యాన్ని ప్రెజెంట్ చేసే దృశ్యమే మనసుపై ముద్రవేస్తుంది. ఉదాహరణకు దీపికా పదుకొనె పాట వింటే పాటలోని సాహిత్యం, సంగీతం కన్నా దీపికా పదుకొనె రూపమే శ్రోత మెదడులో కదలాడుతుంటుంది. సినిమా సంగీతానిది అలాంటి ఆకర్షణ మరి. సరస్వతి ఆరాధన.. సంగీతం భగవంతుడి భాష. మనిషి మానసిక వికాసానికి ఆ దేవుడు మనకు ప్రసాదించిన వరమిది. మ్యూజిక్ మనసుని, శరీరాన్ని, ఆత్మను స్వచ్ఛపరుస్తుంది, స్వాంతననిస్తుంది. మన శాస్త్రీయ సంగీతం ఆధ్యాత్మికం. ధ్యానానికి అనుగుణమైంది. పరమాత్మతో కనెక్ట్ చేస్తుంది. నా వరకు నాకు దేవుడి పూజ అంటే.. నా సంగీత సాధనే. సరస్వతీ మాత ఆరాధనే! మెచ్యూర్డ్‌గా ఉంటారు.. హైదరాబాద్ రావడమంటే సొంతింటికి వచ్చినట్టే. ఇక్కడి శ్రోతలకు మంచి అభిరుచి ఉంది. కచేరీ చేస్తున్నప్పుడు చప్పట్లు, ఈలలతో కళాకారుడిని డిస్టర్బ్ చేయరు. మెచ్యూర్డ్‌గా ఉంటారు. దే లైకిట్ ఇన్ సోబర్ వే అండ్ దే గివ్ లిబర్టీ టు మ్యుజీషియన్ టు పెర్ఫార్మ్ ద బెస్ట్! ఎక్సలెంట్ సిటీ. ఔత్సాహిక కళాకారులకు ఇచ్చే సూచన ఒకటే.. సంగీతాన్ని కళగానే చూడండి. కళగానే అభ్యసించండి. దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవద్దు. ‘పంచతత్వ’ పేరుతో సాగిన సుస్వరాల సంగీత జల్లులతో శనివారం శిల్పకళావేదిక తడిసి ముద్దయింది. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం, విశ్వమోహన్ భట్ మోహనవీణ, సెల్వగణేష్ కంజీర, శుభాంకర్ బెనర్జీ తబల, శ్రీధర్ పార్ధసారథి మృదంగం.. మంత్రముగ్ధుల్ని చేశాయి. - సరస్వతి రమ