సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ఎర వేసి సిటీకి చెందిన ఇద్దరి నుంచి రూ.2.07 లక్షలు కాజేశారు. బాధితులు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఫలక్‌నుమ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.5 లక్షల వ్యక్తిగత రుణం మంజూరైందని చెప్పారు. ఆ మొత్తం తీసుకోవడానికి కొన్ని చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని, వీటిలో కొన్ని రిఫండ్ వస్తాయంటూ నమ్మబలికారు. ఇలా మొత్తం రూ.1.03 లక్షలు కట్టించుకుని మోసం చేశారు.
కార్వాన్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు హైపీ అనే తమ వెబ్‌సైట్ నుంచి వస్తువులు ఖరీదు చేయాలని, అలా చేస్తే భారీ మొత్తం కమీషన్‌గా వస్తుందని నమ్మబలికారు. కొన్న వస్తువుల్ని అమేజాన్, ఫ్లిప్‌కార్డ్ ద్వారా డెలివరీ చేస్తామన్నారు. ఈ యువకుడు తొలుత కొన్ని వస్తువులు కొనగా..వాటితో పాటు కమీషన్ కూడా వచ్చింది. దీంతో పూర్తిగా నమ్మిన ఇతగాడు రూ.1.04 లక్షలు షాపింగ్ చేశాడు. ఆ తర్వాత వస్తువులు, కమీషన్ రెండూ రాకపోవడంతో తనను సంప్రదించిన వారికి ఫోన్ చేశాడు. అవన్నీ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.
(చదవండి: ప్లాస్మా కావాలంటే ఈ నంబర్లకు కాల్.. తీరా చేస్తే.. )
Comments
Please login to add a commentAdd a comment