ఫలక్‌నామాలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
చార్మినార్(హైదరాబాద్): ఫలక్‌నామాలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షంషేర్ గంజ్‌లోని ఓ స్క్రాప్ గోదాములో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫలక్‌నామా, ఇంజనబౌలి ఆంధ్రాబ్యాంక్ సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఒక్క సారిగా మంటలు వచ్చాయి. ఆ మంటలు పక్కనే ఉన్న స్క్రాప్ గోదాములోకి వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికుల భయాందోళనకు గురయ్యారు.
మంటలు వ్యాపిచడంతో పోలీసులు వెంటనే గోదాము చుట్టు పక్కల ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన 15 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. రాత్రి నుంచి శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. షార్ట్‌సర్క్వూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.