అమ్మా.. మాట్లాడమ్మా..! | Married woman died with electrical shock | Sakshi

అమ్మా.. మాట్లాడమ్మా..!

Feb 28 2018 9:00 AM | Updated on Sep 5 2018 4:17 PM

Married woman died with electrical shock - Sakshi

మృతురాలు వెంకటరమణమ్మ

బుక్కపట్నం: ‘అమ్మా.. మాట్లాడమ్మా.. లే అమ్మా.. ఒక్కసారి మాట్లాడమ్మా’ అంటూ పిల్లలు రోదించిన తీరు కలచివేసింది. పాముదుర్తి వెంకటాపురంలో ఓ వివాహిత విద్యుదాఘాతంతో మృతిచెందింది. బంధువులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన ఎద్దుల సుదర్శన్‌రెడ్డి భార్య వెంకటరమణమ్మ (30) మంగళవారం ఉదయం ఉతికిన బట్టలను మిద్దెపై ఆరేసే క్రమంలో జీఏ వైర్‌ను తాకింది. పైకçప్పు రేకులపై నుంచి ఇంటి సర్వీస్‌ వైర్‌కు సంబంధించి ఒక చోట ఎర్త్‌ కావటంతో జీఏ వైరుకు విద్యుత్‌ సరఫరా అయ్యి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తమ కళ్లెదుటే తల్లి ప్రాణం విడచడంతో పిల్లలు రోదించారు. విషయం తెలుసుక్ను వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి స్థానిక నాయకులు సూర్యనారాయణరెడ్డి తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement