
సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అనంతపురంలో పర్యటించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి వివాహానికి ఆయన హాజరయ్యారు. హెలీప్యాడ్ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికాయి.
అనంతరం రుద్రంపేట సర్కిల్ మీదుగా ఇంద్రప్రస్థ కళ్యాణ వేదిక దాకా వైఎస్ జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలికారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. నూతన వధూవరులు ప్రణయ్ రెడ్డి, సాయి రోహిత లకు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు.