సాక్షి,అనంతపురం : శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే శ్రావణి ఇంటి వద్ద గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత ప్రసాద్, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. 30 ఏళ్లుగా టీడీపీకి సేవలు అందించినా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్‌ను ఎమ్మెల్యే శ్రావణి తల్లి నీలావతి ఐదు లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశామని, అక్కసుతో తమ అక్కసుతో తమ కుటుంబం పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment