Sharavani
-
టీడీపీ ఎమ్మెల్యే శ్రావణికి చేదు అనుభవం
సాక్షి,అనంతపురం : శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే శ్రావణి ఇంటి వద్ద గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత ప్రసాద్, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. 30 ఏళ్లుగా టీడీపీకి సేవలు అందించినా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్‌ను ఎమ్మెల్యే శ్రావణి తల్లి నీలావతి ఐదు లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశామని, అక్కసుతో తమ అక్కసుతో తమ కుటుంబం పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇద్దరు మెడికోల ఆత్మహత్య!
హైదరాబాద్/ఏలూరు: ఒకే రోజున తెలుగు రాష్ట్రాల్లో విషాద మరణాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు మెడికోలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో నల్లగొండ జిల్లాకు చెందిన మెడికో పీజీ విద్యార్థిని శ్రావణి మత్తు మందు కలిపి సెలైన్‌ను ఎక్కించుకుని బలవన్మరణానికి పాల్పడగా, ఏలూరులో హౌస్ సర్జ్న్గా చేస్తున్న దానవాయిపేటకు చెందిన బలభద్ర రితేష్ (24) తాను ఉంటున్న హాస్టల్ 3వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికో విద్యార్థి రితేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిద్దరి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. జాంబాగ్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న శ్రావణి అనుమానాస్పదంగా మృతిచెందడంతో పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థి శ్రావణి చనిపోయే ముందు తన తల్లిదండ్రులకు ఫోన్లో ఎస్ఎంఎస్తో సమాచారం ఇచ్చినట్టు అఫ్జల్‌గంజ్ సీఐ అంజయ్య వెల్లడించారు. మెడికో విద్యార్థిని శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు తెలిపారు. కాగా, ఓయూ పీజీ విద్యార్థిని శ్రావణి కళ్లను ఆమె కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రికి దానం చేశారు.