గ్రామపంచాయతీ వద్ద సత్య ఆందోళన
చందుర్తి(వేములవాడ): ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలని గత నెల 30న వాటర్‌ట్యాంకు ఎక్కి ఆందోళన చేసిన యువతి శుక్రవారం మండలంలోని మరిగడ్డ గ్రామపంచాయతీ వద్ద మౌనదీక్షకు దిగింది. బాధితురాలు మానుక సత్య వివరాల ప్రకారం.. మరిగడ్డకు చెందిన ఏరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, సత్య ప్రేమించకున్నారు. పెళ్లి సమయానికి ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో జూన్ 21న పోలీసులను ఆశ్రయించింది. విషయాన్ని పోలీసులు కాలయాపన చేస్తున్నారని అదేనెల 26న ఠాణాలోనే నిద్రమాత్రలు మింగింది.
పోలీసులు నిర్ధిష్ట గడువు విధించి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో జూన్30 ట్యాంకెక్కి ఆందోళన చేసింది. అదే సమయంలో ప్రియుడు ప్రశాంత్‌రెడ్డి పురుగుల మందు తాగగా.. విషయం తెలిసిన సత్య నిద్రమాత్రలు మింగింది. ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు తనకు ఎలాంటి న్యాయం చేయం లేదని శుక్రవారం మరిగడ్డకు వచ్చింది. గ్రామపంచాయతీ ఎదుట మౌన పోరాటానికి దిగింది. కాగా ప్రశాంత్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని రాగానే మాట్లాడతామని పోలీసులు సత్యకు సూచించారు. అయినా వినకుండా దీక్షకు పూనుకుంది.
Comments
Please login to add a commentAdd a comment