సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్‌లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.
సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఆండ్రాయిడ్ vs ఐఓఎస్.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో వివిధ ధరలు అంటూ ఫోటోలను పోస్ట్ చేశారు. ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా నో కాస్ట్ ఈఎంఐలో కూడా వ్యత్యాసం కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ నెలకు రూ. 1373 నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఐఓఎస్ యూజర్ నో కాస్ట్ ఈఎంఐ రూ. 1600 నుంచి ప్రారంభమవుతోందని ఇక్కడా చూడవచ్చు. ఇది చాలా అన్యాయమని సౌరభ్ శర్మ వెల్లడించారు.
సౌరభ్ శర్మ.. ధరల వ్యత్యాసం గురించి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్ట్‌తో కూడా సంబంధించారు. ''విక్రయదారు వివిధ అంశాల ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. కాబట్టి ధరలలో మార్పు జరగవచ్చు. దయచేసి చింతించకండి. అమ్మకందారులు మీకు గొప్ప డీల్స్, డిస్కౌంట్‌లను అందించడానికి ఎల్లప్పుడూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. హ్యాపీ షాపింగ్'' అంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపైన స్పందిస్తూ ఇలాంటి అనుభవాలు తమకు కూడా ఎదురైనట్లు చెప్పుకొచ్చారు.
Android vs iOS - different prices on @Flipkart App??
same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.
Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.
But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024
Comments
Please login to add a commentAdd a comment