బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో కోహ్లి వ్యూహాలు భిన్నంగా కనిపించాయి. ధోనికి భిన్నంగా ఐదుగురు ప్రధాన బౌలర్లతో కోహ్లి బరిలోకి దిగాడు. దీనిపై స్పందిస్తూ
ఢాకా: బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో కోహ్లి వ్యూహాలు భిన్నంగా కనిపించాయి. ధోనికి భిన్నంగా ఐదుగురు ప్రధాన బౌలర్లతో కోహ్లి బరిలోకి దిగాడు. దీనిపై స్పందిస్తూ ధోని... ఒకరితో మరొకరికి పోలిక అనవసరమన్నాడు. తాను టెస్టులనుంచి తప్పుకున్నా...వన్డేలకు వచ్చే సరికి తనదైన శైలిలోనే వ్యూహాలకు కట్టుబడతానని స్పష్టం చేశాడు. ‘ప్రస్తుతం నేను వన్డేల గురించే మాట్లాడతాను. అయితే ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. అదే తరహాలో కెప్టెన్సీ విషయంలో కూడా అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. మీరు చేసిందే మరొకరు చేయాలని ఆశించలేం. ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళతారు’ అని ధోని వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్‌తో నెలల క్రితం జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడటం అనవసరమని, తాను రెండు రోజుల క్రితం నాటి విషయాలే గుర్తు పెట్టుకుంటానని మహి సరదాగా చెప్పాడు.