ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పట్టుబిగించింది.
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పట్టుబిగించింది. ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. బలమైన సంకల్పంతో పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఉద్యమ కార్యాచరణను అమలుచేస్తున్నాయి. ప్యాకేజి రాజకీయాలు చెల్లబోవని ఎలుగెత్తిచెబుతున్నాయి.
హోదా ప్రకటించేవరకూ తమ నేత సారథ్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఘంటాపథంగా ప్రకటిస్తున్నాయి. మంగళవారం జిల్లావ్యాప్తంగా పార్టీనేతలు..శ్రేణులు కొవ్వొత్తులు..కాగడాలు చేతబూని ప్రదర్శనలు నిర్వహించారు..