భారతదేశానికి చెందినవారు విదేశాలు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ముందుగా దుబాయ్ లేదా అండమాన్ వెళ్లాలని అనుకుంటారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే ముందుగా బడ్జెట్ గురించి ఆలోచించాల్సివస్తుంది. అటు అండమాన్ లేదా ఇటు దుబాయ్ వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కడికైనా ప్రయాణమవుదామనుకుంటే ముందుగా బడ్జెట్ గురించి ఆలోచించాల్సివస్తుంది. అయితే అండమన్ చూసివద్దామనే ఆలోచనను ప్రస్తావించగానే.. చాలామంది అక్కడకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుతో చక్కగా దుబాయ్ వెళ్లివచ్చేయవచ్చని చెబుతారు. మరికొందరు మాత్రం దుబాయ్ వెళ్లడం చాలా చౌక అని కూడా అంటుంటారు. దీంతో ఈ మాటలు విన్నవారు కన్ఫ్యూజన్‌కు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము అండమాన్ వెళ్లాలో లేక దుబాయ్ వెళ్లాలో తెలియక తికమకపడతారు. ఈ ప్రశ్నలకు చెక్ పెడుతూ మీ సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దుబాయ్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది?
దుబయ్ లేదా అండమాన్‌కు సంబంధించిన టూర్ ప్యాకేజీకి ఎంతఖర్చవుతుందో బేరీజు వేసేందుకు మేక్ మైక్ ట్రిప్‌లో సమాచారం ఇలా ఉంది. దుబాయ్ వెళ్లేందుకు ఒక వ్యక్తికి సుమారు రూ. 31 వేలు అవుతుంది. ఈ ప్యాకేజీలో ఆరు రోజుల ప్లాన్ ఉంది. దీనిలో ప్రైవేట్ ట్రాన్స్‌ఫర్, మరినా యాచ్ టూర్ మొదలైనవి కలిసే ఉన్నాయి.
6 రోజుల అనంతరం ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చేందుకు వరకూ అయ్యే ఖర్చు దీనిలో కలిపే ఉంటుంది. హోటల్ అద్దె కూడా దీనిలో భాగమయ్యే ఉంటుంది. అయితే దుబాయ్ వెళ్లేందుకు ఫ్లయిట్ టిక్కెట్లు విడిగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.12 నుంచి 15 వేలు ఖర్చవుతాయి. అంటే రెండు వైపుల ఫ్లయిట్ ప్రయాణ ఖర్చులు చూసుకుంటే మొత్తంగా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకూ అవుతాయి. అంటే ప్యాకేజీ, ప్రయాణ ఖర్చులు కలుపుకుని చూసుకుంటే ఒక్కో వ్యక్తి దుబాయ్ వెళ్లి రావడానికి రూ. 60 వేలు అవుతుంది.
అండమాన్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది?
దుబాయ్ గురించిన సమాచారం తెలుసుకున్న తరువాత ఇప్పుడు అండమాన్ వెళ్లేందుకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకుందాం. రాబోయే ఆగస్టులో అండమాన్ వెళ్లాలనుకుంటే ఒక్కో వ్యక్తికి రూ. 42 వేలు ఖర్చవుతుంది. ఈ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, హెవ్లాక్, నీల్ ఐల్యాండ్ మొదలైనవి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు చొప్పున బస చేయవచ్చు.
ఈ ట్రిప్ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది. దీనిలో ప్రైవేట్ ట్రాన్స్‌ఫర్, ఫెరీ మొదలైన ఛార్జీలు కలిపే ఉంటాయి. అయితే అండమాన్ వెళ్లేందుకు ఫ్లయిట్ ఛార్జీ విడిగా ఉంటుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు రూ. 30 వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే అండమమాన్ వెళ్లి వచ్చేందుకు రూ. 75 వేల వరకూ ఖర్చవుతుంది.
ఈ ప్లాన్ కంపేరిజన్‌ను అనుసరించి చూస్తే.. అండమాన్ వెళ్లడం అనేది దుబాయ్ వెళ్లేందుకన్నా ఖర్చుతో కూడుకున్నదని తెలుస్తోంది. అయితే ఇది సీజన్‌తో పాటు ఎన్ని రోజులు అక్కడ ఉంటారు? అక్కడ ఉపయోగించుకునే లగ్జరీ సదుపాయాలు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే..
Comments
Please login to add a commentAdd a comment