Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan to Meet with Local Government Representatives on April 21
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్‌ భేటీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గట్టిగా నిలబ­డిన ప్రజా ప్రతినిధులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నా­ప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బం­దులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో 8 నియోజకవర్గాల్లోని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీ­టీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్టెడ్‌ సభ్యులు హాజరవుతారు. ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజా­స్వామిక పరిణామాలపై చర్చించడంతోపాటు, భవిష్యత్‌ కార్యాచరణపైనా ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతిని«ధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం⇒ వచ్చే వారం స్వయంగా నేనే వస్తా⇒ టీడీపీ ఎమ్మెల్యే బంధువుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య ⇒ కుటుంబానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ⇒బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైఎస్సార్‌సీపీ అధినేత సాక్షి, అమరావతి/రామగిరి: ‘ఏమాత్రం అధైర్యప­డొద్దు.. మీ కుటుంబానికి పూర్తిగా అండగా నిలు­స్తాం.. అన్ని విధాలా ఆదుకుంటాం.. వచ్చే వారం స్వయంగా నేనే వస్తా’ అని వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియో­జకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డి­పల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధు­వుల చేతిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగ­మయ్య కుటుంబాన్ని మంగళవారం ఆయన ఫోన్‌లో పరామర్శించారు.లింగమయ్య భార్య రామాం­జినమ్మ, కుమా­రులు మనోహర్, శ్రీని­వాసులతో మాట్లాడారు. లింగమయ్య హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ‘సార్‌.. రామగిరి మండలంలో రాక్షసపాలన కొనసాగుతోంది. పరిటాల సునీత నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఇక్కడి పోలీసులు పరిటాల కుటుంబ సభ్యు­లకు తొత్తులుగా మారారు. వైఎస్సార్‌సీపీ నాయ­కులు, కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం రామగిరి ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటిపై పరిటాల సునీత సమీప బంధువులైన ధర్మవరపు ఆదర్శ్‌నాయుడు, ధర్మవ­రపు మనోజ్‌ నాయుడు దాడులకు దిగారు. వారిని మా నాన్న అడ్డుకో­బో­యాడు. దీంతో కక్ష కట్టి వైఎస్సార్‌సీపీకి అనుకూ­లంగా ఉన్నారంటూ పండుగ వేళ ఇంట్లో ఉన్న మాపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనలో నాన్న లింగమయ్య మృతి చెందాడు’ అంటూ కుమారులు మనోహర్, శ్రీనివాసులు... మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. మీరు అధైర్య పడొద్దని, పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని, ఆదుకుంటుందని లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలు, లీగల్‌సెల్‌ను అప్రమత్తం చేస్తామని, వారు తగిన రక్షణ కల్పిస్తారన్నారు. ‘మీ కుటుంబానికి ఏం జరిగినా చూస్తూ ఊరుకోం. పూర్తి అండగా నిలుస్తాం. అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఏ మాత్రం భయపడొద్దు. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు.

Chandrababu Coalition govt Redbook conspiracy On 2
పోలీసుపై రెడ్‌ బుక్‌ జులుం

టీడీపీ కూటమి పెద్దల పైశాచికత్వం..శాంతిభద్రతలు అస్తవ్యస్తం ఓవైపు వేటు వేసి.. మరోవైపు కొత్తవారు కావాలంటూ కేంద్రానికి లేఖలు ‘రెడ్‌బుక్‌ కుట్ర’కు సెల్యూట్‌ చేస్తేనే పోస్టింగ్‌... నిబంధనలు పాటిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్‌’ తాము చెప్పినవారిని వేటాడితేనే పోస్టింగ్‌.. విధులు నిక్కచ్చిగా నిర్వర్తిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్‌.. పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తామంటేనే పోస్టింగ్‌.. ఖాకీ చొక్కా వేసుకున్నాం కదా .. చట్టం ముందు అందరూ సమానం అంటే మాత్రం నో పోస్టింగ్‌..ఇదీ పోలీసు శాఖపై చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తున్న దుర్నీతి. సాక్షి, అమరావతి: సీనియర్‌ అధికారులను.. వెంటాడి వేటాడి పోస్టింగ్‌లు ఇవ్వకుండా మనో వ్యథకు గురిచేస్తూ.. మంచి అధికారులను కుట్రలు చేసి పక్కనపెట్టి పాలన సాగిస్తూ.. ఉన్న అధికారులను రెడ్‌ బుక్‌ రూల్‌ కోసం వాడుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన పోలీసు వ్యవస్థతో ఆడుకుంటోంది. రాజకీయ స్వార్థంతో భ్రషు్టపట్టిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదీ సంబంధం లేకుండా విధులు నిర్వర్తించే పోలీసులపై కక్ష కట్టి వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల తర్వాత కూడా రాష్ట్రంలో ఏకంగా 199 మంది పోలీస్‌ అధికారులకు పోస్టింగులు లేవంటే రెడ్‌ బుక్‌ కుట్ర ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. ⇒ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అంటే పోలీస్‌ శాఖలో హోదా ఉన్న అధికారే. అయితే, చంద్రబాబు ప్రభుత్వ వేధింపులకు బలైనవారిలో అందరూ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆపై స్థాయి అధికారులే కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే నలుగురు ఐపీఎస్‌లు, నలుగురు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్‌), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలు ఉండడం గమనార్హం. వీరందరికీ పోస్టింగులు ఇవ్వలేదని సాక్షాత్తు రాష్ట్ర శాసనసభకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఇంతమంది పోలీసు అధికారులను వెయిటింగ్‌లో ఉంచడం దేశ చరిత్రలోనే లేదనే వ్యా­ఖ్య­లు వినిపిస్తున్నాయి. ఇక కక్షపూరితంగా ఐదుగురు ఐపీఎస్‌లను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది కూడా.వెయిటింగ్‌లో నలుగురు ఐపీఎస్‌లు2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యలకు తెగించింది. 24 మంది ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ విధానాలను అమలు చేసే ఐపీఎస్‌పై ప్రతాపం చూపించింది. ఐదు నెలల తరువాత దశలవారీగా కొందరు ఐపీఎస్‌లకు అదీ అప్రాధాన్యమైన పోస్టింగులు ఇచ్చింది. కానీ, నేటికీ నలుగురిని వెయిటింగ్‌లోనే ఉంచింది. సీనియర్‌ ఐపీఎస్‌లు కొల్లి రఘురామ్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, జాషువాలు అందుబాటులో ఉన్నా సరే వారి సేవలను వినియోగించుకోవడం లేదన్నది సుస్పష్టం.కుట్ర పన్ని.. కక్షకట్టి రెడ్‌బుక్‌ కుట్రతో ఐదుగురు ఐపీఎస్‌లపై చంద్రబాబు ప్రభు­త్వం కక్షకట్టింది. సీనియర్‌ ఐపీఎస్‌లు పీఎస్‌ఆర్‌ ఆంజనేయు­లు, పీవీ సునీల్‌కుమార్, ఎన్‌.సంజయ్, టి.కాంతిరాణా, వి­శాల్‌ గున్నీలను సస్పెండ్‌ చేసింది. వలపు వల విసిరి బడా బాబులను బ్లాక్‌మెయిలింగ్‌ చేయడమే పనిగా పె­టు­్టకున్న కాదంబరి జత్వానీ అనే ముంబై మోడల్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ పీఎస్‌­ఆ­ర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీలను సస్పెండ్‌ చేయడం అందర్నీ విస్మయపరిచింది. ⇒ చంద్రబాబు రాజగురువు రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలను వెలికితీశారనే కక్షతోనే ఎన్‌.సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి సస్పెండ్‌ చేశారు. కేవలం డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కళ్లల్లో ఆనందం చూడడం కోసం డీజీ పీవీ సునీల్‌కుమార్‌ను వివరణ కూడా కోరకుండా ఏకపక్షంగా సస్పెండ్‌ చేసింది. సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించిన అభియోగాలపై ఆయనను సస్పెండ్‌ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం.తమ కుట్రల అమలు కోసం కేంద్రానికి లేఖలు ఉన్న అధికారులనేమో వేధిస్తూ.. తమకు మరో ముగ్గురు ఐపీఎస్‌లు కావాలంటూ కేంద్ర ప్రభుత్వా­నికి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. మరీ ముఖ్యంగా యూపీ కేడర్‌లో పనిచేస్తున్న అధికారి కోసం పట్టుబడుతోంది. ఆయనైతే తమ కుట్రల అమ­లుకు, ప్రత్యర్థులను వేటాడేందుకు సమర్థంగా ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. అయితే, డిప్యూటేషన్‌ నిబంధనలు అనుమతించకపోవడంతో కేంద్రం నుంచి స్పందన రాలేదు. కీలకమైనప్పటికీ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే క్షేత్రస్థాయి పోలీసులను కూడా చంద్రబాబు సర్కారు వేధిస్తోంది. నాన్‌ క్యాడర్‌ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు కలిపి మొత్తం 195 మందికి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి పోస్టింగులు ఇవ్వకపోవడమే దీనిని నిదర్శనం. పాలనాపరమైన అంశాలతో నలుగురైదుగురిని స్వల్ప కాలం వెయిటింగ్‌లో ఉంచడం సాధారణం. తర్వాత ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవడం రివాజు. ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. ఇలా పక్కనపెట్టినవారిలో నాన్‌ క్యాడర్‌ ఎస్పీలు పి.సత్తిబాబు, పి.వెంకటరత్నం, బి.లక్ష్మీనారాయణ, ఎ.సురేశ్‌బాబు ఉన్నారు. 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్‌), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలనూ వెయిటింగ్‌లో పెట్టింది.జీతాలివ్వకుండా ‘పచ్చ’ పైశాచికత్వం ఏకంగా 199 మంది పోలీసులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. వెయిటింగ్‌లో ఉన్నారని చెప్పి వీరికి 10 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఆర్ధికంగా పోలీసు అధికారులు ఇబ్బందులు పడుతూ ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీసు అధికారులు ఇంతటి దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Muhammad Yunus invites China to expand in India Northeast3
భారత్‌కు షాక్‌.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

గువాహటి/ఇంఫాల్‌: బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహదారు ముహమ్మద్‌ యూనుస్‌ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.చైనా పర్యటన సందర్భంగా యూనుస్‌ ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా యూనుస్‌.. ‘సెవన్‌ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదు. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్‌ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉంది. ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణావకావం. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక సత్తాను చాటొచ్చు. ఇక్కడ విస్తరించి, ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్‌ చేసుకోవచ్చు’ అని అన్నారు.దీంతో, పార్టీలకు అతీతంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చైనాతో దోస్తీకి అర్రులు చాచే యూనుస్‌ ఏ అర్హతతో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తెస్తారు?’ అని నేతలు మండిపడ్డారు. త్రిపురలో ముఖ్యమైన తిప్రా మోతా పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్‌ దేబర్మా మాణిక్య ఘాటుగా స్పందించారు. ‘ఇరుకైన చికెన్‌ నెక్‌ కారిడార్‌లో భారత సైన్యం మోహరింపు, పటిష్టమైన భద్రతపై దృష్టిపెట్టడంతోపాటు ఈసారి ఏకంగా బంగ్లాదేశ్‌ను నిలువుగా చీల్చి ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గాన్ని ఏర్పాటుచేయాలి. అసలు 1947 బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ నౌకాశ్రయం మన చేతికొచ్చినా త్యజించడం ఆనాడు చేసిన పెద్ద తప్పు’ అని ప్రద్యోత్‌ అన్నారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్ర పరిణామాలు ఊహించకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని యూనుస్‌కు మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌ హితవు పలికారు. ‘భారత విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారడం శోచనీయం. ఏ దేశం విమోచన కోసం భారత్‌ పోరాడింతో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపడం దారుణం’ అని అస్సాం జాతీయ పరిషత్‌(ఏజేపీ)అధ్యక్షుడు, జొర్హాట్‌ ఎంపీ లురిన్‌ జ్యోతి గొగోయ్‌ అన్నారు. భారత విదేశాంగ విధానం ఎంత బలహీనపడిందో యూనుస్‌ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ విమర్శించింది.

Tariffs announced on April 2 to be effective immediately4
టారిఫ్‌లకు వేళాయె

న్యూయార్క్‌/వాషింగ్టన్‌/రోమ్‌/టోక్యో: ప్రపంచ వాణిజ్య యుద్ధానికి వేళైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గొప్పగా ప్రకటించుకుంటూ వస్తున్న ‘విముక్తి దినం’ రానే వచ్చింది. ప్రపంచ దేశాలపై అగ్ర రాజ్యం ప్రతీకార సుంకాల బాదుడు బుధవారం నుంచే మొదలవనుంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతోంది. అమెరికాతో పాటు చాలా దేశాల్లో స్టాక్‌మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. భారత్‌కు కూడా భారీ వడ్డింపులు తప్పవని వైట్‌హౌస్‌ తాజాగా స్పష్టం చేసింది. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘అమెరికా వ్యవసాయోత్పత్తులు తదితరాలపై భారత్‌ 100 శాతం సుంకాలు విధిస్తోంది. మా పాడి ఉత్పత్తులపై యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు 50 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయి. జపాన్‌ అయితే మా బియ్యంపై ఏకంగా 700 శాతం టారిఫ్‌లు విధించింది. మా బటర్, చీజ్‌ తదితరాలపై కెనడా 300 శాతం టారిఫ్‌లు వడ్డిస్తోంది. ఈ దేశాలన్నీ నడ్డి విరిచే టారిఫ్‌లతో అమెరికాను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆయా దేశాలకు మా ఎగుమతులను అసాధ్యంగా మార్చేశాయి’’ అంటూ ఆక్షేపించారు. ‘‘ఇక ప్రతీకారానికి వేళైంది. వాళ్లకు అంతకు అంతా వడ్డించబోతున్నాం.అమెరికా ప్రజల సంక్షేమం దిశగా అధ్యక్షుడు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి రానుంది’’ అని పునరుద్ఘాటించారు. ఏయే దేశాలపై ఏ రంగంలో ఎంత సుంకాలు విధించబోయేదీ అధ్యక్షుడే స్వయంగా ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ఈ టారిఫ్‌లు ఆరంభం మాత్రమేనని, వాటిని త్వరలో భారీగా పెంచుతామని ట్రంప్‌ ఇప్పటికే పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికాపై టారిఫ్‌లను భారత్‌ భారీగా తగ్గిస్తోంది. చాలా దేశాలు కూడా అదే బాటన నడుస్తున్నాయి’’ అని సోమవారం ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. మా ప్లాన్లు మాకున్నాయి: ఈయూ అమెరికా టారిఫ్‌లకు బెదిరేది లేదని యూరోపియన్‌ యూనియన్‌ స్పష్టం చేసింది. వాటిని ఎదుర్కోవడానికి తమ వద్ద గట్టి ప్రణాళికలున్నాయని ఈయూ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాండెర్‌ లెయన్‌ చెప్పారు. మంగళవారం ఆమె ఈయూ పార్లమెంటులో మాట్లాడారు. అమెరికావి తప్పుడు చర్యలని ఆక్షేపించారు. ‘‘మేం మొదలు పెట్టిన యుద్ధం కాదిది. అగ్ర రాజ్యానికి దీటుగా బదులిస్తాం. టారిఫ్‌ల బారినుంచి మా ప్రజలను, ఆర్థిక వ్యవస్థలను అన్నివిధాలా కాపాడుకుని తీరతాం’’ అని ప్రకటించారు. ‘‘మేం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌.ఎలాంటి బేరసారాలకైనా కావాల్సినన్ని శక్తియుక్తులు మాకున్నాయి’’ అన్నారు. ‘‘కొన్ని అంశాల్లో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ట్రంప్‌ భావిస్తుంటే, పలు అంశాల్లో మా విషయంలోనూ అదే జరుగుతోందన్నది మా అభిప్రాయం. వీటిపై చర్చలకు మేం సిద్ధమే. ఎందుకంటే టారిఫ్‌ల రగడ అంతిమంగా ప్రజలపైనే భారం వేస్తుంది. వారి జీవన వ్యయం పెరుగుతుంది’’ అని చెప్పారు. టారిఫ్‌ బాదుడు నుంచి జపాన్‌ను మినహాయించాలని ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబా మరోసారి ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే వాషింగ్టన్‌ వెళ్లి ఆయనతో చర్చించేందుకు కూడా సిద్ధమన్నారు.దేశీయ మార్కెట్ల పరిరక్షణకే టారిఫ్‌లపై కేంద్రం ప్రకటనన్యూఢిల్లీ: భారత్‌కు అమెరికాయే అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల పెంపుతో పడే ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య శాఖ నిశితంగా గమనిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. వాణిజ్య నియంత్రణ, దేశీయ మార్కెట్ల పరిరక్షణే లక్ష్యంగా భారత్‌ సుంకాలు విధిస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద మంగళవారం లోక్‌సభలో ఈ మేరకు ప్రకటన చేశారు.హెచ్చు టారిఫ్‌లు దేశానికి మేలు చేయడం లేదని, ఆర్థిక వృద్ధి కోసం వాటిని తగ్గించడం తప్పనిసరని నీతీ ఆయోగ్‌ ఇటీవల చేసిన ప్రకటనపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. ఆర్థిక వృద్ధికి మరింత ఊతమివ్వడం ద్వారా ప్రపంచ మార్కెట్లో భారత్‌ను ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలన్నది తమ దీర్ఘకాలిక లక్ష్యమని వెల్లడించారు. ‘‘పలు దేశాలతో టారిఫ్‌ల సమతుల్యత సాధించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం పలు దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి’’ అని గుర్తు చేశారు. ప్రస్తుతం 13 దేశాలతో భారత్‌ ఎఫ్‌టీఏలు చేసుకుంది. అమెరికా, ఈయూ, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, పెరు వంటి దేశాలతో ఎఫ్‌టీఏపై చర్చలు జరుగుతున్నాయి.ఇదీ పరిస్థితి!అమెరికా వస్తువులు, ఉత్పత్తులపై భారత్‌ ప్రస్తుతం సగటున 18 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తోంది. భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా టారిఫ్‌లు సగటున 2.8 శాతం మాత్రమే. భారత వ్యవసాయ ఎగుమతులపై అమెరికా 5.3 శాతం సుంకాలు విధిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయోత్పత్తులపై మాత్రం భారత్‌ 37.7 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇరు దేశాల మధ్య దాదాపు 30 రంగాల్లో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి రంగంలోనూ భారతే అమెరికాపై హెచ్చు సుంకాలు విధిస్తోంది.దాంతో ఇరు దేశాల మధ్య టారిఫ్‌ల అంతరం ఆటోమొబైల్స్‌ రంగంలో 23.1 శాతం, వజ్రాలు, బంగారం, ఆభరణాల్లో 13.3, కెమికల్, పార్మా రంగంలో 8.6, ఎలక్ట్రానిక్స్‌పై 7.2, ప్లాస్టిక్స్‌పై 5.6, కంప్యూటర్లు, యంత్రాలపై 5.3, ఇనుము, స్టీల్‌పై 2.5, టెక్స్‌టైల్స్, క్లా్లతింగ్‌లో 1.4 శాతంగా ఉంది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికాదే 18 శాతం వాటా. ఆ దేశం నుంచి మాత్రం దిగుమతులు 6.22 శాతమే. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఈ 10.73 శాతం లోటుపైనా అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

Waqf Amendment Bill To Be Presented In Lok Sabha on April 25
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు

న్యూఢిల్లీ: కీలకమైన వక్ఫ్‌(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్‌(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు.బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్‌(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్‌ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయేలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలైన తెలుగుదేశం, జేడీ(యూ) తమ ఎంపీలకు విప్‌ జారీ చేశాయి. బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆదేశించాయి. బిల్లుకు మద్దతు పలకాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు సైతం తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. వక్ఫ్‌ (సవరణ) బిల్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు. బీఏసీ సమావేశం నుంచి విపక్షాల వాకౌట్‌ వక్ఫ్‌ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు రానున్న నేపథ్యంలో స్పీకర్‌ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. విపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలన్న ప్రతిపాదనకు వారు అంగీకరించారు. అయితే, ఈ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం తమ గొంతును అణచివేస్తోందని ఆరోపిస్తూ బీఏసీ సమావేశం నుంచి విపక్ష నేతలు వాకౌట్‌ చేశారు. దీన్నిబట్టి చూస్తే బుధవారం లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న లక్ష్యంతో విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ‘ఇండియా’ కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాందీ, కేసీ వేణుగోపాల్, రాంగోపాల్‌ యాదవ్, సుప్రియా సూలే, కల్యాణ్‌ బెనర్జీ, సంజయ్‌ సింగ్‌. టి.ఆర్‌.బాలు, తిరుచ్చి శివ, కనిమొళి, మనోజ్‌కుమార్‌ ఝా తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను అణచివేయడానికే వక్ఫ్‌(సవరణ) బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు.బిల్లుకు మద్దతు పలుకున్న తెలుగుదేశం, జేడీ(యూ)లకు ప్రజలు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యాంగవిరుద్ధమైన బిల్లును ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ బీఏసీ సమావేశం జరిగింది. గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 293 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి.ఏమిటీ వివాదం? వక్ఫ్‌ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్‌ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్‌ ఆస్తినీ సెంట్రల్‌ పోర్టల్లో విధిగా నమోదు చేయించాలి. ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్‌ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

UP Sant Kabir Nagar Babloo And Radhika Episode Details6
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్‌ ఇచ్చిన రెండో అత్త

లక్నో: నాడు తన భార్య ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించిన భర్త వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రాధికకు రెండో భర్త వికాస్‌ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. ఈ క్రమంలో ఆమె అత్త.. కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ప్రేమకథ అనూహ్య మలుపు తిరిగింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్‌జాట్‌ గ్రామంలో తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్‌తో ఇటీవలే భర్త బబ్లూ పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందనే భయంతో బబ్లూ తన భార్యను ఆమె ప్రియుడికే కట్టబెట్టాడు. అయితే రాధికకు రెండో భర్త వికాస్‌ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది.ఈ సందర్భంగా రాధిక అత్త మాట్లాడుతూ..‘రాధిక భర్త, అతడి పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి, నేను చలించిపోయాను. అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపొమ్మని రాధికకు తేల్చి చెప్పాను’ అని వికాస్ తల్లి వెల్లడించింది. ఈ విషయంపై కటార్‌జాట్ గ్రామంలో మళ్లీ పంచాయతీ జరిగింది. బబ్లూ తన భార్య రాధికను చూసుకుంటాడని గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు. వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు. భవిష్యత్తులో రాధికకు ఏదైనా ప్రమాదం జరిగితే, దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వికాస్ తల్లి గొప్ప మనసు గురించి అంతటా చర్చ జరుగుతోంది. Bablu Kori from Sant Kabir Nagar chooses an inspiring path of dignity over revenge, marrying off his wife to her lover. 'I only want Radhika to be happy,' he declares, prioritizing his children's well-being above all.#BabluKori #SantKabirNagar #inspiringpath #uttarpradesh pic.twitter.com/bOj0iK5vKh— The Savera Times (@thesavera_times) March 28, 2025

Reels has Been Completely Banned in the Kedarnath Temple7
చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్‌

కేదార్‌నాథ్‌: హిందువులు అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా భావించేవాటిలో కేదార్‌నాథ్‌(Kedarnath) ఒకటి. ప్రతీయేటా లక్షలాదిమంది భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా ఇక్కడికి వచ్చే యూట్యూబర్లు ఆలయ పరిసరాల్లో వీడియోలు, రీల్స్‌ తీస్తూ వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయ కమిటీ ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది(2025)లో చార్‌ధామ్‌ యాత్ర(Chardham Yatra) ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. తొలుత యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరవనున్నారు. మే 2న కేదార్‌నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇటువంటి తరుణంలో కేదార్‌నాథ్ ఆలయ సముదాయంలో రీల్స్ చేయడాన్ని నిషేధిస్తూ చార్‌ధామ్ మహా పంచాయతీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామ్‌లలో అత్యధికంగా రీల్స్, వీడియోలు కేదార్‌నాథ్ ధామ్‌(Kedarnath Dham)లోనే రూపొందిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పలువురు యూట్యూబర్లు విరివిగా వీడియోలు , రీల్స్‌ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. వీటి ప్రభావం తీర్థయాత్రపై పడుతోందని ఆలయ అధికారులు గుర్తించారు. భక్తి విశ్వాసాలతో మెలిగేవారు ఇటువంటి రీల్స్‌ చూసి ఆందోళన చెందుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఇక్కడ రీల్స్‌ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు.ధామ్ పవిత్రతను కాపాడటానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్ తీర్థ పురోహిత సమాజ్ కూడా ఇక్కడ రీల్స్ చేయడాన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలని కోరింది. ఈ నేపధ్యంలో ఆలయ ప్రాంగణంలో రీల్స్, వీడియోలు తీయడాన్ని నిషేధించాలని చార్ ధామ్ మహా పంచాయతీ సమావేశంలో నిర్ణయించారు. దీనితో పాటు ఆలయంలో వీఐపీ దర్శనాలను కూడా నిషేధించారు. ఎవరైనా ఆలయ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఇది కూడా చదవండి: Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం

Shanthanu Fires On Trolling at Puri Jagannadh, Vijay Sethupathi Movie8
పూరీ- విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్‌.. ఘాటుగా స్పందించిన నటుడు

ఒకప్పుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) సినిమాలు వస్తున్నాయంటే మాస్‌ ప్రేక్షకులు పండగ చేసుకునేవారు. కానీ రానురానూ తన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొడుతూ వస్తుండటంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇలాంటి సమయంలో పూరీ.. తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొందరు వీరిద్దరిపైనా విరుచుకుపడ్డారు.ఫ్లాప్‌ డైరెక్టర్‌తో సినిమాకెరీర్‌లో టాప్‌ రేంజ్‌లో ఉన్న నువ్వు ఫ్లాప్‌ డైరెక్టర్‌తో పని చేయడం అవసరమా? అని విజయ్‌ సేతుపతిని తిట్టిపోస్తున్నారు. ఇండస్ట్రీలో నీ పని అయిపోయింది.. ఇంకా సినిమాలు చేయడం అవసరమా? అని పూరీ జగన్నాథ్‌ను సైతం విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై తమిళ స్టార్‌ డైరెక్టర భాగ్యరాజ్‌ తనయుడు, నటుడు శాంతను భాగ్యరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.తక్కువ అంచనా వేయొద్దుఎదుటివారి గురించి తప్పుగా మాట్లాడకండి. పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అసభ్య పదజాలం అసలే వాడొద్దు. ఆయనొక పేరు పొందిన దర్శకుడు, నిర్మాత. సినిమా ఇండస్ట్రీలో ఎదుటి వ్యక్తుల్ని గౌరవించడం నేర్చుకోండి అని ట్వీట్‌ చేశాడు. ఏదో రెండు సినిమాలు బాలేనంత మాత్రాన ఆయన్ను తక్కువ అంచనా వేయొద్దని కొందరు రిప్లై ఇస్తుంటే రేపు ఈ కాంబినేషన్‌తో వచ్చిన సినిమా ఫ్లాప్‌ అయితే ఏం చేస్తావ్‌ అని ప్రశనిస్తున్నారు. మరికొందరేమో ఈ ప్రాజెక్టులో నువ్వు కూడా భాగమయ్యావా? అని శాంతనును ప్రశ్నిస్తున్నారు. Never say that about someone brother… Please use words wisely on public platform… eod he is a reputed filmmaker and there’s a certain amount of respect we shud give another person ..Did not expect this from you https://t.co/Ieapsl1N49— Shanthnu (@imKBRshanthnu) March 30, 2025 చదవండి: హారర్‌ ఆహ్వానం

Punjab Kings beat Lucknow Supergiants by 8 wickets9
పంజాబ్‌ ఫటాఫట్‌

లక్నో: కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో ఐపీఎల్‌ 18వ సీజన్‌లో అడుగు పెట్టిన పంజాబ్‌ కింగ్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించి గెలిచింది. 171 వద్ద స్కోరు సమమైనపుడు లక్నో బౌలర్‌ అబ్దుల్‌ సమద్‌ వేసిన బంతిని కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (30 బంతుల్లో 52 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) సిక్స్‌గా మలిచి పంజాబ్‌ కింగ్స్‌ను విజయతీరానికి చేర్చాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (34 బంతుల్లో 69; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) లక్నో బౌలర్ల భరతం పట్టి మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. ప్రభ్‌సిమ్రన్‌ అవుటయ్యాక వచ్చిన నేహల్‌ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడటంతో పంజాబ్‌ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రిషభ్‌ పంత్‌ సారథ్యంలోని లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు సాధించింది. అర్ష్ దీప్ ‌ సింగ్‌ (3/43) మూడు కీలక వికెట్టు పడగొట్టగా... మ్యాక్స్‌వెల్, ఫెర్గూసన్, యాన్సెన్, చహల్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. లక్నో జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో టాప్‌–3 బ్యాటర్లను కోల్పోయింది. మిచెల్‌ మార్ష్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా... పంత్‌ 2 పరుగులతో నిరాశపరిచాడు. క్రీజులో నిలదొక్కుకున్న దశలో మార్క్‌రమ్‌ను ఫెర్గూసన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత పూరన్‌ (30 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్‌ బదోని (33 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆటతో లక్నో స్కోరు 100 దాటింది. చివర్లో సమద్‌ (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించడంతో లక్నో జట్టు ప్రత్యర్థి కి గౌరవప్రద లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో ఆరంభంలోనే ఆర్య వికెట్‌ కోల్పోయినా పంజాబ్‌ వెనక్కి తగ్గలేదు. లక్నో బౌలర్లపై ప్రభ్‌సిమ్రన్, అయ్యర్‌ ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగెత్తించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్‌ కళ్లు చెదిరే షాట్‌లతో అలరించాడు. శార్దుల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో 4,6 కొట్టిన ప్రభ్‌సిమ్రన్‌... రవి బిష్ణోయ్‌ వేసిన ఆరో ఓవర్లో 4,4,6తో మెరిశాడు. అదే జోరులో 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్‌ తొలి బంతికి ప్రభ్‌సిమ్రన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దిగ్వేశ్‌ వేసిన బంతిని డీప్‌ మిడ్‌వికెట్‌ వైపు ప్రభ్‌సిమ్రన్‌ షాట్‌ ఆడగా... ఆయుశ్‌ బదోని క్యాచ్‌ తీసుకొని బౌండరీ లైను వద్ద బ్యాలెన్స్‌ కోల్పోయి బంతిని గాల్లోకి విసిరాడు. డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ వద్ద నుంచి వచ్చిన రవి బిష్ణోయ్‌ గాల్లో ఉన్న బంతిని పట్టుకోవడంతో ప్రభ్‌సిమ్రన్‌ పెవిలియన్‌ చేరుకున్నాడు. ప్రభ్‌సిమ్రన్‌ వెనుదిరిగాక వచ్చిన నేహల్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో పంజాబ్‌ 17వ ఓవర్లోనే విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (బి) ఫెర్గూసన్‌ 28; మిచెల్‌ మార్ష్ (సి) యాన్సెన్‌ (బి) అర్ష్ దీప్ ‌ సింగ్‌ 0; నికోలస్‌ పూరన్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) చహల్‌ 44; రిషభ్‌ పంత్‌ (సి) చహల్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 2; ఆయుశ్‌ బదోని (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) అర్ష్ దీప్ ‌ సింగ్‌ 41; డేవిడ్‌ మిల్లర్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (బి) యాన్సెన్‌ 19; అబ్దుల్‌ సమద్‌ (సి) ఆర్య (బి) అర్ష్ దీప్ ‌ సింగ్‌ 27; శార్దుల్‌ ఠాకూర్‌ (నాటౌట్‌) 3; అవేశ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–1, 2–32, 3–35, 4–89, 5–119, 6–166, 7–167. బౌలింగ్‌: అర్ష్ దీప్ ‌ సింగ్‌ 4–0–43–3, ఫెర్గూసన్‌ 3–0–26–1, మ్యాక్స్‌వెల్‌ 3–0–22–1, మార్కో యాన్సెన్‌ 4–0–28–1, స్టొయినిస్‌ 2–0–15–0, యుజువేంద్ర చహల్‌ 4–0–36–1. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాంశ్‌ ఆర్య (సి) శార్దుల్‌ ఠాకూర్‌ (బి) దిగ్వేశ్‌ రాఠి 8; ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) రవి బిష్ణోయ్‌ (బి) దిగ్వేశ్‌ రాఠి 69; శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 52; నేహల్‌ వధేరా (నాటౌట్‌) 43; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–26, 2–110. బౌలింగ్‌: శార్దుల్‌ ఠాకూర్‌ 3–0–39–0, అవేశ్‌ ఖాన్‌ 3–0–30–0, దిగ్వేశ్‌ రాఠి 4–0–30–2, రవి బిష్ణోయ్‌ 3–0–43–0, మణిమారన్‌ సిద్ధార్థ్‌ 3–0–28–0, అబ్దుల్‌ సమద్‌ 0.2–0–6–0. ఐపీఎల్‌లో నేడుబెంగళూరు X గుజరాత్‌వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Rasi Phalalu: Daily Horoscope On 02-04-2025 In Telugu10
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.చవితి ఉ.7.33 వరకు, తదుపరి పంచమి తె.5.25 (తెల్లవారితే గురువారం), నక్షత్రం: కృత్తిక ప.1.50 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: తె.4.54 నుండి 6.24 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.27 వరకు, అమృతఘడియలు: ఉ.11.34 నుండి 1.06 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.59, సూర్యాస్తమయం: 6.09. మేషం...... రుణఒత్తిడులు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. అనుకోని‡ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.వృషభం..... కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.మిథునం.... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఒప్పందాల్లో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. శ్రమకు ఫలితం అంతగా ఉండదు.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.సింహం.... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.కన్య.... బంధువులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. తీర్థయాత్రలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. .తుల.... పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు.దూరప్రయాణాలు .వృశ్చికం... నూతన ఉద్యోగయోగం. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.ధనుస్సు.... కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార , ఉద్యోగాలలో పురోగతి.మకరం... మిత్రులతో మాటపట్టింపులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఆధ్యాత్మిక చింతన.కుంభం... వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. కుటుంబసభ్యులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.మీనం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వృత్తి,వ్యాపారాలలో ముందడుగు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement