ప్రజా సంక్షేమానికి పెద్దపీట
– బూత్ కమిటీల నిర్మాణానికి పాటుపడాలి
– పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలి
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు
కర్నూలు(టౌన్): ప్రజా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అనా్నరు. హోదా కంటే ఎక్కువగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెపా్పరు. మంగళవారం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న తనీష్ కన్వెన్షన్ సమావేశ హాలులో ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ముందుగా పండిత దీన్‌దయాళ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ పెద్ద నోట్లర ద్దుతో చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా దేశ ప్రజలు అండగా నిలిచారని చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఉగ్రవాదం, తీవ్రవాదం, నకిలీ కరెన్సీ తగ్గుముఖం పట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 90 శాతం నిధులు కేటాయించిందన్నారు. అలాగే వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి ఏడాదికి రూ. 50కోట్ల చొప్పున నిధులు ఇస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం కొంత మంది చేసే హోదా ఉద్యమాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ కమిటీలను నియమించాలని సూచించారు.
సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు హరీష్ బాబు, పార్టీ కేంద్ర కమిటీ సంఘటన కార్యదర్శి సతీష్, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసు, పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, కంతెటి సత్యనారాయణ, మాజీ మంత్రులు పురందేశ్వరీ, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందడి సుధాకర్, రంగస్వామి, యోగనంద్‌చౌదరి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.