స్వప్రయోజనాల కోసమే ప్యాకేజీ
Published Tue, Feb 7 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
ఏలూరు (సెంట్రల్) : సీఎం చంద్రబాబు రాజకీయ, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి ప్యాకేజీలకు ఆహ్వానం పలుకుతున్నారని, ప్యాకేజీలకు చట్టబద్ధత ఉందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నిం చారు. శ్రీకాకుళం జిల్లా నుంచి చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర ఆదివారం రాత్రి ఏలూరు చేరుకుంది. సోమవారం ఉదయం స్థానిక సీపీఐ కార్యాలయంలో రామకృష్ణ విలేకరులతో మా ట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగి పోతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలంతా హోదా కోసం పోరాడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం పోలీసులతో ఉద్యమాన్ని అణచివేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. త్వరలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబుపై ఇద్దరు మోసగాళ్లు అనే సినిమా వస్తుందని హేళన చేశారు. కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి నిధులు కేటాయించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 9 నుంచి విశాఖలో నిరాహార దీక్ష చేయనున్నట్టు రామకృష్ణ ప్రకటించారు.
ఇది కాంట్రాక్ట్, అవినీతి ప్రభుత్వం
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్, అవినీతి ప్రభుత్వమని రామకృష్ణ అన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకునే పనిలో ఉంటూ కోట్లు సంపాదిస్తున్నారని, కొందరు రౌడీల్లా ప్రవర్తిస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శిం చారు. రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలు, గిరిజనులకు స్థానం కల్పించిన తర్వాతే లోకేష్‌కు స్థానం కల్పించాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారంటే అవినీతి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. చివరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. నాయకులు జేవీ సత్యనారాయణ, జి.ఓబులెస్, డేగా ప్రభాకర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement