ప్యాకేజీ కోసం టీడీపీ రాజీ
ప్యాకేజీ కోసం టీడీపీ రాజీ
Published Sat, Oct 1 2016 1:27 AM | Last Updated on Sat, Aug 11 2018 2:53 PM
నెల్లూరు సిటీ: చిల్లర ప్యాకేజీల కోసం కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ రాజీపడిందని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మండిపడ్డారు. ఇందిరాభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. హోదా కాదు, ప్యాకేజీ చాలని టీడీపీ చెప్పడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో 600 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ, వాటిని అమలు చేయడంలో కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలను అమలు చేస్తూ, ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను సాధించేంత వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. అక్టోబర్ 14వ తేదీన నెల్లూరు నగరంలో టీడీపీ 600 హామీలు, ప్రత్యేక హోదాపై బ్యాలెట్‌ను నిర్వహించనున్నామని వివరించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో బ్యాలెట్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీవీ శేషారెడ్డి, దేవకుమార్‌రెడ్డి, భవానీ నాగేంద్రప్రసాద్, చెంచలబాబుయాదవ్, పత్తి సీతారామ్‌బాబు, ఫయాజ్, ఆసిఫ్ బాషా, బాలసుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement