సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్ధలను పటిష్టం చేసేందుకు కేంద్ర నిధులతో ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజ్ కింద రాష్ట్రాలకు కేంద్రం రూ 15,000 కోట్లు సమకూరుస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి 2024 మార్చి వరకూ మూడు దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ వందన గుర్నానీ వెల్లడించారు.
ఎమర్జెనీ కోవిడ్-19 రెస్పాన్స్ నిధులతో వ్యాధి నివారణ, సన్నద్ధతలను పరిపుష్టం చేయడం, అత్యవసర వైద్య పరికరాల సేకరణ, మందుల సేకరణ, లేబొరేటరీల ఏర్పాటు, బయో సెక్యూరిటీ సన్నద్ధత వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఓ ప్రకటనలో గుర్నానీ పేర్కొన్నారు. ఈ ప్యాకేజ్‌లో తొలి దశ అమలు జూన్ వరకూ కొనసాగుతుందని అన్ని రాష్ట్రాల వైద్య శాఖ సంచాలకులు, కమిషనర్లను ఉద్దేశించి పంపిన ఉత్తర్వుల్లో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment