సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఇంతవరకు వివిధ రూపాల్లో రూ.1,400 కోట్లకు పైగానే ప్యాకేజీ అందిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. రాజకీయ పొత్తుల వ్యవహారంలో భాగంగానే ఆయన ఈ సొమ్ము అందుకున్నారని.. ఈ మొత్తాన్ని ఇప్పటికే హవాలా ద్వారా పవన్ బినామీలకు చేరిందన్నారు. కాకినాడలో శనివారం ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ ప్యాకేజీ మాట్లాడుకుని పెద్దఎత్తున సొమ్ములు తీసుకున్నారని తాను చేస్తున్న ఆరోపణలకు ఇప్పటికీ, ఎప్పటికీ కట్టుబడే ఉంటానన్నారు. అలా వచ్చిన రూ.1,400 కోట్లను రష్యా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు తరలించేశారన్నారు.
ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీని కూడా కలుపుకుని వెళ్తామని పవన్ పదేపదే చెబుతుండటం వెనుక పెద్ద కారణమే ఉందన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తనపై కాకినాడ సిటీలో గ్లాస్ గుర్తుపై అభ్యర్థిని పోటీలో పెట్టలేకపోతే ఆ క్షణాన్నే పవన్ రాజకీయంగా ఓటమి చెందినట్లు భావిస్తానని ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారం చేయడం, ఆ తరువాత టీడీపీ శాశ్వతంగా మూతపడడం రెండూ ఒకేసారి జరుగుతాయని ద్వారంపూడి చెప్పారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు దేశంలోనే మరొకరు లేరని.. అలాంటిది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తోందంటూ లోకేశ్ విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. చీకట్లో చిదంబరం వంటి నేతలను కలవడం, నిన్నమొన్నటి వరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో సంబంధాలు.. వెంకయ్యనాయుడు వంటి వ్యక్తులతో సాగించిన చీకటి రాజకీయాలు ప్రజలకు తెలియనివి కావన్నారు. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు పరిస్థితులు కలిసి రాకపోవడంలేదనే అక్కసుతోనే లోకేశ్ ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని ద్వారంపూడి మండిపడ్డారు.
బాబుకు ఇక అధికారం దక్కదు
మంత్రి గుడివాడ అమర్‌నాథ్
అనకాపల్లి టౌన్: చంద్రబాబు తన జీవితకాలంలో మళ్లీ అధికారంలోకి రాలేరని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. మండలంలోని మార్టూరు గ్రామంలో ‘ఏపీకి జగన్ కావాలి’ కార్యక్రమ సన్నాహక సమావేశం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద ఆధ్వర్యంలో శనివారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజం చేకూర్చలేదన్నారు. అదే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలుచేశారన్నారు. చంద్రబాబు వివిధ నేరాల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లాడని, ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా నమ్ముతోంది కాబట్టే ఆయనకు బెయిల్ ఇవ్వటంలేదన్నారు. ఇక పవన్‌కళ్యాణ్‌కు పార్టీ నడిపే దమ్ములేదని, ఒంటరిగా పోటీచేసే సత్తాలేదని అందుకే టీడీపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారని అమర్‌నాథ్ విమర్శించారు.
ప్రజలనే అవినీతిపరులంటావా?
పవన్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్
కార్వేటినగరం(చిత్తూరు జిల్లా): స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికి జైలుపాలైన చంద్రబాబు అవినీతిపరుడు కాదని, అమాయకులైన ప్రజలే అవినీతిపరులంటున్న పవన్‌కళ్యాణ్‌కు ప్రజాకోర్టులో పరాజయం తప్పదని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి అన్నారు. శనివారం ఆర్కేవీబీపేటలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఒక అవినీతి చక్రవర్తి అని, ప్రజాధనాన్ని దోచుకున్న ఆయన్ను అరెస్ట్ చేస్తే దత్తపుత్రుడు రోడ్లపై దొర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అరెస్టుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు, కాంగ్రెస్‌లో ఉన్న రేణుకాచౌదరికి సంబంధమేంటని ప్రశ్నించారు. తన తండ్రి ఎన్టీఆర్ మృతికి చంద్రబాబే కారణమన్న పురందేశ్వరి.. నేడు చంద్రబాబు అరెస్ట్‌తో మరిదిపై ప్రేమ వలకబోస్తున్నారని ధ్వజమెత్తారు. పురందేశ్వరి, తన భర్త వేంకటేశ్వరరావులు తెలుగుదేశాన్ని వదిలి బీజేపీలో ఎందుకు చేరారో చెప్పాలని ప్రశ్నించారు.
తప్పు చేస్తే.. చట్టం ఎవరినీ వదలదు
మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): తప్పు చేస్తే చట్టం ఎవరినీ వదలదని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల విచారణలోనే ముందుగా చంద్రబాబు బాగోతం బట్టబయలయిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. బాబుపై అక్రమంగా కేసు నమోదు చేశామని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతుందని, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలే బాబు అవినీతిపరుడని తేల్చాయన్నారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ కాలనీలో శనివారం వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడారు.
చంద్రబాబు కొన్ని షెల్ కంపెనీలు సృష్టించి డబ్బులు దోచుకున్నాడని చెప్పారు. అవినీతిలో ముఖ్యపాత్ర పోషించిన చంద్రబాబు, లోకేశ్ పీఏలు ఇద్దరూ అమెరికాకు పారిపోయారని తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ సీఎంలు జయలలిత, లాలూ ప్రసాద్‌యాదవ్ తదితరులంతా కోర్టుల ముందు నిలబడినవారేనని, బాబు ఏమైనా పైనుంచి దిగొచ్చారా.. అని ప్రశ్నించార‡ు.
Comments
Please login to add a commentAdd a comment