సాక్షి, కాకినాడ: ఏపీకి అమావాస్య, పున్నానికి వచ్చి మైకులు పట్టుకున్న వారికి వాలంటర్లీ గురించి ఏమాత్రం తెలుస్తుంది అంటూ పవన్‌కు చురకలు అంటించారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏసీ రూమ్స్‌లో కూర్చున్న చంద్రబాబు, పవన్‌కు వాలంటీర్ల గురించి ఏం తెలుసు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
కాగా, కాకినాడలో వాలంటీర్ల ఆత్మగౌరవ సభకు ఎమ్మెల్యే ద్వారంపూడి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ.. మేము ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ సైనికులం.. వాలంటీర్లు ప్రభుత్వ సైనికులు. గడపగడపకు వెళ్లినప్పుడు లబ్ధిదారులు వాలంటీర్ల పేర్లు చెబుతున్నారు. అమావాస్య, పున్నమికి వచ్చి మైకులు పట్టుకున్న వాళ్లకి వాలంటీర్ల గురించి ఏమాత్రం తెలుస్తుంది. సీఎం జగన్ సైన్యం మీకు గుర్తింపు ఉండేలా రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు.
వాలంటీర్ల సేవేంటో మాకు తెలుసు. ఏసీ రూమ్స్‌లో కూర్చున్న చంద్రబాబు, పవన్‌కు ఏం తెలుసు. వారాహి ఎక్కి ప్రజలకు ఏం చేస్తాడో పవన్ చెప్పడం లేదు. వాలంటీర్ల వల్లే ప్రజలకు ఇంటివద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రతిపక్ష నేతలకు కక్షగా ఉంది. వాలంటీర్ల మనోభావాలు కాపాడే బాధ్యత సీఎం జగన్ తీసుకుంటారు. ఎవరెన్ని మాట్లాడినా వాలంటీర్లు బాధపడవద్దు.. రాబోయే రోజులు మీవే. వాలంటీర్లు లేకపోతే ఇబ్బందిపడే పరిస్థితి ఉంది అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: మన పిల్లలు క్రియేటర్లు, లీడర్లుగా మారాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment