ఆశ.. శ్వాస.. హోదా | Where andhra pradesh support, dependence special status? | Sakshi
Sakshi News home page

ఆశ.. శ్వాస.. హోదా

Published Fri, Sep 11 2015 8:17 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఆశ.. శ్వాస.. హోదా - Sakshi

ఆశ.. శ్వాస.. హోదా

‘‘ప్రత్యేక హోదా కాకుంటే.. ప్యాకేజీ.. హోదా కంటే ఎక్కువే డబ్బులొస్తాయట. ఎందుకు కాదనాలి?..’’ ముఖ్యమంత్రి సహా కొందరు పెద్దల నోటి నుంచి రాలుతున్న ముత్యాలివి. ఈ మాటల గారడీకి మోసపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పయనం తీవ్ర ఒడిదుడుకులకు లోనుకాక తప్పదని మేధావులు హెచ్చరిస్తున్నారు. ప్యాకేజీ పేరుతో ఇవ్వజూపే నిధులపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధమైన హక్కుంది. విభజన గాయాలను మాన్పగల మంత్రం కేవలం ప్రత్యేక హోదా మాత్రమే.

హోదా వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక పునాదులు లేస్తాయి. ఉపాధికి బాటలు వేస్తాయి. రాష్ట్ర ప్రగతికి ఇప్పుడు ప్రత్యేక హోదానే రాచమార్గమని నిపుణులు చెబుతున్నారు. ‘ప్రత్యేకమైన హోదా’తో తలెత్తుకుని నిలబడదామని పిలుపునిస్తున్నారు.
 
* ఏపీకి ఆసరా, ఆలంబన ప్రత్యేక హోదానే  
* అది చట్టబద్ధమైన హక్కు
సాక్షి, హైదరాబాద్: మాట.. మంత్రం.. ప్రత్యేక హోదానే. అభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు మార్గం అదొక్కటే. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్యాకేజీని తెర మీదకు తీసుకురావడం.. రాష్ట్ర విభజన అంతటి నిర్హేతుక, అశాస్త్రీయ వాదన. ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి తలిస్తే.. కేంద్రం మరొకటి చేసింది.

ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రాష్ట్ర విభజన చేసింది. కనీసం రాజధాని కూడా లేకుండా 13 జిల్లాలతో నూతన ఆంధ్రప్రదేశ్ నిర్హేతు క ఆవిర్భావం జరిగింది. ఫలితంగా పారిశ్రామికంగా దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. బాగా వెనుకబడిపోయింది. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అభివృద్ధికి బాటలు పడతాయి. మరి పరిశ్రమలను ఆకర్షించడం ఎలా?

అసలే ఆర్థిక లోటుతో అల్లాడుతున్న రాష్ట్రం.. మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా ఖర్చు చేయడం సాధ్యమా? విభజన బిల్లు మీద రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు.. పెద్దల సభ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్.. రాష్ట్రానికి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చాల్సిన అవసరం లేదని, ప్రధానమంత్రిగా హామీ ఇస్తున్నాననీ స్పష్టం చేశారు.

ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని బీజేపీ నేత, ఇప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సభలో గట్టిగా పట్టుబట్టారు. ఆ తర్వాత జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తూ తీర్మానించింది. అ తర్వా త ఎన్నికలు రావడం, ప్రభుత్వాలు మారిపోవడం జరిగిపోయింది. ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న బీజేపీ అధికార పీఠాన్ని అధిష్టించిం ది. కాలం గిర్రున తిరిగి ఏడాదిన్నర గడిచిపోయింది.

కానీ ప్రత్యేక హోదా హామీ వాస్తవరూ పం దాల్చలేదు. గట్టిగా కేంద్రాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. మీనమేషాలు లెక్కబెడుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ప్యాకేజీ ఇచ్చినా సరిపోతుందం టూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హోదా కోసం పట్టుబట్టి సాధిస్తే రాష్ట్రం జాతకమే మారిపోతుందంటూ మేధావులు, వివిధ రంగాల నిపుణులు చెబుతున్నా.. ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు.

యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం వస్తుందని, ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలిగితే సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయవచ్చని చెబుతున్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగం కావాలన్నా, స్వయం ఉపాధితో సొంత కాళ్ల మీద నిలబడాలనుకుంటున్న వారికి చేయూత లభించాలన్నా, సంక్షేమ పథకాల సమర్థ అమలుతో సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నా, విభజన కష్టాల నుంచి గట్టెక్కి అన్ని రంగాల్లో వృద్ధి బాట పట్టాలన్నా.. కేంద్రం ఆసరా తప్పనిసరి.

ప్యాకేజీలతో నామమాత్రంగా విదిలించే నిధులను నమ్ముకోవడం కంటే భారీ ప్రోత్సాహకాలు, గ్రాంట్లు లభించే ప్రత్యేక హోదా సాధించుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. హోదాకు ప్యాకేజీ అదనంగా ఉండాలే తప్ప.. ప్రత్యామ్నాయంగా ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చడానికి ఇటూ నిధులు ఇవ్వాల్సిందే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాలను ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ లోపల, వెలుపల పలుమార్లు వివరించారు. రాష్ట్రానికి హోదా ఊపిరి పోస్తుందని చెప్పారు.
 
ఒనగూడే ప్రయోజనాలెన్నో..
సాధారణ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 30 శాతం దాటవు. మిగతా 70 శాతాన్ని రాష్ట్రాలే భరించాలి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం గ్రాంట్లుగా కేంద్ర సాయం అందుతుంది. మిగతా 10 శాతాన్ని రాష్ట్రం భరిస్తే సరిపోతుంది. అదీ  సమకూర్చుకోవడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే.. కేంద్రమే సమకూరుస్తుంది. గ్రాం ట్లుగా ఇచ్చే సాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సత్వర సాగునీటి ప్రయోజనం(ఏఐబీపీ) కింద మంజూరైన ప్రాజెక్టులకూ ఇది వర్తిస్తుంది. 90 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుంది.

* పారిశ్రామిక యూనిట్లకు నూటికి నూరు శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. దీంతో  పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు ముందుకు వస్తారు. పారిశ్రామిక వృద్ధి వేగవంతం కావడానికి ఇది దోహదం చేస్తుంది.

* ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-80(సి) కింద కార్పొరేట్ ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు ఇవ్వడానికి ప్రత్యేక హోదా అవకాశం కల్పిస్తుంది. హోదా ఉన్నం త కాలం.. ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు ఉంటుంది. తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 25-50 శాతం మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది.

* ప్లాంటు, యంత్రాల మీద పెట్టే పెట్టుబడిలో 30 శాతం రాయితీ లభిస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాత విస్తరణ చేపట్టే పాత పరిశ్రమలకూ ఇది వర్తిస్తుంది. ఔత్సాహికులు సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిర్ణయాలు దోహ దం చేస్తాయి. మధ్య, చిన్న తరహా పరిశ్రమలు విరివిగా ఏర్పాటుకు ఇలాంటి రాయితీలు పనికొస్తాయి.సపరిశ్రమల స్థాపన కోసం తీసుకునే వర్కింగ్ కేపిటల్‌పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.సపరిశ్రమలకు 20 ఏళ్లకు తగ్గకుండా విద్యుత్ ఛార్జీలపై 50 శాతం రాయితీ ఇస్తుంది. ఇవి కాకుండా ఇన్సూరెన్స్, రవాణా వ్యయంపైనా రాయితీలు ఉంటాయి.

* పోత్సాహకాలు, పన్ను రాయితీలు ఉంటే ప్రతిష్టాత్మక పారిశ్రామిక సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి రావడానికి మార్గం ఉంటుంది.నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  గణనీయంగా మెరుగుపడుతుంది.

* విదేశీ రుణాల భారాన్ని కేంద్రమే భరిస్తుంది. రుణంలో 90 శాతం కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది. వడ్డీనీ కేంద్రమే భరిస్తుంది. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు రూ.5,000 కోట్ల రుణాన్ని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి తీసుకోవాలనే ప్రతిపాదన ఉంది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైళ్ల ప్రాజెక్టుకు దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ రెండు ప్రాజెక్టులకు కూడా విదేశీ ఏజెన్సీల నుంచి రుణం పొందనున్నారు.

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ, విజయవాడ మెట్రో రైళ్లు.. విభజన చట్టంలో ఉన్న హామీలే. 90 శాతం రుణం కేంద్రమే భరిస్తే.. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం లభిస్తుంది. భారీగా ఉద్యోగాలూ వస్తాయి. కారిడార్ వెంబడి అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఉపాధి  యువత ముందుకు వస్తుంది.స    కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసే సమీకృత మౌలిక సదుపాయాల కల్పన కేంద్రాల ఏర్పాటులో పెట్టుబడుల తీరును ప్రత్యేక హోదా మారుస్తుంది.

సాధారణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే కేంద్ర, రాష్ట్ర పెట్టుబడుల నిష్పత్తి 2:3 ఉంటుంది. హోదా ఉంటే.. 4:1 నిష్పత్తిలో ఉంటుంది. ఫలితంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ పెట్టుబడితో  కేంద్రాలు ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వస్తాయి. తక్కువ నైపుణ్యం ఉన్న వారికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో ఈ పరిశ్రమలు దోహదం చేస్తాయి.

* ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును కేంద్రం ప్రోత్సహిస్తోంది.వీటికి రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. హోదా దక్కితే.. ప్రోత్సాహకాలు, రాయితీలు పెరుగుతాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం ఏర్పడుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా పరిశ్రమలు భారీగా వస్తాయి.గ్రామీణ యువతకు,మహిళలకు ఉపాధి పెరుగుతుంది.
 
కేంద్ర పథకాలు
ఇటీవలి కాలంలో 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రాయోజిత పథకాలను కొన్నింటిని తొలగించినప్పటికీ ఇప్పటికీ అనేక పథకాలు కేంద్రం అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు చేసే ఒత్తిడి మేరకు వాటి కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉంటున్నాయి. ఇందులో కనిష్టంగా ఏటా రూ.9 వేల కోట్లకు తగ్గకుండా ఆయా పథకాల కోసం కేంద్రం కేటాయిస్తోంది. రాష్ట్రం ఒత్తిడి చేస్తే రూ.15 వేల కోట్లకు తగ్గకుండా ప్రయోజం పొందడానికి వీలుంది. కనిష్టంగా లెక్కలేసినా ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల మేరకు రాష్ట్రానికి విధిగా కేంద్రం నుంచి నిధులు రావలసి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
 
2 లక్షల కోట్లు రావాల్సిందే
రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో నష్టం జరగ్గా, ఆ నష్టాన్ని పూడ్చడానికి పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతో పాటు అనేక వాగ్దానాలు చేశారు. ఆ హామీలిచ్చి ఏడాదిన్నర కావొస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ రాజీధోరణి, మెతకవైఖరి, సాగిలబడుతున్న వైనంతో ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు.

ప్రత్యేక హోదా కావలసిందేనంటూ రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజలను మరోసారి మోసం చేయడానికి కసరత్తు ప్రారంభమైనట్టు చెబుతున్నారు. రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఏడాదిన్నర కిందట ఇచ్చిన హామీలన్నింటినీ ఒకచోట కూర్చి వాటికి ఎంత ఖర్చవుతుందో లెక్కతీసి దాన్నే ఒక ప్యాకేజీగా ప్రకటించడానికి ప్రయత్నాలు ముమ్మరమైనట్టు విశ్వసనీయ సమాచారం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటి ని నెరవేర్చడానికి వాటన్నింటికీ లక్షా 50 వేల కోట్ల రూపాయల మేరకు వ్యయం అవుతుందని అంచనా.

వీటికి తోడు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే కేంద్రం నుంచి ఆయా పథకాలకు లభించే నిధులను కలిపితే వచ్చే అయిదేళ్ల కాలంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేరకు రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. అయితే వీటినే అటు తిప్పి... ఇటు తిప్పి... దీనికి కొంచెం అటుఇటుగా కేంద్రం నుంచి ఒక ప్యాకేజీ ఇస్తున్నట్టు ప్రకటన చేయించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తద్వారా ప్రత్యేక హోదా నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వీలవుతుందని ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ నివేదిక సమర్పించింది.

ఇవి కేవలం విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు సంబంధించినవే. ఇప్పటికే ఆ నిధులు మంజూరు కావలసి ఉంది. చట్టం చేయడం ద్వారా హక్కుగా లభించిన హామీలకు గడిచిన ఏడాదిన్నర కాలంగా ఒక్క శాతం కూడా నెరవేరలేదు. ఈ నిర్లక్ష్య ధోరణులపై ప్రజల్లో పెద్దఎత్తున నిరసన లు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్యాకేజీ పేరు తో కొత్త ఎత్తుగడను తెరమీదకు తెచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ముందు ఇప్పుడు ఎలాంటి అడ్డం కులు లేవు.రాజకీయ సంకల్పంతో ప్రత్యేక హోదా ఇవ్వొ చ్చు. దాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 15 నెలలుగా కేంద్రంపై ఒత్తిడి చేయడంలో పూర్తిగా విఫలమైంది.విభజన చట్టంలో... : రాష్ట్రాన్ని విభజించినప్పుడు చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ చట్టంలో కేంద్రం పలు హామీలను ఇచ్చింది. చట్ట రూపంలో వచ్చిన హామీలైనందున వాటిని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేర్చాల్సి ఉంది. అయితే వాటిని ఎప్పటిలోగా నెరవేర్చాలి? వాటిని సాధించుకోవడం వంటి అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే ఒత్తిడిపై ఆధారపడి ఉంటుంది.

చట్ట రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కిన హామీల్లో కొన్ని నేరుగా (ఉదాహరణకు విద్యా సంస్థలు) ఏర్పాటు చేస్తామని, కొన్నింటిని కేంద్రమే చేపట్టి పూర్తి చేస్తామని (ఉదా. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు), మరికొన్నింటి విషయంలో సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని ఉంది. రాష్ట్రానికి రావలసిన నిధులతో వాటన్నింటిని నెరవేర్చడానికి వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు రావాలి.

రాజధాని అభివృద్ధికి....
 పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని పార్ట్ 10 సెక్షన్ 94 లో ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని ఏర్పాటు విషయంలో మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటును అందిస్తామని పేర్కొంది. అందులో సెక్షన్ 94 (3) ప్రకారం విభజిత ఏపీలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలితో పాటు ఇతర అత్యవసర మౌలిక సదుపాయల కల్పనలో ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొంది.

గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత రాజధాని మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆర్థిక సహాయం అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు కేంద్రం ముందుంచింది. రాజధానిలో కీలక నిర్మాణాల కోసం 15,175 కోట్ల మేరకు ప్రతిపాదనలు పంపింది. (ఈ మొత్తం వచ్చే ఐదేళ్ల కాలంలో సమకూర్చడానికి వీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు) వాటి వివరాలు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement