
అందరికీ ప్యాకేజీ ఇచ్చాకే ఖాళీ చేస్తాం
మణుగూరు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు కింద ఎగ్గడిగూడెం, పద్మగూడెం, కొమ్ముగూడెం, మల్లేపల్లి గ్రామాలు .............
అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు
స్పష్టం చేసిన మణుగూరు ఓసీ నిర్వాసితులు
మణుగూరు(ఖమ్మం) : మణుగూరు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు కింద ఎగ్గడిగూడెం, పద్మగూడెం, కొమ్ముగూడెం, మల్లేపల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నారుు. నిర్వాసితులందరికీ పరిహారం అందలేదు. శనివారం ఓసీ ప్రాజెక్టు అధికారి తన్నీరు వెంకటేశ్వరరావు, సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఎగ్గడిగూడెం వచ్చారు. ప్యాకేజీ తీసుకున్నవారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల ని, లేకుంటే డోజర్‌తో కూల్చేస్తామని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. గ్రామంలో ఇంకా 30 కుటుంబాలకు ప్యాకే జీ అందాల్సి ఉందని, చెల్లిస్తేనే అందరం వెళ్తామని చెప్పారు. ఈ క్రమంలో సింగరేణి అధికారులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వా దం జరిగింది. మణుగూరు సీఐ పెద్దన్నకుమార్ వచ్చి వారితో మాట్లాడారు.
ప్యాకేజీ వచ్చిన వారు వెళితే మిగిలిన వారు బిక్కుబిక్కుమంటూ భయంతో బతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాకేజీ డబ్బుతో పినపాక మండలం ఐలాపురంలో భూములు కొనుక్కుంటే ఇతరులు గుడిసెలు వేస్తున్నారని, మా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారిందని బాధితులు వాపోయూ రు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అయోధ్య మాట్లాడుతూ ఏడేళ్లుగా సింగరేణి, రెవెన్యూ అధికారులు గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారని, అందరికీ పరిహారం అందిన తర్వాతే గ్రామం ఖాళీ అవుతుందని స్పష్టం చేశారు.
మైనారిటీ తీరినా ప్యాకేజీ ఇవ్వడం లేదు
చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి అమ్మమ్మ ఎగ్గడి పుల్లమ్మ వద్దే ఉంటున్నాను. భూసేకరణ సమయంలో నా వయసు 17 ఏళ్లు ఉండడంతో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. ఇప్పుడు 22 ఏళ్లు. మైనారిటీ తీరినా ప్యాకేజీ ఇవ్వడంలేదు. - ముడిదెం నవీన్, ఎగ్గడిగూడెం