వాషింగ్టన్: కొన్నిరోజుల్లో అధ్యక్ష పదవీకాలం ముగియనుందనగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగానే ఊహించి ప్రాధాన్యమున్న పనులన్నీ చకచకా చక్కబెట్టుకుంటున్నారు.
ఈ క్రమంలోనే రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు రూ.6వేల కోట్ల భారీ మిలిటరీ ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీలో భాగంగా ల్యాండ్ మైన్లు,యాంటీ ఆర్మర్ వెపన్లను అమెరికా ఉక్రెయిన్‌కు సమకూర్చనుంది.
భవిష్యత్తులో ఉక్రెయిన్‌కు ఇలాంటి సహాయం అందకపోవచ్చనే ఆలోచనతో హుటాహుటిన ప్యాకేజీ అందిస్తున్నట్లు తెలుస్తోంది.రష్యా దాడులను అడ్డుకొని,ఉక్రెయిన్ ఆత్మరక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేలా ప్యాకేజీ ఇస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment