
ముంబై : కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై చూపే పెను ప్రభావాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన క్రమంలో స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ప్యాకేజ్‌పై అంచనాలతో ఓ దశలో ఉవ్వెత్తున ఎగిసిన సూచీలు ఆ తర్వాత ఉద్దీపన ప్యాకేజ్ కొంత నిరుత్సాహపరచడంతో ఆరంభ లాభాలను కోల్పోయాయి.
తొలుత బ్యాంకింగ్ సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 30,000 పాయింట్లు దాటి పరుగులు పెట్టింది. ఉపశమన ప్యాకేజ్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆరంభ లాభాలు కొంతమేర ఆవిరైనా సెషన్ చివరి వరకూ కొనుగోళ్ల జోరు కనిపించింది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 1410 పాయింట్ల లాభంతో 29,947 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 323 పాయింట్ల లాభంతో 8641 పాయింట్ల వద్ద క్లోజయింది.
Comments
Please login to add a commentAdd a comment