పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి | To complete the pending projects | Sakshi
Sakshi News home page

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి

Published Mon, Mar 14 2016 1:24 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి - Sakshi

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి

పాలమూరు ఎత్తిపోతల ఆగినా ఈ పనులు ఆగొద్దు
జూలైలో 2లక్షల ఎకరాలకు నీరివ్వడ మే లక్ష్యం
రూ.1950 కోట్లు సిద్ధంగా ఉన్నాయి
పనుల నిర్వహణలో అలసత్వం వద్దు
ప్రతి సోమవారం పురోగతిపై సమావేశం నిర్వహించాలి
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

 
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్  : వచ్చే జూలై నెలలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంగా యుద్దప్రాతిపదికన జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్‌రావు, పెంటారెడ్డి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావుతో కలిసి మంత్రి హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టులు, ప్యాకేజీల వారిగా ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలతో పనుల పురోగతిపై సమీక్షించారు. పాల మూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు.

95 శాతం పూర్తయి మిగతా 5శాతం పనులు పెండింగ్‌లో ఉండడం కారణంగా ప్రాజెక్టులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని, పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.1950 కోట్లు కేటాయించిందన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వడంలేదనే దష్ర్పచారం జరుగుతుందని, అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తి చేయాలన్నారు. డబ్బులు, అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పనులు సాఫీగా నిర్వహించి జూలై నెలలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి పనులు సాఫీగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ రాంకిషన్‌ను ఆదేశించారు. ప్రాజెక్టులకు నిధులు ఇచ్చినా పూర్తిచేయడంలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. ప్యాకేజీ వారీగా పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు వాట్సప్ గ్రూపులోకి రావాలని ఎక్కడ ఏ సమస్య వచ్చినా మెసేజ్ ఇవ్వాలని సూచించారు.

 గడువులోగా పూర్తిచేయకుంటే చర్యలు
నిర్ణయించిన గడువులోగా పనులు చేయకపోతే తెలంగాణలో ఎక్కడా పనులు చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలో ఈ రోజే ఎంతరాత్రయినా అధికారులకు టార్గెట్‌లు ఇచ్చి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని జిల్లా ప్రాజెక్టుల సీఈ ఖగేందర్‌ను మంత్రి ఆదేశించారు. ఇసుక సమస్య రాకుండా అసైన్డ్, పట్టా భూముల్లో అనుమతులు మంజూరు చేయాలని జేసీని ఆదేశించారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొనే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోని కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చామన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పనులు ఆగినా పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఆగొద్దని మంత్రి సూచించారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ సమక్షంలో సమావేశం నిర్వహించుకొని ప్రాజెక్టు పనుల తీరుపై చర్చించాలని ఆదేశించారు. డిండి వరకు నీరిస్తేనే కేఎల్‌ఐ పూర్తయినట్లు అని అన్నారు. అంతకుముందు ప్యాకేజీ వారిగా పురోగతిపై చర్చించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ భాస్కర్, పాలమూరు-రంగారె డ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఈ లింగరాజు, ఎస్‌ఈలు పీజేపీ రఘునాథ్‌రావు, కేఎల్‌ఐ భద్రయ్య, పీఆర్‌ఎల్ నర్సింహ, ఈఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement