Minister harishravu
-
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయూలి
► మంత్రి హరీష్‌రావు విధానాలు హర్షణీయం ► ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య పాలకుర్తి : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను బ లోపేతం చేసిన తర్వాతనే రేషనలైజేషన్ చే యాలని ప్రముఖ విద్యా వేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. గూడూరు గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం జరిగిన 40వ వార్షికోత్సవ వేడుకలకు చుక్కా రామయ్య హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ప్రభుత్వ హైస్కూల్లో చదివే బాలబాలికలు రక్తహీనత సమస్యతో భాదపడుతున్నారని, వారికి ఏడాదిలో ఒక సారైనా వై ద్య పరీక్షలు చేయించాలని సూచించారు. వి ద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచినప్పుడే బడుగు వర్గాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నాణ్యమైన విద్యను అందించి విద్యావంతులను తయారుచేసినప్పుడు విదేశీ కంపెనీలు వాటంతట అవే మన రాష్ట్రానికి తరలివస్తాయని అన్నారు. సామాన్య రైతు నిలదొక్కుకునే విధంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అమలు చేస్తున్న విధానాలు హర్షణీయమని అన్నారు. మిషన్ కాకతీ య, వాటర్ గ్రిడ్ పథకాలు అమలు వల్ల గ్రా మీణ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సర్పంచ్ మాచర్ల పుల్లయ్య, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు ఉన్నారు. -
కార్మికులు నాయకత్వాన్ని నేర్పారు
► జీవిత కాలం ఆర్టీసీ కార్మికులకు రుణపడి ఉంటా ► ప్రజల మధ్య ఎలా ఉండాలో నేర్చుకున్నాను ► మేయర్, టీఎంయూ గౌరవాధ్యక్షుడు నరేందర్ హన్మకొండ : ఆర్టీసీ కార్మికులు తనకు నాయకత్వాన్ని నేర్పారని వరంగల్ మేయర్, టీఎంయూ వరంగల్ రీజియన్ గౌరవాధ్యక్షుడు నన్నపునేని నరేం దర్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని జిల్లా బస్‌స్టేషన్‌లో టీఎంయూ ఆధ్వర్యంలో మేయర్ నన్నపునేని నరేందర్ సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు అండదండలతో టీఎంయూ రీజియన్ గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానన్నారు. గౌరవాధ్యక్షుడిని కావడం వలన ప్రజల మధ్యఎలా ఉండాలో నేర్చుకున్నాని చెప్పారు. తాను కార్పొరేటర్‌గా గెలిచేందుకు ఆర్టీసీ కార్మికులు ఎంతగానో శ్రమించారని తెలిపారు. అందుకే జీవిత కాలం ఆర్టీసీ కార్మికులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. వరంగల్ రీజియన్‌లో టి. మజ్దూర్ యూనియన్ బలంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ టీఎంయూకు వెన్నుదన్నుగా ఉన్నారన్నా రు. పేదింటి బిడ్డను గుర్తించి తనను సీఎం కేసీఆర్ మేయర్‌ను చేశారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఎంయూ పై ప్రత్యర్థులు కావాలని దుష్ర్పచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. వచ్చే గుర్తింపు ఎన్నికలు ఏకపక్షంగా జ రుగుతాయని, వరంగల్ రీజియన్‌లోని అన్ని డి పోల్‌లో టీఎంయూ గుర్తింపును పొందుతుందనే ధీమా వ్యక్తం చేశారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథామరెడ్డి మాట్లాడుతూ టీఎం యూకు పెద్ద దిక్కుగా నిలిచి నిస్వార్థంగా సేవ చేసినందునే మేయర్‌గా అవకాశం వచ్చిందన్నారు. ప్రజలకు చక్కని పాలన అందించి ప్రజ ల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు థామస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంప్లాయూస్ యూనియన్ మొత్తం తుడుచుకు పెట్టుకుపోయిందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్, ప్రముఖ మెజీషియన్ జూలకుంట్ల శ్రీనివాస్‌రెడ్డిని టీఎంయూ సన్మానించింది. ఈ సందర్భంగా ఎన్ఎంయు, ఈయూ నుంచి కార్మికులు టీఎంయూలో చేరా రు. సభలో టీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, కె.వాసుదేవరెడ్డి, టీఎంయూ నాయకులు వి.ఎస్.రెడ్డి, పిఆర్ రెడ్డి, పి.లక్ష్మయ్య, ఎం.ఎన్.రావు, ఈఎస్ బాబు,తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
► పాలమూరు ఎత్తిపోతల ఆగినా ఈ పనులు ఆగొద్దు ► జూలైలో 2లక్షల ఎకరాలకు నీరివ్వడ మే లక్ష్యం ► రూ.1950 కోట్లు సిద్ధంగా ఉన్నాయి ► పనుల నిర్వహణలో అలసత్వం వద్దు ► ప్రతి సోమవారం పురోగతిపై సమావేశం నిర్వహించాలి ► రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వచ్చే జూలై నెలలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంగా యుద్దప్రాతిపదికన జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్‌రావు, పెంటారెడ్డి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావుతో కలిసి మంత్రి హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టులు, ప్యాకేజీల వారిగా ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలతో పనుల పురోగతిపై సమీక్షించారు. పాల మూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. 95 శాతం పూర్తయి మిగతా 5శాతం పనులు పెండింగ్‌లో ఉండడం కారణంగా ప్రాజెక్టులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని, పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.1950 కోట్లు కేటాయించిందన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వడంలేదనే దష్ర్పచారం జరుగుతుందని, అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తి చేయాలన్నారు. డబ్బులు, అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పనులు సాఫీగా నిర్వహించి జూలై నెలలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి పనులు సాఫీగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ రాంకిషన్‌ను ఆదేశించారు. ప్రాజెక్టులకు నిధులు ఇచ్చినా పూర్తిచేయడంలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. ప్యాకేజీ వారీగా పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు వాట్సప్ గ్రూపులోకి రావాలని ఎక్కడ ఏ సమస్య వచ్చినా మెసేజ్ ఇవ్వాలని సూచించారు. గడువులోగా పూర్తిచేయకుంటే చర్యలు నిర్ణయించిన గడువులోగా పనులు చేయకపోతే తెలంగాణలో ఎక్కడా పనులు చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలో ఈ రోజే ఎంతరాత్రయినా అధికారులకు టార్గెట్లు ఇచ్చి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని జిల్లా ప్రాజెక్టుల సీఈ ఖగేందర్‌ను మంత్రి ఆదేశించారు. ఇసుక సమస్య రాకుండా అసైన్డ్, పట్టా భూముల్లో అనుమతులు మంజూరు చేయాలని జేసీని ఆదేశించారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొనే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోని కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పనులు ఆగినా పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఆగొద్దని మంత్రి సూచించారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ సమక్షంలో సమావేశం నిర్వహించుకొని ప్రాజెక్టు పనుల తీరుపై చర్చించాలని ఆదేశించారు. డిండి వరకు నీరిస్తేనే కేఎల్ఐ పూర్తయినట్లు అని అన్నారు. అంతకుముందు ప్యాకేజీ వారిగా పురోగతిపై చర్చించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ భాస్కర్, పాలమూరు-రంగారె డ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఈ లింగరాజు, ఎస్ఈలు పీజేపీ రఘునాథ్‌రావు, కేఎల్ఐ భద్రయ్య, పీఆర్ఎల్ నర్సింహ, ఈఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
రాశి కాదు.. వాసి ముఖ్యం
నిరుద్యోగులు తల్లిదండ్రుల కలలు నేరవేర్చాలి రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్ : గ్రూప్ టూ ఉచిత శిక్షణకు ఎంతమంది అభ్యర్థులు అర్హులయ్యారనేది ముఖ్యం కాదని, ప్రతిభ కనబర్చి ఎంతమంది ఉద్యోగాలు సంపాదించారన్నదే ముఖ్యమని, రాశి కన్నా వాసి ముఖ్యం అన్నట్లు ప్రతి ఒక్కరూ నిర్ధేశిత లక్ష్యంతో రెండు నెలలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో ఆదివారం మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా ఇస్తున్న గ్రూప్2 శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సిద్దిపేటలో కానిస్టేబుల్ పోస్టుల నియమకాల కోసం నిర్వహించిన పరీక్షను దృష్టిలో పెట్టుకొని శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. యువత నుంచి వచ్చిన స్పందనతో మరోసారి గ్రూప్2 పరీక్షకు ఉచిత శిక్షణ తరగతులను సొంతంగా నిర్వహిస్తున్నానన్నారు. ఉచితం అనగానే నిర్లక్ష్యం, అశ్రద్ధ ఉంటుందని అది మంచిదికాదన్నారు. ప్రముఖ కోచింగ్ సంస్థ డీజేఆర్కు శిక్షణ బాధ్యత అప్పగించి, తాను సొంతగా డబ్బులు చెల్లిస్తున్నానన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించినప్పుడే తన అశయం నేరవేరుతుందన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లల ఆర్ధిక పరిస్థితి తనకు తెలుసని, వారిపై ఆర్ధిక భారం పడకుండా ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రుల అశలను, కలలను నిజం చేయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఉచిత భోజన వసతి కల్పిస్తాం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 350 మంది విద్యార్ధులు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించినప్పుడే తన ప్రయత్నానికి సార్ధకత చేకూరుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదవర్గాలకు నాణ్యతతో కూడిన శిక్షణను అందించేందుకు చేసే కృషిలో భాగంగానే 717 మందికి ఆర్హత పరీక్షలు నిర్వహించగా 350 ఆర్హత సాధించడం జరిగిందన్నారు. వీరందరికి రెండు నెలల పాటు శిక్షణ ఇప్పించి, శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి కల్పిస్తామన్నారు. అదే విధంగా స్టడీ మెటీరియల్‌ను అందిస్తామన్నారు. అంతకు ముందు డీ జేఆర్ సంస్థ చీఫ్ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నగరాలకే పరిమితమైన శిక్షణ తరగతులను మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలో నిర్వహిస్తున్నామన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకు ముందు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటామని మంత్రి హరీశ్‌రావు యువతీయువకులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ రాగుల సారయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు చిన్నా, మచ్చవేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి చేసి చూపిస్తా..
మాటమీద నిలబడతా ఖేడ్‌లో మంత్రి హరీశ్‌రావు రోడ్ షో.. నారాయణఖేడ్ : రాష్ర్ట నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నారాయణఖేడ్ పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావుతోపాటు, అభ్యర్థి భూపాల్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, బాబుమోహన్, ఎమ్మెల్సీ రాములునాయక్, నాయకులు మోహిద్‌ఖాన్, బిడెకన్నె హన్మంతు, అశోక్ షెట్కార్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. బసవేశ్వర చౌక్ నుంచి ప్రారంభమైన రోడ్‌షో రాజీవ్‌చౌక్, నెహ్రూనగర్, మన్సుర్‌పూర్, చాంద్‌ఖాన్‌పల్లి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ టీడీపీకి ఓటేస్తే నల్లవాగు ప్రాజెక్టులో వేసినట్లేనన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆస్పత్రి, వంతెన, రోడ్డు, బస్టాండ్‌లో సీసీ రోడ్డు, మార్కెట్‌యార్డు, పండరీపూర్, వేములవాడ బస్సునడగితే ఎవరు అభివృద్ధి చేశారో చెబుతాయన్నారు. కేవలం కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశతో ఉందన్నారు. ఎన్నికలయ్యాక జానారెడ్డి, హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ జిల్లాకు పోతారన్నారు. తాను జిల్లా మంత్రిగా ఇక్కడే ఉండి అభివృద్ధి చేస్తానని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్నారు. లక్ష మెజార్టీ సాధించుకొని సీఎం వద్దకు వెళ్ళి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకొని అభివృద్ధి