అభివృద్ధి చేసి చూపిస్తా.. | Matamida nilabadata | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేసి చూపిస్తా..

Published Sun, Feb 7 2016 1:55 AM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM

అభివృద్ధి చేసి చూపిస్తా.. - Sakshi

అభివృద్ధి చేసి చూపిస్తా..

మాటమీద నిలబడతా
ఖేడ్‌లో మంత్రి హరీశ్‌రావు రోడ్ షో..

నారాయణఖేడ్ :  రాష్ర్ట నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నారాయణఖేడ్ పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావుతోపాటు, అభ్యర్థి భూపాల్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, బాబుమోహన్, ఎమ్మెల్సీ రాములునాయక్, నాయకులు మోహిద్‌ఖాన్, బిడెకన్నె హన్మంతు, అశోక్ షెట్కార్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. బసవేశ్వర చౌక్ నుంచి ప్రారంభమైన రోడ్‌షో రాజీవ్‌చౌక్, నెహ్రూనగర్, మన్సుర్‌పూర్, చాంద్‌ఖాన్‌పల్లి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ టీడీపీకి ఓటేస్తే నల్లవాగు ప్రాజెక్టులో వేసినట్లేనన్నారు.

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆస్పత్రి, వంతెన, రోడ్డు, బస్టాండ్‌లో సీసీ రోడ్డు, మార్కెట్‌యార్డు, పండరీపూర్, వేములవాడ బస్సునడగితే ఎవరు అభివృద్ధి చేశారో చెబుతాయన్నారు. కేవలం కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశతో ఉందన్నారు. ఎన్నికలయ్యాక జానారెడ్డి, హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ జిల్లాకు పోతారన్నారు. తాను జిల్లా మంత్రిగా ఇక్కడే ఉండి అభివృద్ధి చేస్తానని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్నారు. లక్ష మెజార్టీ సాధించుకొని సీఎం వద్దకు వెళ్ళి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకొని అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement