ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయూలి
► మంత్రి హరీష్‌రావు విధానాలు హర్షణీయం
► ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య
పాలకుర్తి : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను బ లోపేతం చేసిన తర్వాతనే రేషనలైజేషన్ చే యాలని ప్రముఖ విద్యా వేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. గూడూరు గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం జరిగిన 40వ వార్షికోత్సవ వేడుకలకు చుక్కా రామయ్య హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ప్రభుత్వ హైస్కూల్‌లో చదివే బాలబాలికలు రక్తహీనత సమస్యతో భాదపడుతున్నారని, వారికి ఏడాదిలో ఒక సారైనా వై ద్య పరీక్షలు చేయించాలని సూచించారు. వి ద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచినప్పుడే బడుగు వర్గాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
నాణ్యమైన విద్యను అందించి విద్యావంతులను తయారుచేసినప్పుడు విదేశీ కంపెనీలు వాటంతట అవే మన రాష్ట్రానికి తరలివస్తాయని అన్నారు. సామాన్య రైతు నిలదొక్కుకునే విధంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అమలు చేస్తున్న విధానాలు హర్షణీయమని అన్నారు. మిషన్ కాకతీ య, వాటర్ గ్రిడ్ పథకాలు అమలు వల్ల గ్రా మీణ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సర్పంచ్ మాచర్ల పుల్లయ్య, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు ఉన్నారు.