Water grid schemes
-
రూ.1,400 కోట్లతో ‘పశ్చిమ’కు తాగునీరు
సాక్షి, అమరావతి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా కల్చర్‌తో ఏర్పడిన నీటి కాలుష్యంతో పాటు తీర ప్రాంతంలో ఉప్పునీటి సాంద్రత కారణంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా రూ.1,400 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పనులకు సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21న శంకుస్థాపన చేయనున్నారు. నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, దెందులూరు (కొంత భాగం), తాడేపల్లిగూడెం (కొంత భాగం) పరిధిలోని 26 మండలాల ప్రజలకు పథకం ద్వారా ఏడాది పొడవునా తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 1,178 గ్రామీణ నివాసిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయిని ఏర్పాటు చేసి రోజూ సగటున ప్రతి వ్యక్తికి 55 లీటర్ల సురక్షిత తాగునీటి సరఫరా చేస్తామని గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. సమీపంలోని నదుల నుంచి.. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇప్పటికే రక్షిత మంచినీటి పథకాలున్నా సరఫరా చేయడానికి నీరు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఏడాది పొడవునా తాగునీటి సరఫరా జరిగేలా సమీప నదులతో ప్రత్యేక పైపులైన్ల ద్వారా అనుసంధానిస్తున్నారు. సీఎం ప్రారంభించనున్న రూ.1,400 కోట్ల తాగునీటి పథకానికి కూడా గోదావరి నుంచి ఏటా 1.374 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. 30 నెలల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. రూ.10,131 కోట్ల పనులు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వాటర్ గ్రిడ్ ద్వారా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో రూ.10,131 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ప్రభుత్వం చేపట్టింది. దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి రాగానే సీఎం జగన్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.480 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు ఇప్పటికే 34 శాతానికిపైగా జరిగాయి. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో రూ.279 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు 25 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగతా చోట్ల త్వరలోనే ప్రారంభం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,650 కోట్లతో, ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.1,290 కోట్లతో, ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో రూ. 1,200 కోట్లతోనూ, ఉమ్మడి కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో రూ.750 కోట్లతో, ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.2,370 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా శాశ్వత రక్షిత మంచినీటి పథకాలకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తి చేసింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. -
రూ.6,290 కోట్లతో మంచినీటి పథకాలు
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం.. మొత్తం 5 పాత జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో మొత్తం రూ.6,290 కోట్లతో కొత్త మంచినీటి పథకాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆయా పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై బుధవారం నుంచి 10 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్టు గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ (ఆర్డబ్ల్యూఎస్) ఈఎన్సీ కృష్ణారెడ్డి తెలిపారు. పనుల ప్రతిపాదనల వివరాలను జ్యుడిషియల్ ప్రివ్యూ అధికారిక వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచారు. వాటర్ గ్రిడ్ పథకంలో ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే 30 ఏళ్ల కాలంలో పెరిగే ప్రజా అవసరాల దృష్ట్యా కొత్తగా మంచినీటి పథకాలను ప్రభుత్వం నిర్మించబోతోంది. ఏడాది మొత్తం ఆయా పథకాలకు నీరు అందుబాటులో ఉండేలా ముందస్తుగా ప్రత్యేక జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సముద్ర తీరప్రాంతంలో రూ.1,650 కోట్లతో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సముద్ర తీరప్రాంతంలో రూ.1,400 కోట్లతో ప్రభుత్వం కొత్తగా మంచినీటి పథకాల నిర్మాణం చేపడుతుంది. కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలో రూ.750 కోట్లతో, కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో రూ.1,200 కోట్లతో, ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో కొత్తగా మంచినీటి పథకాల నిర్మాణం చేపడుతున్నారు. -
పల్నాడుకు జీవధార
సాక్షి, అమరావతి బ్యూరో : పల్నాడు ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పాదయాత్ర సమయంలో గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్‌రెడ్డితోపాటు, పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో తాగునీటి సమ స్య పరిష్కారం కోసం రూ. 2,655 కోట్లతో ప్రభు త్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. పనులకు టెండర్లను పిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్తగా తయారు చేసిన ప్రతిపాదనల్లో గ్రామీణ ప్రాంతాల్లో మనిషికి వంద లీటర్ల చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 125 లీటర్ల చొప్పున తాగునీరు ఇచ్చే విధంగా అధికారులు అంచనా రూపొందించారు. ప్రభు త్వం ప్రాధాన్యతా క్రమంలో ఈ వాటర్ గ్రిడ్ పనులకు ఆమోదం తెలిపింది. బుగ్గువాగు రిజర్వాయర్లకు.. బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి గురజాల నియోజకవర్గంతోపాటు, పెదకూరపాడులోని కొంత భాగానికి తాగునీటిని సరఫరా చేయనున్నారు. దీనికి సంబంధించి రూ.365 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. దీని పరిధిలో 78 ఆవాస ప్రాంతాలకు తాగునీరు ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,46,378 మందికి, పట్టణ ప్రాంతాల్లో 74,365 మందికి..మొత్తం 3,20,743 మందికి తాగునీరు ఇవ్వనున్నారు. ఇందుకోసం 0.4910 టీఎంసీల నీరు అవసరం కానుంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి.. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, ప్రత్తిపాడు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో కొంత భాగానికి తాగునీరు అందివ్వనున్నారు. దీని ద్వారా మొత్తం 35 మండలాల్లోని 904 ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందనుంది. దీని కోసం రూ.2,300 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 19,41,030 మందికి, పట్టణ ప్రాంతాల్లో 2,84,777 మందికి.. మొత్తం 22,25,807 మందికి తాగునీరు అందనుంది. దీని కోసం 3.2947 టీఎంసీల నీరు అవసరమవుతోందని అధికారులు అంచనా వేశారు. మొత్తం బుగ్గువాగు, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల పరిధిలో 12 నియోజకవర్గాల్లోని 40 మండలాల్లో 982 ఆవాస ప్రాంతాల్లో తాగునీరు అందనుంది. దీని కోసం మొత్తం రూ. 2,665 కోట్ల పనులకు ప్రభుత్వంఅనుమతి ఇచ్చింది.దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 21,87,408 మందికి, పట్టణ ప్రాంతాల్లో 3,59,142 మందికి.. మొత్తం 25,46,550 మందికి పుష్కలంగా నీరు అందించనున్నారు. దీని కోసం మొత్తం 3.7857 టీఎంసీల నీరు అవసరం కానున్నట్లు అధికారులు తెలిపారు. నీటిని ఇలా పంప్ చేస్తారు.. బుగ్గవాగు, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో కలి పి 8.95 కిలో మీటర్ల మేర పంపింగ్ చేయ నున్నారు. దీని పరిధిలో 45ఎంఎల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి, మూడు 100 ఎంఎల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉంటాయి. సంప్వెల్స్ మొత్తం 62 ఉండనున్నాయి. ఓహెచ్డీఆర్ఎస్లు 38, అడిషనల్ ఓహెచ్ఎస్ఆర్ఎస్లు 422 ఉండనున్నాయి. మొత్తం కెపాసిటీ ఆఫ్ పంప్‌సెట్స్ (హెచ్‌పీఎస్) 9,820 అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈప్రాజెక్టు పూర్తయితే పల్నాడు ప్రజలకు తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది. త్వరలో టెండర్లు పల్నాడు తాగునీటి మంచినీటి పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ప్రక్రియ సాగుతోంది. మొత్తం రూ. 2,665 కోట్లతో ఈ పనులకు అంచనాలు రూపొందించారు. నెలలోపు టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. ప్రభుత్వం ఈ పనులకు ప్రాధాన్యత ఇచ్చింది. – వీవీ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఎస్ఈ, గుంటూరు -
ప్రజలందరికీ పరిశుభ్రమైన నీరు
-
మంచినీటి పధకాలు తాకట్టు
-
‘తాగునీటి’ ఆస్తులు తాకట్టు
సాక్షి, అమరావతి:ప్రభుత్వం మీ ఇంటికి శుద్ధమైన మంచినీటినిసరఫరా చేసినా,చేయకపోయినా తాగునీటి పథకానికి సంబంధించిమీ ఊరిలో ఓవర్‌హెడ్ ట్యాంకు, నీళ్ల మోటార్లు, కొన్నిచోట్ల దానికి అనుబంధంగాఓ సమ్మర్ స్టోరేజి ట్యాంకు లాంటివి ఉన్నాయా?వీటన్నింటినీ అప్పుల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. వాటర్ గ్రిడ్ పేరుతో మంచినీటి పథకాలకు సంబంధించిన అన్ని రకాల భూములు, ఇతర స్థిర, చరాస్తులను తాకట్టు పెట్టి రూ.14,769 కోట్లు అప్పు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో కమీషన్ల కోసం తమవారికి రూ.వందల కోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారు. ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల వద్ద అప్పులు చేస్తూ ఆ డబ్బులతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వాటర్ గ్రిడ్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాల పునరుద్ధరణ, కొత్తవి ఏర్పాటు చేస్తామంటూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన మంచినీటి పథకాల సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, మంచినీటి పథక కేంద్రాలు, మోటార్లు, ఓవర్ హెడ్ ట్యాంకులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌కు అప్పగించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామీణ మంచినీటి పథకాలను బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ.5,330 కోట్లు అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో మంచినీటి పథకాలను తాకట్టు పెట్టి రూ.9,439 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఆస్తులు తాకట్టు పెట్టి పలు బ్యాంకుల్లో రుణాలు.. – కృష్ణా, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలోని 4,790 గ్రామాల్లో మంచినీటి పథకాల ఆస్తులన్నింటినీ ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ మూడు బ్యాంకులకు తాకట్టు పెట్టేసింది. మూడు బ్యాంకుల నుంచి ఈ ఆస్తులపై రూ.2,500 కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయించారు. – కృష్ణా జిల్లా గుడివాడ, గన్నవరం, పెనమలూరు, తిరువూరు, పామర్రు, మచిలీపట్నం, అవనిగడ్డ, కైకలూరు, నియోజకవర్గాల పరిధిలో 2,143 ప్రాంతాలకు నీరందించే 1,188 మంచినీటి పథకాలను పంజాబ్ అండ్ సిందు బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.1,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారు. – పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, భీమవరం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లోని మంచినీటి పథకాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, రామచంద్రాపురం, కొత్తపేట, రాజానగరం నియోజకవర్గాలోని మంచినీటి పథకాలను విజయ బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.1,000 కోట్లు అప్పు తీసుకోనున్నారు. ఇప్పటికే ఇందులో రూ.300 కోట్లు అప్పు తీసుకున్నారు. – కెనరా బ్యాంకు నుంచి రూ.500 కోట్లు అప్పు కోసం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, జగ్గంపేట, మండపేట నియోజకవర్గాలోని మంచినీటి పథకాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, ఇచ్చాపురం, పాలకొండ, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి, రాజాం నియోజకవర్గాల్లోని మంచినీటి పథకాలను తాకట్టు పెట్టారు. అప్పులకు తోడు అక్రమాలు.. ప్రతి ఒక్కరికీ 70 లీటర్ల చొప్పున ఇంటింటికీ కుళాయి ద్వారా మంచి నీటి సరఫరాకు అనుగుణంగా గ్రామాల్లో మంచినీటి పథకాలు ఆధునీకరించడం, లేనిచోట కొత్తవి నిర్మించడం కోసం వాటర్ గ్రిడ్ పథకం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి లోకేష్ ఏడాదిన్నరగా చెబుతున్నారు. ఈ పనులకు సంబందించిన టెండర్ల ప్రక్రియను మాత్రం ఎన్నికల ముందు మొదలుపెట్టారు. శ్రీకా>కుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ పథకం పనులను రెండు విడతల్లో చేపడుతుండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో ఒకే విడతలో అమలుకు టెండర్లు నిర్వహిస్తోంది. రూ. 22 వేల కోట్ల అంచనాతో వాటర్ గ్రిడ్ పథకానికి తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు కొల్లగొట్టేందుకు ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన నేపధ్యంలో అంచనాలు అదనంగా మరో రూ. 3 – 4 వేల కోట్లు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్ కింద అదనంగా నిర్మించే మంచినీటి పథకాలకు రూ.852 కోట్లు ఖర్చు అవుతుందని మొదట అంచనా వేయగా తర్వాత ఇది రూ. 994 కోట్లకు పెరిగింది. కొత్త ఎస్ఎస్ఆర్ ధరలను అమలు చేస్తే ఇది మరో రూ. 7 – 10 కోట్ల దాకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పెరిగిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఏడు జిల్లాలో పథకానికి రూ.10,925 కోట్లు వ్యయం అవుతుందని తొలుత అంచనా వేయగా తర్వాత ఇది రూ.12,525 కోట్లకు పెరిగినట్లు పేర్కొంటున్నారు. ►ఇప్పటికే రుణానికి అనుమతించిన మొత్తం 5,330 కోట్ల రూపాయలు ►తాజాగా అప్పుకు ప్రతిపాదనల విలువ 9,439 కోట్ల రూపాయలు -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయూలి
► మంత్రి హరీష్‌రావు విధానాలు హర్షణీయం ► ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య పాలకుర్తి : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను బ లోపేతం చేసిన తర్వాతనే రేషనలైజేషన్ చే యాలని ప్రముఖ విద్యా వేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. గూడూరు గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం జరిగిన 40వ వార్షికోత్సవ వేడుకలకు చుక్కా రామయ్య హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ప్రభుత్వ హైస్కూల్లో చదివే బాలబాలికలు రక్తహీనత సమస్యతో భాదపడుతున్నారని, వారికి ఏడాదిలో ఒక సారైనా వై ద్య పరీక్షలు చేయించాలని సూచించారు. వి ద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచినప్పుడే బడుగు వర్గాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నాణ్యమైన విద్యను అందించి విద్యావంతులను తయారుచేసినప్పుడు విదేశీ కంపెనీలు వాటంతట అవే మన రాష్ట్రానికి తరలివస్తాయని అన్నారు. సామాన్య రైతు నిలదొక్కుకునే విధంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అమలు చేస్తున్న విధానాలు హర్షణీయమని అన్నారు. మిషన్ కాకతీ య, వాటర్ గ్రిడ్ పథకాలు అమలు వల్ల గ్రా మీణ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సర్పంచ్ మాచర్ల పుల్లయ్య, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు ఉన్నారు.