ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ కావాలి
ఏపీ ప్రజలపై అలవిమాలిన భారం పడకుండా ఉండాలంటే 15 ఏళ్ల ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ ఉండాల్సిందే. రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఉద్యమించి కేంద్రం మెడలు వంచాల్సిందే. లేదంటే ఏపీకి వర్తమానం, భవిష్యత్ రెండూ లేనట్లే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఇప్పుడు కేంద్రం దయాదాక్షి ణ్యాల మీద ఆధారపడి ఉంది. ఇక్కడి ప్రజలు తమ భవిత వ్యంపై చెందుతున్న ఆందోళ నపై కనీస ఆలోచన కూడా చేయడంలేదు. ఢిల్లీలోని మోదీ సర్కార్ ప్రత్యేక హోదాపై ఆశ లు కల్పిస్తూనే మంచి ప్యాకేజీ ఉంటుందని కాకమ్మ కబుర్లు చెబుతోంది. అప్పటి కాం గ్రెస్, ఇప్పటి బీజేపీ ప్రభుత్వాల ధోరణి ఏపీపై ఒకేలా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీని గొంతు నులిమి విసి రేస్తే బీజేపీ ప్రభుత్వం కొన ఊపిరిలో ఉన్న ఏపీని నాటు వైద్యంతోనో, ఆర్‌ఎంపీతోనో వైద్యం చేయించాలి అని ఆలోచిస్తోంది. ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్రం అం ధకారంలోకి కూరుకుపోతుందన్న భయాందోళనలలో పలువురుప్రాణత్యాగాలకు సిద్ధమవుతున్నారు.
టీడీపీ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ప్రధానిని కలసి విజ్ఞా పన పత్రాలు ఇవ్వడం వరకే పరిమితమైంది. కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితి కనబడటంలేదు. కనీసం రాష్ట్రం లో అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే ఉద్దేశం కూడా లేదు. మరోపక్క చంద్రబాబు ప్యాకే జీ వస్తుందని ప్రజలను మభ్యపెడుతున్నారు. కేంద్రాన్ని నిలదీసి ఏపీ డిమాండ్లను సాధించుకోవలసింది పోయి మోదీకి సలాములు చేసి వచ్చేస్తున్నారు. అఖిలపక్షాన్ని వేసి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసే దిశగా నడుస్తోంది. ఇన్నే ళ్లూ పెట్టుబడులన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరిగాయి.
పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ కంపెనీలు, కేం ద్ర ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటే రియట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, విశ్వ విద్యా లయాలు, ఒకటేమిటి? సమస్తం జంట నగరాల్లోనే ఏర్పాటయ్యాయి. ఏపీలో కూడా అలాంటి అభివృద్ధి సాధించాలంటే ఒక్క ప్యాకేజీల వల్ల మాత్రమే సాధ్యం కాదు. ప్యాకేజీ అన్నది వెనుకబడి ఉన్న కొన్ని జిల్లాలకు పరిమితమవుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సమగ్ర అభివృద్ధి జరగదు.
ఉత్తరప్రదేశ్‌లో ముందేల్‌ఖం డ్ అభివృద్ధికి కేంద్రం 2009లో ప్యాకేజీ ఇచ్చినా అక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం. 2009 నుంచి 2012 వరకూ రూ.1,212 కోట్లు విడుదలచేస్తే కేవలం 744 కోట్ల రూపా యలు మాత్రమే ఖర్చు చేశారు. ఈ నిధులు కూడా కేవ లం నీటి ఎద్దడి నివారణకు, నీటిపారుదల వ్యవస్థకు మాత్రం ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. పైగా కేం ద్రం ఇచ్చే ప్యాకేజీ అందరికీ తెలిసిందే. చూడ్డానికి భారీగా లక్ష కోట్లుగానో, రెండు లక్షల కోట్లుగానో కనిపి స్తుంది. కానీ దాని లోతులకు వెళ్తేగాని అసలు రంగు బయటపడదు. ఉదాహరణకు 50 వేల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి అంటారు. మనం సంబర పడ తాం. కానీ ఈ 50 వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా కేంద్రం ఖర్చు చేయదు. ప్రైవేటు కంపెనీయే పీపీపీ కింద కాంట్రాక్టు వేసుకొని రోడ్డు నిర్మిస్తుంది. దాన్ని కేం ద్ర సాయం అని అనగలమా?
కేంద్రం మొత్తం ఆదాయం నుంచి 30 శాతం ప్రత్యే క హోదా రాష్ట్రాలకు కేటాయిస్తుంది. సాధారణ కేంద్ర సహాయం, అదనపు కేంద్ర సహాయం ప్రత్యేక కేంద్ర సహాయం అనే మూడు పద్దుల కింద గ్రాంటుల రూపం లో నిధులు ప్రతియేటా వస్తాయి. ఏ రకమైన పద్దుల కిం ద నిధులు విడుదల చేసినా అవి 90 శాతం గ్రాంటుల కిందకే వస్తాయి. రాష్ట్రాలు తిరిగి ఈ మొత్తాలను చెల్లించ నవసరం లేదు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు అవస రం మేర రుణాలను పొందే స్వేచ్ఛ కూడా ఉంటుంది. 90 శాతం గ్రాంటు, 10 శాతం రుణాల ఫార్ములాను కేం ద్ర ప్రాయోజిత పథకాలు, విదేశీ సాయంతో నడిచే పథ కాలకు వర్తింపజేస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రా లకు పలు రాయితీలు, పన్ను మినహాయింపులు, ఎక్సై జ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్లలో మినహాయింపులు ఉంటాయి.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు వెళ్లే నిధుల మొత్తం 2014-15లో 3 లక్షల 2 వేల కోట్ల రూపాయలు. రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచిన తరువాత ఈ మొత్తం 2015-16లో రూ.3 లక్షల 71 వేల కోట్లకు పెరిగింది. అలాగే ఆర్థిక గ్రాంటుల ద్వారా రాష్ట్రాలకు 2014-15లో 55 వేల కోట్లు వస్తే, 2015-16లో 77 వేల కోట్లకు పెరి గింది. అంటే మొత్తం ఈ రెండు పద్దుల కింద రూ. 89 వేల కోట్ల మేరకు రాష్ట్రాలకు వచ్చే నిధులు పెరిగాయన్న మాట. దీన్నే కేంద్రం భూతద్దంలో చూపించి ప్రచారం చేసుకుంటోంది. కానీ ప్రతియేటా విడుదలయ్యే ప్లాన్ గ్రాంటులో కేంద్రం భారీ కోతను విధించింది. 2014- 15లో ఈ మొత్తం 2 లక్షల 61 వేల కోట్లు కాగా, 2015- 16లో ఇది లక్షా 39 వేల కోట్లకు తగ్గిపోయింది. అంటే ఒక లక్షా 22 వేల కోట్ల రూపాయల నిధులు తగ్గిపోయా యి. అదనపు నిధుల మాట దేవుడెరుగు రాష్ట్రాలకు రావలసిన అసలు నిధులే తగ్గిపోయాయి.
రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే 15 ఏళ్ల ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ ఉండాల్సిందే. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. అసెంబ్లీలో కూడా తన వాదనలు వినిపించారు. సెప్టెంబర్ 15 లోగా హోదా ప్రకటించక పోతే గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేపడతానని ప్రకటించారు.
కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తు న్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ముం దుకు నడవడం లేదు. ఈ సమయంలో ప్రజలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి కేంద్రం మెడలు వంచాల్సిందే. లేదంటే ఏపీకి వర్తమానం, భవిష్యత్ రెండూ లేనట్లే.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, మొబైల్:9348550909
- వి.వి.రమణమూర్తి