మాకు తీవ్ర అన్యాయం జరిగింది.. ప్యాకేజీలో వివక్ష చూపించారు.. మాగోడు ఎవరూ పట్టించుకోరా అంటూ పులిచింత ముంపు గ్రామాల బాధితులు ఆవేదనవ్యక్తం చేశారు.
మా గోడు ఎవరూ పట్టించుకోరా..?
Published Mon, Aug 19 2013 6:49 AM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
మేళ్లచెరువు, న్యూస్‌లైన్ :మాకు తీవ్ర అన్యాయం జరిగింది.. ప్యాకేజీలో వివక్ష చూపించారు.. మాగోడు ఎవరూ పట్టించుకోరా అంటూ పులిచింత ముంపు గ్రామాల బాధితులు ఆవేదనవ్యక్తం చేశారు. తెలంగాణ మట్టి మనిషి పాండురంగారావు ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని వెల్లటూరులో పులిచింతల ముంపు గ్రామాల ప్రజలతో ప్రజాసంఘాల నాయకులు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల బాధితులు మాట్లాడారు. ముంపునకు గురయ్యే బాధితులకు ఇచ్చిన ప్యాకేజీలో గుంటూరు జిల్లా వారికి ఓ రకంగా తమకు ఓ రకంగా కేటాయించారని ఆవేదనవ్యక్తం చేశారు. నక్కగూడెం గ్రామం చుట్టూ ప్రాజెక్ట్ నీరు చేరుతున్నందున ఆ గ్రామాన్ని కూడా మంపు గ్రామంగా ప్రకటించాలని విన్నవించారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెమలిపురి గ్రామ శివారులో రెండో పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞాప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ముంపు వాసుల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేసి న్యాయం జరిగే విధంగా చూస్తామని ప్రజాసంఘాల నాయకులు హామీయిచ్చారు. కార్యక్రమంలో మానవ హక్కులవేదిక, జల సాధన సమితి, తెలంగాణా మట్టిమనుషులు, ప్రజాసంఘాల నాయకులు జీవన్‌కుమార్, దుశ్చర్ల సత్యనారాయణ, పి.సుబ్బారావు, వసంతలక్ష్మీ, పురుషోత్తం, కార్తీక్, బాబయ్య, రామ్మోహన్‌రావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, రేటోజు ఉమాకాంత్, సీతారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రవీంద్ర నాయక్, కార్తీక్, శ్రీను, నర్సింహారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement