అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
కళ్లకు గంతలు కట్టుకొని ఎంఆర్‌పీఎస్ నిరసన
కర్నూలు(అర్బన్): ఎస్సీ వర్గీకరణ సాధన కోసం చేస్తున్న పోరాటంలో నాయకులను అరెస్టు చేసి ఉద్యమాలను ఆపాలేరని ఎంఆర్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కమతం పరశురాం మాదిగ అన్నారు. ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆ సమితి పట్టణ ఇన్‌చార్జ్ రవి మాదిగ అధ్యక్షతన నేతలు, కార్యకర్తలు స్థానిక పాతబస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ సాధనకు ప్రాణ త్యాగాలకైనా సిద్ధమన్నారు. కొందరు మాదిగ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి రావెల కిశోర్‌బాబుతో ప్యాకేజీలు కుదుర్చుకుని వర్గీకరణకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
జిల్లా అధ్యక్షుడు సుభాష్ చంద్రమాదిగ మాట్లాడుతు వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని ఎండగడతామన్నారు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు రామకృష్ణమాదిగ, బీవీ రమణ మాదిగ, రమణమ్మ, సత్యమ్మ, లక్ష్మమ్మ, తిమోతి, ప్రభుదాసు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మంద కృష్ణను విమర్శించే అర్హత లేదు
మందకృష్ణమాదిగను విమర్శించే అర్హత మాల విద్యార్థి సంఘం నాయకులకు లేదని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పరమేశ్‌మాదిగ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్యాకేజీలు ఎవరు మాట్లాడుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. మాల మాదిగ