ప్యాకేజీ అనే పదం సరికాదు, మీడియా వెనక్కి తీసుకోవాలి | Botsa satyanarayana appeals to Media to withdraw Package word | Sakshi
Sakshi News home page

ప్యాకేజీ అనే పదం సరికాదు, మీడియా వెనక్కి తీసుకోవాలి

Published Sat, Nov 23 2013 1:03 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

ప్యాకేజీ అనే పదం సరికాదు, మీడియా వెనక్కి తీసుకోవాలి - Sakshi

ప్యాకేజీ అనే పదం సరికాదు, మీడియా వెనక్కి తీసుకోవాలి

విజయనగరం: రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమాంధ్రకు ప్యాకేజీ అనే పదాన్ని వాడటం సరికాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్యాకేజీ అనేది వ్యాపారంలో వాడే పదమని..... ఈ పదాన్ని మీడియానే వెనక్కి తీసుకోవాలన్నారు. తాము పోరాడుతుంది హక్కుల కోసమే కానీ... ప్యాకేజీ కోసం కాదని బొత్స వ్యాఖ్యానించారు.

సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించి కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం) విభజన ప్రక్రియను ఆపాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన అన్నారు. విభజన పక్రియ నేపథ్యంలో జీవోఎం పేర్కొన్న అంశాలపై ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రజల మనోభావాలను గతంలో కేంద్ర బృందానికి మెయిల్ చేసినట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement