మూతపడిన కంపెనీకి మోదీ ప్యాకేజీ | Cabinet okays Rs 4.7k cr package for Hindustan Cables' closure | Sakshi
Sakshi News home page

మూతపడిన కంపెనీకి మోదీ ప్యాకేజీ

Sep 28 2016 4:24 PM | Updated on Sep 4 2017 3:24 PM

మూతపడిన కంపెనీకి మోదీ ప్యాకేజీ

మూతపడిన కంపెనీకి మోదీ ప్యాకేజీ

నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ కేబుల్స్ లిమిటెడ్(హెచ్సీఎల్) మూతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్, ఉద్యోగుల వేతనాలకు బుధవారం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది.

న్యూఢిల్లీ : నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ కేబుల్స్ లిమిటెడ్(హెచ్సీఎల్) మూతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్, ఉద్యోగుల వేతనాలకు బుధవారం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ మూత నేపథ్యంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి, రిటైర్మెంట్ పథకాలకు, ప్రభుత్వ రుణాన్ని ఈక్విటీలోకి మార్చుకునేందుకు అవసరమైన రూ.4,777.05 కోట్ల ప్యాకేజీని  కేంద్రప్రభుత్వం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో హెచ్సీఎల్ను మూసేందుకు ఆమోదించారు. కంపెనీల చట్టం 1956/2013, పరిశ్రమల వివాదాల చట్టం 1947, ఇతర చట్టాల కింద దీన్ని మూసివేస్తున్నట్టు కేంద్ర ఓ ప్రకటనలో తెలిపింది. వీఆర్ఎస్/వీఎస్ఎస్ ప్యాకేజ్ కింద 2007వ పే స్కేల్ను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది.
 
ఈ ప్యాకేజీని నగదు కింద రూ.1,309.90 కోట్లు, నగదురహిత కింద రూ.3,467.15 కోట్లను కంపెనీలోకి ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోని టెలికాం శాఖకు కావలసిన కేబుల్స్ను తయారుచేసే సంస్థగా హెచ్సీఎల్ ఉండేంది. వైర్‌లెస్ ఫోన్‌లు మార్కెట్లోకి రావడంతో ల్యాండ్ ఫోన్లు, వాటికి కేబుల్స్ అవసరం దారుణంగా పడిపోవడంతో  హెచ్‌సీఎల్ మూసివేత స్థితికి చేరింది. 1952లో ఏర్పాటైన ఈ సంస్థ, నాలుగు తయారీ యూనిట్లు రుప్నరైన్ పూర్, నరేంద్రపూర్ (పశ్చిమ బెంగాల్), హైదరాబాద్ (తెలంగాణ),నాని (ఉత్తరప్రదేశ్)లలో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015 ఫిబ్రవరిలోనే కంపెనీని మూసివేయడానికి కేంద్రం సిద్ధమైనా ఉద్యోగుల ఆందోళనలతో వెనక్కి తగ్గింది.అయితే అదే ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement